SSBN College : తెరుచుకున్న ఎస్‌ఎస్‌బీఎన్ కాలేజ్.. సమస్య పరిష్కారమైనట్టేనా... విద్యార్థులు, యూనియన్ లీడర్స్ ఏమంటున్నారు?
అనంతపురం పట్టణంలోని ఎస్‌ఎస్‌బిఎన్ పాఠశాలను ఎయిడెడ్‌గానే కొనసాగిస్తున్నట్లు డీఈవో శామ్యూల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎయిడెడ్‌గా కొనసాగించాలని 15 రోజుల నుంచి విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం కళాశాలకు ఆప్షన్స్ ఇచ్చింది. మొదట కళాశాలను ఎయిడెడ్‌గా కొనసాగించేందుకు కళాశాల పాలకవర్గం లేఖను ప్రభుత్వంకు అందజేసింది. అయితే పాఠశాల మాత్రం ప్రైవేటుగానే కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కళాశాల పాఠశాలను కూడా ఎయిడెడ్‌గానే కొనసాగించాలని విద్యార్థులందరికీ విద్యను అందుబాటులో ఉంచాలని పాఠశాల విద్యార్థులు 2 రోజుల నుంచి ఆందోళన బాట పట్టారు. దీంతో స్పందించిన డి ఈ ఓ ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఈరోజు పాఠశాల పునః ప్రారంభం అయింది.





















