YS Sharmila : దమ్ముంటే పాదయాత్రను అడ్డుకోండి - మంత్రి ఎర్రబెల్లికి వైఎస్ఆర్‌టీపీ నేత షర్మిల సవాల్ !
మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే శంకర్ నాయక్‌లపై వైఎస్ షర్మిల ఘాటు విమర్శలు చేశారు. దమ్ముంటే తన పాదయాత్రను ఆపి చూడాలని సవాల్ చేశారు.
YS Sharmila : మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఇష్టారీతిన మాట్లాడుతున్నారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. మహబూబాబాద్ నియోజకవర్గంలోని నెల్లికుదురు మండల కేంద్రం ఆమె స్థానికలుతో మాట - ముచ్చట నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్,మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి వైఎస్ షర్మిల సవాల్ విసిరారు. తాను మానుకోట కొచ్చే సరికి ఎమ్మెల్యే భయం పట్టుకుందని.. శంకర్ నాయక్ సైగ చెయ్యి చూద్దాం ఎవడు వస్తాడో చూస్తానని ఆమె సవాల్ చేశారు. శంకర్ నాయక్ బెదిరించే దోరణిలో మాట్లాడుతున్నాడు ..పాదయాత్రను అడ్డుకొనెలా కార్యకర్తలను ఉసి గొల్పుతున్నారని ఆరోపించారు.
తెలంగాణ ప్రజలకు సేవ చేయడానికి బరాబర్ నాకు హక్కు ఉంది. తెలంగాణ పేరుతో ఉన్న ఏకైక పార్టీ YSR తెలంగాణ పార్టీ. తెలంగాణ పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. ఇప్పుడు ‘జై తెలంగాణ’ అనడానికి కూడా నోరు రావడం లేదు. బీఆర్ఎస్ అంటే బంధిపోట్ల రాష్ట్ర సమితి.#PrajaPrasthanam #Thorrur pic.twitter.com/h4i4XevMjO
— YS Sharmila (@realyssharmila) February 16, 2023
శంకర్ నాయక్ కి వైఎస్సార్ బిడ్డ సవాల్ చేస్తున్నదని.. మీకు దమ్ముంటే దాడి చేయండి చూద్దామన్నారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది కాదు YSR బిడ్డ అని స్పష్టం చేశారు. ప్రజల పక్షాన నిలబడి,కొట్లడుతున్నందుకు భయపడాలా..? మీరు చేసిన మోసాలు ఎత్తి చూపిస్తున్ననందుకు భయపడాలా..? అని ప్రశ్నించారు. రు తెరిస్తే చాలు అన్ని అబద్ధాలు చెబుతూంటారని.. శంకర్ నాయక్ ఒక కబ్జా కోర్ జనాల దగ్గర భూములు గుంజుకోడమే తెలుసన్నారు. వైఎస్సార్ దిమ్మె 8 సార్లు ఇక్కడ ఎమ్మెల్యే కూల్చేశారని మండిపడ్డారు. పక్క నియోజక వర్గంలో ఎర్రబెల్లి దయాకర్ అక్రమాలు,భూ ఆక్రమణలు గురించి మాట్లాడానని.. ఆడదానివి అయి ఉండి ఎలా మాట్లాడుతున్నవు అంటున్నారని మండిపడ్డారు.
ఆడదాన్ని అయితే మాట్లాడకూడదా అని షర్మిల ప్రశ్నించారు. ఆడదానికి గొంతు లేదా..? నిన్ను కన్నది ఆడది కాదా..? నీ భార్య ఆడది కాదా..? ఆడది మనిషి కాదా..? అని ప్రశ్నించారు. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఎర్రబెల్లికి సూచింారు. అవుతాపూర్ గ్రామంలో YSR విగ్రహాన్ని ఆపడానికి ఎంతో ప్రయత్నం చేశారని.. YSR విగ్రహం ప్రారంభంలో వచ్చిన మహిళలను లిస్ట్ తీయమని అన్నాడట .. వాళ్లకు పెన్షన్ లు అపుతడట... ప్రభుత్వ పథకాలు ఆపుతడట ... ఎవడబ్బ సొమ్ము అనుకుంటున్నావు ఎర్రబెల్లి అని ప్రశ్నించారు.
ప్రజాప్రస్థానం పాదయాత్ర 239వ రోజు తొర్రూరు మండలం నుంచి మహబూబాబాద్ నియోజకవర్గం నెల్లికుదురు మండలంలోకి ప్రవేశించింది. ప్రజల సమస్యలు విని, వారికి ధైర్యం కల్పించడం జరిగింది. రైతులు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు,విద్యార్థులు, నిరుద్యోగుల సంక్షేమం కోసం YSR తెలంగాణ పార్టీ పనిచేస్తుంది. pic.twitter.com/qg7WahT7tu
— YS Sharmila (@realyssharmila) February 17, 2023
ప్రజలు బాంచన్ అనాలా...మీ కాళ్ళ దగ్గర సేవ చేయాలా..? అని ప్రశ్నించారు. ఎర్రబెల్లి మీద మేము ఆరోపణలు చేసిన మాట వాస్తవమని.. దమ్ముంటే పబ్లిక్ ఫోరం పెట్టాలని షర్మిల సవాల్ చేశారు. జర్నలిస్ట్ లను పిలుద్ధం.. ప్రతిపక్షాలను పిలుద్ధం..ప్రజలను పిలుద్ధాం.. మీరు సుద్ధపూస అయితే నిరూపించుకొండి అని చాలెంజ్ చేశారు.