Sai Dharam Tej Accident: సాయిధరమ్ తేజ్‌ను కాపాడిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు.. అసలేం జరిగిందంటే..
సాయి ధరమ్ తేజ్‌ను సకాలంలో ఆస్పత్రికి చేర్చిన అబ్దుల్ అనే యువకుడు ఒక్కసారిగా హీరో అయిపోయాడు. అతను స్థానికంగా ఉండే సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో సేల్స్ పర్సన్‌గా పని చేస్తున్నాడు.
హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్‌లో కోలుకుంటున్న సంగతి తెలిసిందే. పలువురు సినీ ప్రముఖులు ఆస్పత్రికి వచ్చి ఆయనను పరామర్శించారు. ఐకియా జంక్షన్ నుంచి తీగల వంతెన మార్గంలో సాయి ధరమ్ తేజ్ బైక్ నుంచి పడిపోయి రోడ్డు ప్రమాదానికి గురి కాగానే.. ఓ స్థానిక యువకుడు వెంటనే స్పందించి సాయి తేజ్‌ని ఆస్పత్రికి తరలించాడు. తక్షణమే ఫోన్ చేసి అంబులెన్స్‌ను రప్పించి ఎంతో సాయం చేశాడు.
వెంటనే దగ్గర్లోని మెడికవర్ ఆస్పత్రికి సాయి ధరమ్ తేజ్‌ను తరలించడంతో అక్కడ వైద్యులు తక్షణం ప్రథమ చికిత్స అందించి అవసరమైన పరీక్షలు కూడా చేశారు. గోల్డెన్ అవర్‌లో ఆయన్ను ఆస్పత్రికి చేర్చారంటూ మెడికవర్ వైద్యులు కూడా కొనియాడారు. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్‌ను జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించిన సంగతి తెలిసిందే.
Also Read: Met Gala 2021: 'మెట్ గాలా'లో హైదరాబాదీ మెరుపులు.. రెడ్ కార్పెట్‌పై బిలియనీర్ సుధా రెడ్డి హొయలు
పోలీసులకు ఫిర్యాదు
అయితే, తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న సాయి ధరమ్ తేజ్‌ను సకాలంలో ఆస్పత్రికి చేర్చిన అబ్దుల్ అనే యువకుడు ఒక్కసారిగా హీరో అయిపోయాడు. అతను స్థానికంగా ఉండే సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో సేల్స్ పర్సన్‌గా పని చేస్తున్నాడు. ఇతను తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సాయి ధరమ్ తేజ్‌కు అబ్దుల్ చేసిన సాయానికిగాను మెగా ఫ్యామిలీ నుంచి అబ్దుల్‌కు పెద్ద ఎత్తున బహుమతులు అందాయని కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో కథనాలు వేశారు. ఇష్టం వచ్చినట్లుగా థంబ్‌నెయిల్స్ పెడుతూ వీడియోలు అప్‌లోడ్ చేశారు. అంతేకాక, పవన్ కల్యాణ్ అబ్దుల్‌కు ఓ కారును బహుమతిగా కూడా ఇచ్చాడంటూ కథనాలు రాశారు. దీంతో అవన్నీ తనకు తెలియడంతో విసుగు చెందిన అబ్దుల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తన గురించి కొంత మంది తప్పుడు కథనాలు రాస్తున్నారని అబ్దుల్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాను ఎవరి దగ్గర నుంచి డబ్బులు కానీ, బహుమతులు కానీ తీసుకోలేదని, తనకు ఎవరూ అలాంటివి ఇవ్వలేదని తెలిపాడు. అసత్య ప్రచారంతో తన మనసును, కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని తెలిపాడు.
Also Read: Bigg Boss 5 Telugu Promo : 'నీకు సిగ్గు లేదా..? చిల్లర్ దానా' ఉమాదేవిపై యానీ మాస్టర్ ఫైర్..