Sucker Mouth Cat Fish: జాలర్లకు చుక్కలు చూపిస్తున్న దెయ్యం చేప... ఇది ఎంత ప్రమాదకరమో తెలుసా!
అక్వేరియం చేపగా చెప్పే సక్కర్ మౌత్ క్యాట్ ఫిష్ ఇప్పుడు మత్య్సకారులను భయపెడుతోంది. చూడడానికి భయపెట్టేలా ఉండే ఈ చేపలు ఇతర చేపలను కూడా తినేస్తాయి.
ఎక్కువగా విదేశాల్లో కనిపించే దెయ్యం చేప(సక్కర్ మౌత్ క్యాట్ ఫిష్) ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో జాలర్లకు చిక్కుతోంది. నిత్యం ఎక్కడో ఒక చోట ఇది కనిపిస్తూ మత్య్సకారులను భయపెడుతోంది. వలకు చేపలు బాగా చిక్కాయని మత్స్యకారులు భావించే లోగా మత్య్సకారుల ఆశలపై నీళ్లు జల్లుతున్నాయి.
చాలా విషపూరితం
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పరిధిలోని ముక్త్యాల నదిలో జాలర్లకు చిక్కింది. కిలో బరువు వుండే ఈ చేప వింతగా, చూడడానికి భయం కలిగించేలా ఉంటుంది. ఈ చేపలు విషపూరితమైనవని మత్స్యశాఖ అధికారులు అంటున్నారు. రూపాన్ని బట్టి దీనిని దెయ్యం చేపగా పిలుస్తుంటారు. చుట్టూ ఉండే చేపలను గాయపరచి, వాటిని తినడం వీటి అలవాడు. వీటి వల్ల దేశవాళీ చేపలు, ఇతర విలువైన నీటి ప్రాణులకు ప్రమాదమని మత్స్యకాలు చెబుతున్నారు. ఈ చేప ఉన్నచోట మిగతా చేపలు అంతరించిపోతాయని అంటున్నారు. ఇతర దేశాలకు చెందిన ఈ చేపని, మొదటగా ఆక్వేరియంలో పెంచేందుకు మన ప్రాంతం వాళ్లు తీసుకువచ్చేవారని తెలుస్తోంది.
మత్య్సకారులకు తీవ్ర నష్టం
శరీరంపై నల్లని చారలు ఉండటమే కాకుండా, నోటిలో పదునైన పళ్లతో ఇతర చేపలను గాయపరుస్తూ చూడడానికి భయపెట్టే రూపం ఉండడంతో దీనిని మత్యకారులు దెయ్యం చేప అని పిలుస్తుంటారు. చేపల చెరువుల్లో ఈ చేపలు ఉంటే నెలల వ్యవధిలో చెరువులోని అన్ని చేపలను తినేసి, వీటి సంతతిని అపారంగా పెంచుకుంటాయని మత్స్యకారులు అంటున్నారు. ఈ చేపలు ఎంతటి తీవ్ర పరిస్థితులనైనా తట్టుకోగలవని చెప్తున్నారు. ముఖ్యంగా చేపల చెరువుల సాగుచేసేవారికి వీటి వలన తీవ్ర నష్టం జరుగుతుందంటున్నారు. ఇలాంటి చేపలు ముక్త్యాల కృష్ణా నదిలో జాలర్ల వలలకు చిక్కడంతో జాలర్లు ఆందోళన చెందుతున్నారు.
ఈ చేప మాంసాహారి కూడా
ఈ దెయ్యం చేప మత్స్యకారులకు సవాలుగా మారింది. చెరువుల్లో దిగుబడి బాగుందని భావించే సమయానికి ఈ దెయ్యం చేప ప్రత్యక్షమవుతున్నాయని మత్య్సకారులు అంటున్నారు. వీటి వల్ల ఇతర చేపల సంఖ్య తగ్గిపోతుందని వాపోతున్నారు. ఈ చేపకు పొలుసులుండవు. ఒళ్లంతా నల్లటి చారలు ఉంటాయి. వీటిని దెయ్యం చేప, విమానం చేప అని అంటారు. ఇవి చెరువులోకి ప్రవేశిస్తే రైతులు వేసిన మేత మొత్తాన్ని తినేసి ఇతర చేపల సంఖ్యను తగ్గించేస్తాయి. తన కంటే చిన్న ఇతర చేపల్ని ఈ చేపలు తింటాయి.
Also Read: NGT : సీమ ఎత్తిపోతలపై సెప్టెంబర్ 8న ఎన్జీటీ తీర్పు