News
News
X

Money in OLD ATM: పనిచేయని పాత ఏటీయం కొన్నాడు.. తీసి చూస్తే షాక్.. అందులో ఎంత నగదు ఉందంటే?

పనిచేయని పాత ఏటీయం మెషీన్‌ను ఓపెన్ చేసేటప్పుడు అందులో 2000 డాలర్లు(సుమారు రూ.1.5 లక్షలు) బయటపడ్డ వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతుంది.

FOLLOW US: 

కొంతమంది రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోయిన కథలు మనం ఇప్పటికే చాలా విన్నాం. అయితే తాజాగా ఇలాంటి వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతుంది. పనికి రాదని స్క్రాప్‌కు వేసిన ఒక పాత ఏటీయం మెషీన్‌ని డిస్ఇంటిగ్రేట్ చేసేటప్పుడు అందులో దాదాపు రూ.1.5 లక్షల వరకు నగదు ఉండటంతో దాన్ని డిస్ఇంటిగ్రేట్ చేసిన వారు పండగ చేసుకుంటున్నారు.

ఈ వీడియోలో ఒక పాత ఏటీయంని ఇద్దరూ విడిభాగాలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ మెషీన్‌కి సంబంధించిన తాళం పోవడంతో కొంతమంది దాన్ని స్క్రాప్‌కు వేశారు. దాన్ని ఇంటి దగ్గర కొనుగోలు చేసిన వ్యక్తి, తన స్నేహితుడు కలిసి ఓపెన్ చేసే ప్రయత్నం చేశారు.

మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం.. ఈ మెషీన్‌ను ఆ వ్యక్తి 300 డాలర్లకు(మనదేశ కరెన్సీలో సుమారు రూ.22,400) కొనుగోలు చేశారు. దీన్ని కొనుగోలు చేసినప్పుడు అమ్మిన వ్యక్తి తాళం ఇవ్వలేదు. దీంతో ఏటీయంను బద్దలు కొట్టాల్సి వచ్చింది. సుత్తి, డ్రిల్, ఇతర పనిముట్లతో దీన్ని తెరవడానికి ప్రయత్నించి చూసినప్పుడు అతను షాకయ్యాడు.

ఇందులో 2,000 డాలర్ల(మనదేశ కరెన్సీలో సుమారు రూ.1.5 లక్షలు) వరకు ఉంది. ఈ నగదును చూడగానే.. అతను ఆనందంతో గంతులు వేశాడు. అనంతరం ఈ వీడియోను టిక్‌టాక్‌లో షేర్ చేశాడు. ఈ వీడియోపై ప్రజలు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూనే ఉన్నారు.

News Reels

ఏటీయం నుంచి డబ్బులు వచ్చాక.. ఈ వీడియో తీసిన వ్యక్తి తన కొలీగ్స్‌ని కలిశాడు. వారంతా ఈ వీడియోని షేర్ చేస్తూ ఇది తమ జీవితంలో అత్యుత్తమ రోజని తెలిపారు. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు. ఈ వీడియోలో వారికి దొరికింది డాలర్స్ కాబట్టి అమెరికాలోని ఏదో ఒక ప్రాంతంలో ఈ సంఘటన జరిగి ఉంటుంది. అయితే స్క్రాప్ చేసిన ఏటీయంలో ఇంత మొత్తంగా నగదు ఉండటం అంటే మాత్రం అదృష్టం అనే చెప్పాలి.

Watch: Viral Video: కారు కోసం కొట్టుకున్నారు... వైరల్ అవుతున్న ఒంగోలు స్ట్రీట్ ఫైట్

Also Read: Sucker Mouth Cat Fish: జాలర్లకు చుక్కలు చూపిస్తున్న దెయ్యం చేప... ఇది ఎంత ప్రమాదకరమో తెలుసా!

Watch: King Cobra Video: ప్రత్తిపాడులో 12 అడుగుల కింగ్ కోబ్రా... చూసిన జనాలు పరుగో పరుగు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 11 Oct 2021 06:04 PM (IST) Tags: Viral video Money in Scrap ATM Video Man Found Money 2000 USD in InR

సంబంధిత కథనాలు

America Area 51 : ఏలియన్స్‌ను కిడ్నాప్‌ చేసిన అమెరికా, ఏరియా 51 మిస్టరీ ఏంటి?

America Area 51 : ఏలియన్స్‌ను కిడ్నాప్‌ చేసిన అమెరికా, ఏరియా 51 మిస్టరీ ఏంటి?

Dinesh Karthik : బెస్ట్‌ ఫినిషర్‌ దినేష్‌ కార్తీక్‌ షాకింగ్‌ నిర్ణయం, ఇన్‌స్టా వీడియో చూసి ఫ్యాన్స్‌ షాక్‌!

Dinesh Karthik : బెస్ట్‌ ఫినిషర్‌ దినేష్‌ కార్తీక్‌ షాకింగ్‌ నిర్ణయం, ఇన్‌స్టా వీడియో చూసి ఫ్యాన్స్‌ షాక్‌!

Watch Video: ఇయర్ ఫోన్స్ ఆర్డర్ చేస్తే అంతా "బిస్కెట్" అయింది - వైరల్ వీడియో

Watch Video: ఇయర్ ఫోన్స్ ఆర్డర్ చేస్తే అంతా

US News: అమెరికాలో అద్భుతం- 30 ఏళ్ల నాటి అండాలతో కవలలకు జన్మనిచ్చిన మహిళ!

US News: అమెరికాలో అద్భుతం- 30 ఏళ్ల నాటి అండాలతో కవలలకు జన్మనిచ్చిన మహిళ!

Restaurant Bill: 37 ఏళ్ల కిందటి బిల్లు షేర్ చేసిన రెస్టారెంట్, నెటిజన్లు షాక్ - ఎంతో తెలుసా

Restaurant Bill: 37 ఏళ్ల కిందటి బిల్లు షేర్ చేసిన రెస్టారెంట్, నెటిజన్లు షాక్ - ఎంతో తెలుసా

టాప్ స్టోరీస్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Manjima Mohan Pre Wedding Pics: హీరో హీరోయిన్ల ప్రీ వెడ్డింగ్ ఫొటోలు ట్రెండింగ్ , మీరు ఓ లుక్కేయండి

Manjima Mohan Pre Wedding Pics: హీరో హీరోయిన్ల ప్రీ వెడ్డింగ్ ఫొటోలు ట్రెండింగ్ , మీరు ఓ లుక్కేయండి