News
News
X

TS Cabinet : 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ .. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు

హైదరాబాద్‌ నలు దిక్కుల్లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు కట్టాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లను చేయాలని అధికారులను ఆదేశించింది.

FOLLOW US: 

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అదే రోజు బీఏసీ స‌మావేశ‌మై అసెంబ్లీ ఎజెండాను ఖ‌రారు చేస్తారు. పోడు భూముల సమస్య పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు. మంత్రి సత్యవతి రాథోడ్ ఉపసంఘం చైర్మన్‌గా వ్యవహరిస్తారు. మంత్రులు జగదీశ్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి సభ్యులుగా ఉంటారు. పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామని గతంలో కేసీఆర్ హామీ ఇచ్చారు. అయితే ఇప్పటికే పలు చోట్ల అటవీ అధికారులు, గిరిజనుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. దీంతో సమస్య పరిష్కారం కోసం కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. Also Read : హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్... ఈ ఏడాదికి అనుమతి ఇచ్చిన సుప్రీంకోర్టు

అలాగే కొత్త జిల్లాల్లోని పోలీస్‌ స్టేషన్ల సమస్యలను పరిష్కరించేందుకు కొత్తగా కేబినెట్ సబ్ కమిటీని  హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ నేతృత్వంలో సంఘం ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్లలో కావాల్సిన సౌకర్యాల కోసం ఈ కమిటీ సూచనలు చేస్తుంది. ఇక కరోనా పరిస్థితులపై కేబినెట్ సుదీర్ఘంగా సమావేశం చర్చించింది. హైదరాబాద్‌లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి తెలంగాణ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వీటిని వీలైనంత వేగంగా పూర్తి చేయాలని సంకల్పించారు. వచ్చే ఏడాది నుంచి కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి ఆమోదం తెలిపింది. ఇందుకోసం కావాల్సిన ఏర్పాటు చేసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులను మంత్రివర్గం ఆదేశించింది. Also Read : స్సెక్కిన ఆర్టీసీ బాస్... సాధారణ ప్రయాణికుడిలా ట్రావెల్... విషయం తెలిసి అధికారులు షాక్

అలాగే రాష్ట్రంలో ఆరోగ్య, మౌలిక వసతుల అభివృద్ధికి కేబినెట్‌ ఆమోదం లభించింది. రాష్ట్రంలో విద్యా సంస్థలు తెరిచినా కరోనా కేసుల్లో పెరుగుదల లేదని అధికారులు మంత్రివర్గానికి నివేదిక సమర్పించారు. ధర్డ్ వేవ్‌కు అన్ని విధాలుగా సిద్ధమయ్యామని అధికారులు తెలిపారు.. గతంలో 130 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం ఉండేదని, దాన్ని ఇప్పటికే 280 మెట్రిక్ టన్నులకు పెంచుకున్నామని, మరింత పెంచి 550 గతంలో 130 మెట్రిక్ టన్నులకు చేరుకునేలా చర్యలు చేపట్టాలని వైద్యశాఖాధికారులను మంత్రివర్గం ఆదేశించింది. Also Read : రాజకీయాలు ఛండాలం, టీఆర్ఎస్ శాశ్వతమేం కాదు.. గులాబీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు

ఇప్పటివరకు రెండు కోట్ల వ్యాక్సినేషన్ పూర్తయిందని అధికారులు మంత్రివర్గానికి చెప్పారు.  స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ను గురువారం నుంచి ప్రారంభమైందని, ప్రతి గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు అంతా కలిసి వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయాలని మంత్రివర్గం ఆదేశించింది. Also Read : సాయిధరమ్ తేజ్‌ను కాపాడిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు.. అసలేం జరిగిందంటే..

Published at : 16 Sep 2021 05:53 PM (IST) Tags: telangana kcr TS Cabinet kcr cabinet ts corona

సంబంధిత కథనాలు

Breaking News Telugu Live Updates: చిత్తూరు జిల్లాలో జల్లికట్టులో అపశ్రుతి, ఇద్దరు మృతి  

Breaking News Telugu Live Updates: చిత్తూరు జిల్లాలో జల్లికట్టులో అపశ్రుతి, ఇద్దరు మృతి  

Kamareddy Bus Accident : కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆర్టీసీ బస్సు బోల్తా, 25 మందికి గాయాలు

Kamareddy Bus Accident : కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆర్టీసీ బస్సు బోల్తా, 25 మందికి గాయాలు

Revant Corona : రేవంత్‌కు మరోసారి కరోనా - పాదయాత్రకు దూరం ! నల్లగొండ సీనియర్ల పంతం నెగ్గిందా ?

Revant Corona :  రేవంత్‌కు మరోసారి కరోనా - పాదయాత్రకు దూరం ! నల్లగొండ సీనియర్ల పంతం నెగ్గిందా ?

Karimnagar: దేశంలోనే అత్యుత్తమ సహకార బ్యాంకుగా కరీంనగర్ కేడీసీసీ బ్యాంక్ సేవలకు గుర్తింపు

Karimnagar: దేశంలోనే అత్యుత్తమ సహకార బ్యాంకుగా కరీంనగర్ కేడీసీసీ బ్యాంక్ సేవలకు గుర్తింపు

Telangana TDP Votes : టీడీపీ మద్దతుంటే తెలంగాణలో విజయం ఖాయమా ? రాజకీయ పార్టీలేం ఆలోచిస్తున్నాయి ?

Telangana TDP Votes :  టీడీపీ మద్దతుంటే తెలంగాణలో విజయం ఖాయమా ? రాజకీయ పార్టీలేం ఆలోచిస్తున్నాయి ?

టాప్ స్టోరీస్

TDP On Madhav : మాధవ్ వీడియోను అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్‌లో టెస్ట్ చేయించిన టీడీపీ - రిజల్ట్ ఏమిటంటే ?

TDP On Madhav :  మాధవ్ వీడియోను అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్‌లో టెస్ట్ చేయించిన టీడీపీ - రిజల్ట్ ఏమిటంటే ?

Google Surprises To RRR Team : 'ఆర్ఆర్ఆర్' టీమ్‌కు గూగుల్ స‌ర్‌ప్రైజ్

Google Surprises To RRR Team : 'ఆర్ఆర్ఆర్' టీమ్‌కు గూగుల్ స‌ర్‌ప్రైజ్

Food: ఈ టేస్టీ ఫుడ్ వద్దు డూడ్, పొట్ట పెంచేస్తాయ్, పరేషాన్ చేసేస్తాయ్!

Food: ఈ టేస్టీ ఫుడ్ వద్దు డూడ్, పొట్ట పెంచేస్తాయ్, పరేషాన్ చేసేస్తాయ్!

Salman Rushdie: ఎవరీ సల్మాన్ రష్దీ? ఆయన రాసిన బుక్‌ ఎందుకు వివాదాస్పదమైంది?

Salman Rushdie: ఎవరీ సల్మాన్ రష్దీ? ఆయన రాసిన బుక్‌ ఎందుకు వివాదాస్పదమైంది?