అన్వేషించండి

Telangana WhatsApp Services: తెలంగాణలో వాట్సాప్ గవర్నెన్స్- ఒక్క క్లిక్‌తో 580+ సేవలు చాట్‌లోనే!

WhatsApp Governance: తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు సేవలను మరింత సులభంగా అందించేందుకు వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రారంభించారు. 38 ప్రభుత్వ విభాగాలకు చెందిన 580కి పైగా సేవలు అందుబాటులోకి వచ్చాయి.

WhatsApp Governance launched in Telangana:  తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు సేవలను మరింత సులభంగా అందించేందుకు ఒక విప్లవాత్మక చర్యగా మీ సేవా సర్వీసులను వాట్సాప్ ప్లాట్‌ఫారమ్‌లో ప్రవేశపెట్టింది. ఐటీ ,పరిశ్రమల మంత్రి డి. శ్రీధర్ బాబు   లాంఛనంగా ఈ సౌకర్యాన్ని ప్రారంభించారు. మెటా , మీసేవా సంయుక్త భాగస్వామ్యంతో అమలులోకి వచ్చిన ఈ కొత్త వ్యవస్థ, 38 ప్రభుత్వ విభాగాలకు చెందిన 580కి పైగా సేవలను సాధారణ చాట్ ఇంటర్‌ఫేస్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. 

వాట్సాప్‌లో మీసేవా సేవలు ప్రవేశపెట్టడం ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజల చేతిలోకి తీసుకువస్తున్నామని శ్రీధర్ బాబుతెలిపారు.   ప్రభుత్వం టెక్నాలజీ ద్వారా సమయాన్ని ఆదా చేసి, పారదర్శకతను పెంచుతుందన్నారు.  ఈ సర్వీస్ త్వరలో తెలుగు, ఉర్దూ భాషల్లో అందుబాటులోకి వస్తుందని, వాయిస్ కమాండ్ ఫీచర్‌తో కూడా ప్రజలు సేవలు పొందవచ్చన్నారు. 

మీసేవా వాట్సాప్ సర్వీసులు అధునాతన కన్వర్సేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డ్రివెన్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉన్నాయి. ప్రజలు ఒక్క వాట్సాప్ నంబర్‌కు మెసేజ్ పంపితే  హాల్ టికెట్లు, వెదర్ ఇన్ఫర్మేషన్, ప్రభుత్వ అలర్ట్‌లు, బస్ టికెట్ బుకింగ్‌లు వంటి సేవలు చాట్ ద్వారానే పొందవచ్చు. మొత్తం 38 ప్రభుత్వ విభాగాలు రెవెన్యూ, రోడ్ ట్రాన్స్‌పోర్ట్, ఎడ్యుకేషన్ మొదలైనవి  నుంచి 580కి పైగా సేవలు ఇప్పుడు ఈ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉన్నాయి. 

 ప్రత్యేక వాట్సాప్ బిజినెస్ అకౌంట్‌ నెంబర్‌ను త్వరలో ప్రకటిస్తారు.  ఆ నెంబర్‌కు మెసేజ్ పంపితే  AI చాట్‌బాట్ సేవల లిస్ట్ చూపిస్తుంది. సర్వీస్ కోసం కమాండ్ టైప్ చేసి, అవసరమైతే డాక్యుమెంట్లు అప్‌లోడ్  చేయాల్సి ఉంటుంది. సర్వీస్ పూర్తయిన తర్వాత డిజిటల్ సర్టిఫికెట్ లేదా కన్‌ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. హాల్ టికెట్లు, వెదర్ అప్‌డేట్‌లు, ప్రభుత్వ అలర్ట్‌లు, బస్ టికెట్ బుకింగ్‌లు మొదలైనవి త్వరలో అందుబాటులోకి వస్తాయి.  మీసేవా సెంటర్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. స సంవత్సరానికి 1.5 కోట్ల ట్రాన్సాక్షన్లు జరిగే మీసేవా వ్యవస్థకు ఇది భారీ ఊరటగా చెప్పుకోవచ్చు.                        

టెక్నాలజీ ఫలాలను రాష్ట్రంలోని మారుమూల ప్రాంతంలో ఉన్న చివరి వ్యక్తి వరకూ చేర్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని మంత్రి అన్నారు. దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి తెచ్చిన ఏఐ ఆధారిత తెలంగాణ డిజిటల్ ఎక్స్ ఛేంజ్, ఏఐ సిటీ, ఏఐ యూనివర్సిటీ, తెలంగాణ ఇన్నోవేషన్ హబ్ తో ‘డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్’లో తెలంగాణ ఒక బెంచ్ మార్కెట్ ను సెట్ చేస్తోందని మంత్రి అన్నారు.

మెటా,  తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా ఈ ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధి చేశాయి.  వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలను సులభంగా అందించడం ద్వారా మేము డిజిటల్ ఇంక్లూజన్‌కు కృషి చేస్తున్నాం. తెలంగాణలో 10 కోట్లకు పైగా వాట్సాప్ యూజర్లు ఉన్నారు, వారందరూ ఇప్పుడు మీసేవా ప్రయోజనం పొందవచ్చు .  ఈ సౌకర్యం త్వరలో పూర్తిగా అందుబాటులోకి వస్తుంది.                     

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Republic Day 2026: ఢిల్లీలో రెపరెపలాడిన భారతీయ కీర్తి పతాక! ఆయుధ సామర్థ్యాన్ని చాటి చెప్పిన కవాతు!
ఢిల్లీలో రెపరెపలాడిన భారతీయ కీర్తి పతాక! ఆయుధ సామర్థ్యాన్ని చాటి చెప్పిన కవాతు!
Sirivennela Seetharama Sastry : అనకాపల్లిలో 'సిరివెన్నెల' కాంస్య విగ్రహం - ప్రతీ ఏటా అవార్డులు
అనకాపల్లిలో 'సిరివెన్నెల' కాంస్య విగ్రహం - ప్రతీ ఏటా అవార్డులు
Ravi Teja Irumudi : మాస్ మహారాజ థ్రిల్లర్ ఎంటర్టైనర్ 'ఇరుముడి' - అయ్యప్ప మాలలో రవితేజ
మాస్ మహారాజ థ్రిల్లర్ ఎంటర్టైనర్ 'ఇరుముడి' - అయ్యప్ప మాలలో రవితేజ
Hyderabad Crime News: హైదరాబాద్‌లో మందుబాబుల వీరంగం- కారుతో ఢీ కొట్టి ఎస్సైని ఈడ్చుకెళ్లి బీభత్సం
హైదరాబాద్‌లో మందుబాబుల వీరంగం- కారుతో ఢీ కొట్టి ఎస్సైని ఈడ్చుకెళ్లి బీభత్సం
Advertisement

వీడియోలు

India vs New Zealand 3rd T20 Highlights | టీ20 సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా
Ind vs NZ 3rd T20 Highlights | టీ20 సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా
Abhishek Sharma Records Ind vs NZ T20 | అభిషేక్ శర్మ సూపర్ ఇన్నింగ్స్
Sanju Samson Ind vs NZ T20 | వరుసగా విఫలమవుతున్న సంజు
Jasprit Bumrah in Ind vs NZ T20 | కివీస్ ను కుప్పకూల్చిన భారత బౌలర్లు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Republic Day 2026: ఢిల్లీలో రెపరెపలాడిన భారతీయ కీర్తి పతాక! ఆయుధ సామర్థ్యాన్ని చాటి చెప్పిన కవాతు!
ఢిల్లీలో రెపరెపలాడిన భారతీయ కీర్తి పతాక! ఆయుధ సామర్థ్యాన్ని చాటి చెప్పిన కవాతు!
Sirivennela Seetharama Sastry : అనకాపల్లిలో 'సిరివెన్నెల' కాంస్య విగ్రహం - ప్రతీ ఏటా అవార్డులు
అనకాపల్లిలో 'సిరివెన్నెల' కాంస్య విగ్రహం - ప్రతీ ఏటా అవార్డులు
Ravi Teja Irumudi : మాస్ మహారాజ థ్రిల్లర్ ఎంటర్టైనర్ 'ఇరుముడి' - అయ్యప్ప మాలలో రవితేజ
మాస్ మహారాజ థ్రిల్లర్ ఎంటర్టైనర్ 'ఇరుముడి' - అయ్యప్ప మాలలో రవితేజ
Hyderabad Crime News: హైదరాబాద్‌లో మందుబాబుల వీరంగం- కారుతో ఢీ కొట్టి ఎస్సైని ఈడ్చుకెళ్లి బీభత్సం
హైదరాబాద్‌లో మందుబాబుల వీరంగం- కారుతో ఢీ కొట్టి ఎస్సైని ఈడ్చుకెళ్లి బీభత్సం
America winter storm : అమెరికాలో మంచు తుపాను విధ్వంసం! ఒకే రోజు 10,000 విమానాలు రద్దు! 180 మిలియన్ల మందిపై ప్రభావం!
అమెరికాలో మంచు తుపాను విధ్వంసం! ఒకే రోజు 10,000 విమానాలు రద్దు! 180 మిలియన్ల మందిపై ప్రభావం!
Navy Recruitment 2027: ఇండియన్ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల; ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి!
ఇండియన్ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల; ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి!
CNG కార్లలో మరో ఆప్షన్‌: స్కోడా చౌక SUV Kylaqలో CNG వెర్షన్‌ రావచ్చు!
స్కోడా కైలాక్‌ CNG వెర్షన్‌: ఫ్యాక్టరీ ఫిట్‌మెంట్‌ ఇస్తారా లేదా డీలర్‌ లెవెల్‌ CNG కిట్‌ ఇస్తారా?
Droupadi Murmu:
"అభివృద్ధి చెందిన భారత్‌ వైపు వెళ్ళే మార్గంలో అందర్నీ ఆహ్వానించాలి" రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రిపబ్లిక్‌డే సందేశం
Embed widget