Balineni Srinivasa Reddy: చంద్రబాబు వల్ల కాదన్న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
గతంలో జయలలిత శపథం చేసినట్లు చంద్రబాబునాయుడు కూడా ముఖ్యమంత్రి అయిన తరువాత అసెంబ్లీకి వస్తానని శపథం చేశారని.. మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలంటే ఎన్టీఆర్ కుటుంబంలో ఎవరైన వస్తే తప్ప చంద్రబాబు వల్ల కాదని విద్యుత్ మరియు అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశంలో అన్నారు. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి వారి దర్శనానికి వచ్చిన మంత్రి బాలినేనికి ఆలయ రాజ గోపురం వద్ద ఆలయ అధికారులు స్వాగతం పలికారు మంత్రి శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మూడు రాజదానుల విషయంలో కొన్ని పాయింట్లు సరిగా పెట్టలేదనే ఉద్దేశంతో విత్ డ్రా చేసుకోవడం జరిగిందని మార్చి బడ్జెట్ లో అందరి సలహాలు తీసుకుని బిల్లు ప్రవేశపెడతామన్నారు.





















