CI Slaps office Boy | ఆఫీస్ బాయ్ ని కొట్టిన ఆబ్కారీ సీఐ హసీనాబాను
ఆఫీస్ బాయ్ ని కొట్టిన ఆబ్కారీ సీఐ హసీనాబాను. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం ఆబ్కారీ సీఐ హసీనాబాను ఆఫీసుబాయ్ ను చెప్పుతో కొట్టింది. ఈ వీడియో ఆలస్యంగా వెలు గులోకి వచ్చింది. ఎక్సైజ్ కార్యాలయం పరిధిలో మద్యం అక్రమంగా విక్ర యిస్తున్న వారి నుంచి సదరు సీఐ ప్రతి నెలా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో తన పేరు చెప్పి డబ్బు వసూలు చేస్తున్నారంటూ ఆఫీసు బాయ్ ను సీఐ హసీనాబాను చెప్పుతో కొట్టడం సంచలనం రేపింది. ఇదే విషయంపై ఆఫీస్ బాయ్ నాని ఎక్సైజ్ ఉద్యోగుల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఆ శాఖ ఉద్యోగుల సంఘం నాయకులు ఇటీవల ఆమెతో మాట్లాడేందుకు వచ్చారు. అదే సమయంలో ఆఫీస్ బాయ్, సీఐ పిలిపించి దురుసుగా ప్రవర్తించడమే కాకుండా వారి ఎదుట చెప్పుతో కొట్టారు. ఆమె అక్రమాలపై ఓ ఉన్నతాధికారిణి విచారణ చేసినా ఎలాంటి ప్రయోజనం లేదని ఆ శాఖ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.





















