సముద్రపు అలలు ఇళ్లను తాకుతున్నా..వీడలేక..ఉండలేక!
అక్కడ సముద్రపు అలలు ఇళ్లను తాకటం సాధారణమైపోయింది. తుపాను ప్రభావం మొదలైతే చాలు ఇక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటారు. తీరం దాటిన తుపాను ఈ పల్లె వాసులు పడే అవస్థలు వర్ణనాతీతం. చేపల వేటను నమ్ముకుని..సముద్రమే ఆధారంగా..గంగపుత్రులుగా బతుకున్న వీరి సమస్యలు తీర్చే నాయకుడు కనపడటం లేదు. ఎన్నికలు వచ్చి వెళ్తున్నా నాయకుల మాటలు నమ్మి ఓటేసి మోసపోవటం తప్ప మరొకటి మిగలటం లేదని ఇక్కడి మత్య్సకారులు ఆవేదనతో చెబుతారు. సముద్రం సావాసం చేస్తూ తుపానులకు జడుస్తూ బతుకుతున్న విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామంపై ఏబీపీ దేశం గ్రౌండ్ రిపోర్ట్. మరోవైపు విజయవాడను కూడా వర్షం ముంచెత్తింది. పలు లోతట్టు ప్రాంతాలు ఏకంగా మునిగిపోయాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ బిజీగా ఉన్నారు. వరద కారణంగా మునిగిన ప్రాంతాల్లో ఉన్న ప్రజలు భయపడాల్సిన అవసరం ఏ మాత్రం లేదని, తానున్నానని ధైర్యం చెప్తున్నారు.