అన్వేషించండి

Kishan Reddy: తెలంగాణ రైల్వేకు బడ్జెట్‌లో రికార్డు, ఈసారి భారీగా నిధులు - కిషన్ రెడ్డి

Telangana News: 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ. 5,336 కోట్లు కేటాయింపులు జరిగాయి. 2014-15 బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే దాదాపు 21 రెట్లు ఎక్కువ’’ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

Kishan Reddy on Railway Budget allocations: గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం రైల్వేల పరంగా గణనీయమైన వృద్ధిని సాధిస్తూ వస్తోన్న విషయం మనందరికీ తెలిసిందే. బడ్జెట్ కేటాయింపులు మొదలుకొని, నూతన రైల్వేట్రాక్ ల నిర్మాణం, విద్యుద్ధీకరణ, రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ, నూతన రైల్వేస్టేషన్ల ఏర్పాటు, సిద్ధిపేట,మెదక్ నూతన రైల్వే లైన్ల ప్రారంభం, చర్లపల్లి నూతన టెర్మినల్ నిర్మాణం వంటి ఎన్నో అంశాలలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పట్ల ప్రత్యేక శ్రద్ధను కనబరిచి రాష్ట్రంలో రైల్వేలు పురోగతి సాధించడంలో కీలకమైన పాత్రను పోషించింది. 

గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పట్ల నరేంద్రమోదీ ప్రభుత్వం చూపిస్తున్న ప్రత్యేకమైన శ్రద్ధకు కొనసాగింపుగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో కూడా రైల్వేల అభివృద్ధికి రూ. 5,336 కోట్ల నిధులు కేటాయించింది. ఈ నిధులు 2014-15 బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే దాదాపు 21 రెట్లు ఎక్కువ. అదే 2009-14 మధ్యన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటు కేటాయింపులతో పోలిస్తే 6 రెట్ల కంటే ఎక్కువ. 

కొత్త రైల్వే ట్రాక్ లు
తెలంగాణ రాష్ట్రానికి పెద్దమొత్తంలో నిధులను కేటాయించడమే కాకుండా అంతే రీతిలో రాష్ట్రంలో నూతన రైల్వే ట్రాక్ ల నిర్మాణాన్ని కూడా చేపట్టింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రూ. 32,946 కోట్ల విలువైన నూతన రైల్వే ట్రాక్ ల ప్రాజెక్టులు నిర్మాణం జరుపుకుంటున్నాయి. గతంలో 2009-14 మధ్యన సంవత్సరానికి సగటున 17 కి. మీ. ల నూతన రైల్వే ట్రాక్ ల నిర్మాణం జరగగా, గత 10 సంవత్సరాల కాలంలో సంవత్సరానికి సగటున 65 కి. మీ. ల నూతన రైల్వే ట్రాక్ ల నిర్మాణం జరిగింది. వీటితో పాటుగా అనేక నూతన రైల్వే మార్గాలకు సంబంధించిన, డబ్లింగ్, ట్రిప్లింగ్, క్వాడ్రప్లింగ్ ప్రాజెక్టులు ఫైనల్ లొకేషన్ సర్వేను జరుపుకుంటున్నాయి. 

విద్యుద్ధీకరణ కూడా
నూతన రైల్వే ట్రాక్ లను నిర్మించడమే కాకుండా, నిర్మించిన రైల్వే ట్రాక్ ల విద్యుద్ధీకరణపై కూడా రైల్వే శాఖ ప్రత్యేక శ్రద్ధను కనబరచింది. తద్వారా నేడు తెలంగాణ రాష్ట్రంలో 100% రైల్వేల విద్యుద్ధీకరణ సాధ్యమయ్యింది. నూతన రైల్వే ట్రాక్ ల నిర్మాణం, విద్యుద్ధీకరణతో పాటుగా రక్షణ పరంగా కూడా రైల్వేశాఖ గట్టి చర్యలు చేపట్టింది. గత 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 437 రైల్ ఓవర్ బ్రిడ్జ్ & రైల్ అండర్ బ్రిడ్జ్ ల నిర్మాణం జరిగింది. 

అమృత్ భారత్ స్టేషన్ లకు నిధులు
వీటితోపాటుగా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 40 రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునీకరించనున్నారు. వీటికి సంబంధించిన నిధుల కేటాయింపు జరగడమే కాకుండా ఆయా రైల్వేస్టేషన్లలో పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. ఆయా రైల్వేస్టేషన్ల వివరాలు:అదిలాబాద్, బాసర, బేగంపేట, భద్రాచలం రోడ్డు, గద్వాల, హఫీజ్ పేట, హైటెక్ సిటీ, హుప్పు గూడ, హైదరాబాద్, జడ్చర్ల, జనగామ, కాచిగూడ, కామారెడ్డి, కరీంనగర్, కాజీపేట్ జంక్షన్, ఖమ్మం, లింగంపల్లి, మధిర, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మలక్ పేట, మల్కాజ్ గిరి, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, మిర్యాలగూడ, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, రామగుండం, సికింద్రాబాద్, షాద్ నగర్, శ్రీ బాల బ్రహ్మేశ్వర జోగుళాంబ, తాండూర్, ఉందానగర్, వికారాబాద్, వరంగల్, యాదాద్రి, యాకుత్ పుర, జహీరాబాద్ రైల్వేస్టేషన్లు.

వీటితోపాటుగా హైదరాబాద్ లోని ప్రధాన రైల్వే స్టేషన్లపై ఒత్తిడిని తగ్గించడానికి చర్లపల్లిలో నిర్మిస్తున్న నూతన టెర్మినల్ పనులు 99% పూర్తి అయ్యాయి. త్వరలోనే చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం కానుంది. అలాగే, రూ.715 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని తలపెట్టిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు కూడా చాలా వేగంగా కొనసాగుతున్నాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఇవి గుండె చెదిరిపోయే నిజాలు' - బాత్ టబ్ కోసం రూ.36 లక్షలా?, రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'ఇవి గుండె చెదిరిపోయే నిజాలు' - బాత్ టబ్ కోసం రూ.36 లక్షలా?, రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Sadar Sammelan: యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Black OTT Review: బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
Ind vs Nz 3rd Test Highlights: ముంబై టెస్టును మనవైపు తిప్పిన స్పిన్నర్లు జడేజా, అశ్విన్- 3వ రోజే దక్కనున్న విజయం
ముంబై టెస్టును మనవైపు తిప్పిన స్పిన్నర్లు జడేజా, అశ్విన్- 3వ రోజే దక్కనున్న విజయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మహిళలు ఒకరి మాటలు వినకూడదు, తాలిబన్ల వింత రూల్స్లెబనాన్‌లోని బీరట్‌ సిటీపై దాడులు చేసిన ఇజ్రాయేల్Kithampeta Village No Diwali Celebrations |  70ఏళ్లుగా దీపావళి పండుగకు దూరమైన కిత్తంపేట | ABP DesamKTR Padayatra Announced | పాదయాత్ర చేస్తానన్న కేటీఆర్..గులాబీ పార్టీ కొత్త అధినేతగా అడుగులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఇవి గుండె చెదిరిపోయే నిజాలు' - బాత్ టబ్ కోసం రూ.36 లక్షలా?, రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'ఇవి గుండె చెదిరిపోయే నిజాలు' - బాత్ టబ్ కోసం రూ.36 లక్షలా?, రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Sadar Sammelan: యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Black OTT Review: బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
Ind vs Nz 3rd Test Highlights: ముంబై టెస్టును మనవైపు తిప్పిన స్పిన్నర్లు జడేజా, అశ్విన్- 3వ రోజే దక్కనున్న విజయం
ముంబై టెస్టును మనవైపు తిప్పిన స్పిన్నర్లు జడేజా, అశ్విన్- 3వ రోజే దక్కనున్న విజయం
Royal Enfield Records: అమ్మకాల్లో కొత్త రికార్డులు సృష్టిస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మరో బైక్ లాంచ్‌కు రెడీ!
అమ్మకాల్లో కొత్త రికార్డులు సృష్టిస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మరో బైక్ లాంచ్‌కు రెడీ!
Rahul To Telangana : ఐదో తేదీన హైదరాబాద్‌లో రాహుల్ ‘సంవిధాన్ సమ్మాన్’ - కులగణనపై  కీలక ప్రకటన చేసే చాన్స్
ఐదో తేదీన హైదరాబాద్‌లో రాహుల్ ‘సంవిధాన్ సమ్మాన్’ - కులగణనపై కీలక ప్రకటన చేసే చాన్స్
AP TET Results 2024: అభ్యర్థులకు అలర్ట్, ఏపీ టెట్‌ ఫలితాలు వాయిదా - రిజల్ట్ విడుదలకు డేట్ ఫిక్స్
అభ్యర్థులకు అలర్ట్, ఏపీ టెట్‌ ఫలితాలు వాయిదా - రిజల్ట్ విడుదలకు డేట్ ఫిక్స్
CM Chandrababu: 'ఆ విలాసవంతమైన భవనాలను ఏం చేద్దాం?' - రుషికొండపై నిర్మాణాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు
'ఆ విలాసవంతమైన భవనాలను ఏం చేద్దాం?' - రుషికొండపై నిర్మాణాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు
Embed widget