Chittoor Crime News: నా కుమారుడిని చంపి బాత్ రూమ్ గోతిలో పాతిపెట్టా..
చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనలో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. చిత్తూరు జిల్లాలో పీలేరు మండలం అబ్బిరెడ్డిగారిపల్లిలో కుమారుడు గణేశ్‌ను చంపిన తండ్రి రామకృష్ణ.. ఇంటి ఆవరణలోనే పాతి పెట్టాడు. కరోనాతో చనిపోయాడని శవాన్ని పూడ్చేశానని చెప్పాడు రామకృష్ణ . పొంతన లేని సమాధానాలపై భార్య ఎల్లమ్మకు అనుమానం వచ్చింది. పీలేరు పోలీసు స్టేషన్‌లో గణేష్ కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. భర్తపై అనుమానం వ్యక్తం చేసింది. తమ స్టైల్ విచారించడంతో తండ్రి రామకృష్ణ అసలు సంగతి చెప్పాడు. గణేష్‌ను చంపి బాత్ రూం గోతిలో పూడ్చినట్టు వెల్లడించారు. అయితే ఎందుకు చంపాడో మాత్రం చెప్పడం లేదు.



















