అన్వేషించండి

Telangana Elections 2023: బీజేపీకి వరుస షాకులు- పార్టీకి రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి రాజీనామా

Telangana Elections 2023: మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి రాజీనామా బీజేపీకి రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే రాష్ట్ర అధికార ప్రతినిథి రాకేష్ రెడ్డి సైతం పార్టీకి గుడ్ బై చెప్పారు.

Rakesh Reddy Resign to BJP:

వరంగల్: తెలంగాణలో రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. పార్టీ టికెట్ దక్కకపోవడంతో కీలక నేతలు వేరే పార్టీలోకి వెళ్తున్నారు. బీజేపీకి బుధవారం రెండు షాకులు తగిలాయి. మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి రాజీనామా బీజేపీకి రాజీనామా చేయడం తెలిసిందే. కొన్ని గంటల్లోనే మరో నేత పార్టీకి గుడ్ బై చెప్పారు. రాష్ట్ర అధికార ప్రతినిధి గా కొనసాగుతున్న రాకేష్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. వరంగల్ పశ్చిమ టిక్కెట్ దక్కపోవడంతో రాకేష్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. తన కార్యకర్తలతో కలిసి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పొమ్మనలేక పొగ పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

నేటి ఉదయం మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి బీజేపీకి రాజీనామా చేశారు. ఆయనతోపాటు కుమారుడు వంశీ కూడా బీజేపీకి గుడ్ బై చేశారు. గంటల వ్యవధిలోనే ఇద్దరూ కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ఫోన్‌లో మంతనాలు జరిపిన వివేక్‌.. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నోవాటెల్ హోటల్‌లో బస చేసిన రాహుల్ గాంధీని కలుసుకున్నారు. ఆయనతోపాటు తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

బీజేపీకి రాజీనామా చేసిన అనంతరం రాకేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం ఎంతగానో పనిచేసినా గుర్తింపు దక్కడం లేదన్నారు. తనకు అర్హత ఉందో లేదో చెక్ చేసిన తరువాత వరంగల్ పశ్చిమ సీటు కేటాయించాలని అధిష్టానాన్ని కోరితే ఏ మాత్రం స్పందన రాలేదని రాకేష్ రెడ్డి తెలిపారు. పార్టీ మీటింగులకు రాకపోతే అడిగే నాథుడు కూడా లేడని, పార్టీ టికెట్ అడగటమే తాను చేసిన పాపం అన్నారు. సర్వే ఆధారంగా టికెట్ ఇస్తామని బీజేపీ పెద్దలు చెబుతున్నారు. కానీ అది పచ్చిబూటకమన్నారు. సర్వేలన్నీ తనవైపే ఉంది, ప్రజల్లోనూ తన పేరు ఉండగా టికెట్ మాత్రం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

70 శాతం నియోజకవర్గాన్ని కవర్ చేశా. వేల కుటుంబాలను కలిసి మాట్లాడాను. నాకు ఇవ్వాలని అడిగితే నీకు ఇంకా భవిష్యత్ ఉందని పార్టీ పెద్దలు చెబుతున్నారు. దేశ భవిత యువత చేతుల్లో ఉంటుందంటారు. కానీ బీజేపీలో ఆ పరిస్థితి లేదన్నారు. వయసు మీద పడ్డాక, వృద్ధాప్యంలో టికెట్ ఇస్తే ఫలితం ఏముంటుంది. ప్రజా బలం ఉన్న నేతల్ని బీజేపీ ఆదరించదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో సాంబయ్య అనే అభ్యర్థి కొండా మూరళి చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. తదుపరి ఎన్నికల్లో సాంబయ్యకు పార్టీ మద్దతు లభించలేదని చెప్పారు. వరంగల్ పశ్చిమలో ఎవరికివ్వాలని మూడు సర్వేలు చేస్తే తనకు ఇవ్వాలని రిపోర్ట్ వచ్చిందని రాకేష్ రెడ్డి వెల్లడించారు. 

తాను రైతు బిడ్డను, పేదింటి బిడ్డను అయినందునే ప్రజాధరణ ఉన్నప్పటికీ తనకు టికెట్ ఇవ్వడం లేదని రాకేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ జితేందర్ కుమారుడి పేరుతో రెండో లిస్టులో ఒక్క పేరు ప్రకటించారు. సిద్ధాంతాలు కలిగిన పార్టీ అంటే ఒక్కరి పేరుతో అభ్యర్థుల జాబితా ప్రకటించడమా అని ప్రశ్నించారు. మాజీ ఎంపీ కుమారుడు కావడం, జాతీయ స్థాయిలో ప్రభావితం చేస్తారని వాళ్లకు టికెట్లు ఇచ్చుకున్నారని పలు విషయాలు పేర్కొన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Pushpa 2 Climax: దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

లవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలుకాళీయమర్ధనుడి అలంకారంలో  సిరుల‌త‌ల్లిరెండుగా వీడిపోయిన గూడ్స్ ట్రైన్, అలాగే వెళ్లిపోయిన లోకోపైలట్#UITheMovie Warner  Decode | Upendra సినిమా తీస్తే మరి అంత సింపుల్ గా ఉండదుగా.! | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Pushpa 2 Climax: దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
Maharashtra Govt Formation: మహరాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి 17 మంత్రి పదవులు, షిండే వర్గంలో ఏడుగురికి ఛాన్స్
మహరాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి 17 మంత్రి పదవులు, షిండే వర్గంలో ఏడుగురికి ఛాన్స్
Kakinada Port Ship Seized: అవి రేషన్ బియ్యమే, కాకినాడ పోర్టులో షిప్‌ సీజ్ చేశాం: కలెక్టర్ కీలక వ్యాఖ్యలు
అవి రేషన్ బియ్యమే, కాకినాడ పోర్టులో షిప్‌ సీజ్ చేశాం: కలెక్టర్ కీలక వ్యాఖ్యలు
Pushpa 2: 'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు, కానీ ఓ ట్విస్ట్
'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు, కానీ ఓ ట్విస్ట్
Telangana Govt News: పంచాయతీ రాజ్ చట్ట సవరణపై తెలంగాణ ప్రభుత్వ కసరత్తు-  ముగ్గురు పిల్లల రూల్, కలెక్టర్, ఉప సర్పంచ్ అధికారాలకు కత్తెర! 
పంచాయతీ రాజ్ చట్ట సవరణపై తెలంగాణ ప్రభుత్వ కసరత్తు- ముగ్గురు పిల్లల రూల్, కలెక్టర్, ఉప సర్పంచ్ అధికారాలకు కత్తెర! 
Embed widget