Ambati Rambabu on Pinnelli Ramakrishna Reddy | EVM ధ్వంసం ఘటనపై అంబటి రియాక్షన్
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎమ్ ధ్వంసం చేసిన ఘటనపై అంబటి రాంబాబు స్పందించారు. ఈవీఎం ధ్వంసం వీడియోని అధికారులో, ఈసీనో విడుదల చేయకుండా నారా లోకేష్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఎలా పోస్ట్ చేశారని ఆయన ప్రశ్నించారు.
పిన్నెల్లిని సమర్థించడానికి కూడా వైసీపీ నేతలు తంటాలు పడ్డారు. వీడియో బయటకు వచ్చిన తర్వాత రిగ్గింగ్ చేశారని పగుల గొట్టారని ఎక్కువ మంది వాదిస్తూ తెర ముందుకు వచ్చారు. పిన్నెల్లి పారిపోయాడని.. పట్టుకోలేకపోయామని పోలీసులు చెప్పిన తర్వాత గురజాల ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి పిన్నెల్లికి మద్దతుగా పార్టీ తరపున బలమైన వాదన వినిపించే ప్రయత్నం చేశారు. అది మరీ అరెస్టు చేయాల్సింత కేసు కాదని ఆయన చెప్పదల్చుకున్నారు. కానీ చెప్పే విషయంలో తేడా రావడం.. అప్పటికే పిన్నెల్లి పారిపోయారని ఉద్ధృతంగా ప్రచారం జరగడంతో కాసు మహేష్ రెడ్డి వాదన కూడాచాలా మందికి వింతగా అనిపించింది. అలాగే మంత్రి అంబటి రాంబాబు ఆ వీడియో ఫేక్ కావొచ్చునని వాదించి మరింత విమర్శలకు గురయ్యేలా చేశారు. పిన్నెల్లి న్యాయపరమైన అవకాశాలను వెదుక్కుని ఉంటే.. వైసీపీకి ఎదురుదాడి చేయడానికి అవకాశం ఉండేది. కానీ పరారు కావడం వల్ల ఎలాంటి వాదన వినిపించినా ప్రజల్లోకి మాత్రం భిన్నంగా వెళ్తోంది. పార్టీ ముఖ్య నేతలందరూ హాలీడే మూడ్ లో ఉండటంతో పిన్నెల్లి ఇష్యూని సరిగ్గా డీల్ చేయలేకపోయినట్లుగా మారింది వైసీపీ పరిస్థితి. ఇప్పుడు తప్పు దిద్దుకోవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.