By: ABP Desam | Updated at : 20 Oct 2021 11:17 AM (IST)
వైఎస్ షర్మిల(ఫైల్ ఫొటో)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2003లో చెవెళ్ల నుంచే పాదయాత్ర చేపట్టి రాష్ట్రమంతా తిరిగి 2004లో అధికారాన్ని చేపట్టారు. ఆయన బాటలోనే ఆయన కుమార్తె షర్మిల అక్కడి నుంచే పాదయాత్ర మెుదలు పెట్టనున్నారు. చేవెళ్ల నుంచి ప్రారంభించబోయే పాదయాత్రలో భాగంగా ఆమె 4 వేల కిలోమీటర్ల నడిచి తిరిగి చేవెళ్లలోనే ముగిస్తారు. ఈ ఏడాది జులై 8న పార్టీ ఆవిర్భావ సభలోనే పాదయాత్ర గురించి షర్మిల చెప్పారు. హైదరాబాద్ పార్లమెంటు స్థానం మినహా 16 సెగ్మెంట్లను చుట్టేలా పార్టీ ప్రణాళిక రూపొందించారు. తొలిరోజు కార్యక్రమాలకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, ప్రజాసంఘాల నాయకులు ఆర్.కృష్ణయ్య, మంద కృష్ణ మాదిగ, కంచె ఐలయ్యతో పాటు పలు పార్టీలు, ప్రజా సంఘాల నాయకులను వైఎస్సార్‌టీపీ ఆహ్వానించారు. మొదటి 10 రోజులు చేవెళ్ల, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో యాత్ర జరుగుతుంది.
ప్రజాప్రస్థానంలో భాగంగా తొలిరోజు చేవేళ్ల నుంచి రెండున్నర కిలోమీటర్లు నడిచి మధ్నాహ్నం 12. 30 గంటలకు షాబాద్ క్రాస్ రోడ్డుకు చేరుకుంటారు. కందవాడ గేట్ క్రాస్ వద్ద భోజనం చేసి విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 6.5 కిలోమీటర్లు ప్రయాణించి కందవాడ గ్రామానికి చేరుకుంటారు. మొత్తం 10కిలోమీటర్ల వరకు వైఎస్ షర్మిల పాదయాత్ర ఉండనుంది.
తెలంగాణలో వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకువచ్చేందుకు పాదయాత్ర చేపడుతున్నానని షర్మిల చెబుతున్నారు. కడప జిల్లా ఇడుపులపాయలో తల్లి విజయమ్మతో కలిసి వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తెలంగాణలో ప్రతి గడప తొక్కి ప్రజల కష్టాలు తెలుసుకుని వారి పక్షాన పోరాడతమని షర్మిల చెప్పారు. అయితే పాదయాత్ర చేస్తున్నా.. ప్రతీ మంగళవారం.. నిరుద్యోగ నిరాహార దీక్ష యథావిధిగా కొనసాగించనున్నారు.
ప్రజాప్రస్థానం పాదయాత్రలో తొలిరోజు చేవెళ్ల.. వికారాబాద్ రోడ్డులోని కేజీఆర్ గార్డెన్ సమీపంలో బహిరంగ సభ జరుగుతుంది. అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలు, వైఎస్ అభిమానులను తరలించడానికి పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి. ఉదయం 11 గంటలకు బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం11.30 గంటలకు షర్మిల పాదయాత్ర ప్రారంభమవుతుంది.
Also Read: టీడీపీ ఆఫీసులపై దాడులు స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం... సీఎం, డీజీపీలకు తెలిసే దాడులు జరిగాయి... చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు
Also Read: టీడీపీ ఆఫీసులపై దాడులతో వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు... ఇది చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా.. వైఎస్ఆర్సీపీ నేతల ఆరోపణ
Also Read: ప్రజలు ఆవేశాలకు గురికావద్దు.. సంయమనం పాటించండి : డీజీపీ ఆఫీస్
Also Read: కుక్కకు రూ.15 కోట్ల ఆస్తి రాసేసిన ప్లేబాయ్ మోడల్, కారణం తెలిస్తే షాకవ్వడం ఖాయం!
Also Read: చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలకు షాకిచ్చిన కేంద్రం .. ఇక అన్నీ చెప్పాల్సిందే..!
Also Read: ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
AP Telangana Breaking News Live: అప్పుడు నాపై ఆంక్షలు, ఇప్పుడు పోలీసుల ప్రేక్షకపాత్ర - ఇదంతా ప్రీప్లాన్డ్: పవన్
KTR Davos Tour: తెలంగాణకు స్టాడ్లర్ రైలు కోచ్ ఫ్యాక్టరీ, రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి - ఉద్యోగాలు ఎన్నో తెలుసా
Hyderabad: రేపు Hydకి ప్రధాని మోదీ, ఈ రూట్లో ట్రాఫిక్ అనుమతించరు! ప్రత్యామ్నాయ మార్గాలు ఇవీ
Karimnagar: టెన్త్ ఎగ్జామ్స్‌కి ఫుల్లుగా తాగొచ్చిన టీచర్, తూలుతూనే ఇన్విజిలేషన్ - బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లో రీడింగ్ చూసి అంతా షాక్!
Weather Updates: నేడు ఈ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, ఉష్ణోగ్రత 4 డిగ్రీలదాకా ఎక్కువ నమోదయ్యే ఛాన్స్!
Vegetable Rates: ఏపీలో కూరగాయల రేట్ల నియంత్రణకు ప్రత్యేక యాప్, సీఎస్ ఆదేశాలు
Stock Market News: సూచీల నేల చూపులు! సెన్సెక్స్ 303, నిఫ్టీ 99 డౌన్ - ఫెడ్ మినిట్స్ కోసం వెయిటింగ్!
Dhaniya Powder: ఈ ధనియాల పొడిని అన్నంతో, ఇడ్లీతో తినొచ్చు, ఎలా చేయాలో తెలుసా?
Baramulla Encounter: జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్- ముగ్గురు పాక్ ఉగ్రవాదులు హతం