Nine Wives: ఈ మోడల్‌కు 9 మంది భార్యలు, ఆ కోరిక తీరేలోపే ఒక భార్య ఊహించని షాక్!
ఒక భర్తకు ఇద్దరు భార్యలు ఉన్నారంటే అది పెద్ద విషయం కాదు. కానీ, ఇతడికి ఏకంగా 9 మంది భార్యలు ఉన్నారు. బాహుభార్యత్వాన్ని ఒక ఉద్యమంగా పాటిస్తున్న అతడికి వారిలో ఒకరు ఊహించని షాకిచ్చింది.
ఒక వ్యక్తి ఒకరి కంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకోకూడదనే రూల్ ఇతడికి అస్సలు నచ్చదు. అందుకే, ఆ రూల్‌ను సవాల్ చేస్తూ.. అతడు ఏకంగా తొమ్మిది మంది మహిళలను పెళ్లి చేసుకున్నాడు. త్వరలోనే మరొకరిని పెళ్లి చేసుకుని తన కోరిక తీర్చుకుందామని అనుకున్నాడు. కానీ, తన భార్యల్లో ఒకరు అతడికి ఊహించని షాకిచ్చింది. నీతో సంసారం నాకు వద్దంటూ.. విడాకులు కోరుకుంది. అతడి నుంచి విడిపోయింది. దీంతో అతడు ఇప్పుడు 10 భార్యల లక్ష్యాన్ని చేరుకోడానికి మరో ఇద్దరు అవసరం.
2020లో పెళ్లిల్లు..: బ్రెజిల్ మోడల్ ఆర్థర్ ఓ ఉర్సో 2020లో ఊహించని ప్రకటన చేశాడు. తన ఎనిమిది మంది ప్రియురాళ్లను పెళ్లి చేసుకుని జీవితం ఇస్తానని తెలిపాడు. చెప్పినట్లే 2021లో ఒకే వేదికపై వారిని పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే ఉర్సోకు లువానా కజాకి అనే మహిళతో వివాహమైపోయింది. ఆమె తప్పకుండా దీన్ని వ్యతిరేకిస్తుందని అంతా భావించారు. కానీ, ఉర్సో ఆమె అంగీకారంతోనే ఆ పెళ్లిల్లు చేసుకున్నాడు. కానీ, అతడి ఊహించలేని విషయం ఏమిటంటే.. ఆ ఎనిమిది మంది ప్రియురాళ్లు(ఇప్పుడు భార్యలు) ఒకరైన అగాథ అతడి నుంచి విడిపోవాలని కోరుకోవడం. ఇందుకు ఆమె చెప్పిన కారణం ఉర్సోకు అస్సలు నచ్చలేదు. ఆమెకు అంతమంది భార్యల్లో ఒకరిగా జీవించడం సాధ్యం కావడం లేదని, అందుకే విడాకులు తీసుకుంటున్నానని చెప్పింది. ఆమె నిర్ణయాన్ని మిగతా భార్యలు తప్పుబట్టారు. ఉర్సో చేస్తున్న సాహసంలో ఆమె భాగస్వామి కావాలని భావించిందేగానీ.. అతడిపై ప్రేమతో పెళ్లి చేసుకోలేదని అంటున్నారు. తాము మాత్రం ఉర్సోను వదలమని స్పష్టం చేశారు.
Also Read: వేసవిలో వెచ్చని కోరికలు, అక్రమ సంబంధాలన్నీ ఈ సీజన్లోనే ఎక్కువట, ఎందుకంటే..
బ్రెజిల్ రూల్స్‌ను వ్యతిరేకించి మరీ పెళ్లిల్లు: అతను తన పెళ్లిల్లను ఓ ఉద్యమంగా నిర్వహించాడు. ‘ఏకభార్యత్వానికి వ్యతిరేక నిరసన’గా ఎనిమిది మందిని పెళ్లి చేసుకుంటున్నానని అప్పట్లో ప్రకటించాడు. బ్రెజిల్‌లో బహుభార్యత్వం చట్టవిరుద్ధం. దీంతో అతడు చేసుకున్న వివాహలకు చట్టబద్ధత లభించలేదు. ‘‘ఆమె స్థానాన్ని ఇప్పటికిప్పుడు వేరొకరితో భర్తీ చేయలేను. కానీ, నాకు ఒక కల ఉంది. 10 మంది భార్యలను కలిగి ఉండాలనేది నా కోరిక. నాకు ఒక కుమార్తె మాత్రమే ఉంది. నా ప్రతి భార్యతో నేను ఒక బిడ్డను కలిగి ఉండాలనుకుంటున్నాను. వారిలో ప్రతి ఒక్కరిపై నాకు ఉన్న ప్రేమ ఒకటే. వారిలో ఒకరు లేదా ఇద్దరితో మాత్రమే పిల్లలను కలిగి ఉండటం అన్యాయమని నేను భావిస్తున్నాను’’ అని ఉర్సో అన్నారు.
Also Read: నగ్న సందేశం, అంతరిక్షంలోకి ‘న్యూడ్’ చిత్రాలను పంపిస్తున్న నాసా, ఎందుకో తెలుసా?
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram