TS EAMCET Results 2023: తెలంగాణ ఎంసెట్ ఫలితాల షెడ్యూల్ లో మార్పు, కన్వీనర్ కీలక ప్రకటన
TS EAMCET 2023 Results Direct Link: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు మే 25న విడుదల కానున్నాయి. అయితే ఫలితాల (TS EAMCET Result 2023) విడుదల సమయంలో మార్పులు చేశారు.
TS EAMCET 2023 Results Direct Link: ఇంటర్ పూర్తైన విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న తెలంగాణ ఎంసెట్ ఫలితాలు మే 25న విడుదల కానున్నాయి. అయితే ఎంసెట్ ఫలితాల విడుదలపై తాజాగా కీలక అప్‌డేట్ వచ్చింది. ఫలితాల విడుదల సమయాన్ని మార్చినట్లు ఎంసెట్ కన్వీనర్ డా.బి డీన్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం కాకుండా మరికాస్త ముందుగానే ఎంసెట్ రిజల్ట్స్ (TS EAMCET Result 2023) విడుదల చేయనున్నారు. గురువారం ఉదయం 9.30 గంటలకు తెలంగాణ ఎంసెట్ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేస్తారని ఓ ప్రకటనలో వెల్లడించారు. గురువారం ఉదయం 11 గంటలకు రిజల్ట్స్ విడుదల చేయనున్నట్లు మంగళవారం ప్రకటించారు. సీఎం కలెక్టర్ల కాన్ఫరెన్స్ కారణంగా మే 25న ఉదయం 9.30 గంటలకే ఎంసెట్ ఫలితాలు విడుదల చేస్తారని ప్రకటించారు.
కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూ క్యాంపస్‌లోని గోల్డెన్ జూబ్లీ సెమినార్ హాల్‌లో గురువారం ఫలితాలను విడుదల చేయనున్నారు. ఎంసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ఉన్నత విద్యా కార్యదర్శి వి.కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్, తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి, జేఎన్‌టీయూ-హైదరాబాద్ వీసీ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి తదితరులు ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.
ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ పరీక్ష మే 10, 11 తేదీల్లో, ఎంసెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలను మే 12 నుంచి 15వరకు ఆరు విడతల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవలే ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్‌లను విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరించిన అధికారులు తాజాగా ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేశారు. ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షను తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 2లక్షల మంది రాయగా.. అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షకు దాదాపు లక్ష మందికి విద్యార్థులు పైగా హాజరయ్యారు.
ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్, ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధించిన ఫలితాల ర్యాంకులను, మార్కులను విడుదల చేయనున్నారు. ఎంసెట్ హాల్ టికెట్ నంబర్ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. ఇక మెడికల్, అగ్రికల్చర్, ఇంజినీరింగ్ టాప్ టెన్ ర్యాంకర్ల వివరాలను కూడా వెల్లడించనున్నారు. ఎంసెట్ ఫలితాల కోసం ఏబీపీ దేశం, eamcet.tsche.ac.in అనే వెబ్‌సైట్లలో లాగిన్ కావాలి.
మే 25 నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్, ముఖ్యమైన తేదీలివే!
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు మే 25 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి మే 22న ఒక ప్రకటనలో తెలిపారు. పాలిసెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మే 25 నుంచి జూన్ 1 వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.700 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. మే 29 నుంచి జూన్ 5 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. జూన్ 1 నుంచి 6 వరకు కళాశాలలు, కోర్సు ఎంపికకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. జూన్ 7న వెబ్‌ఆప్షన్లలో మార్పు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇక జూన్ 9న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులకు జూన్ 15 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. పాలిసెట్ కౌన్సెలింగ్ కోసం క్లిక్ చేయండి..