By: ABP Desam | Updated at : 15 Sep 2021 11:08 PM (IST)
Edited By: Venkateshk
laxma reddy
మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన చర్నకోల లక్ష్మా రెడ్డి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చాలా ఛండాలంగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో ఏ రాజకీయ నేత ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాని పరిస్థితి నెలకొని ఉందని సీహెచ్ లక్ష్మా రెడ్డి అన్నారు. అధికారం ఏ ఒక్క పార్టీకీ శాశ్వతం కాదని అన్నారు. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా బాధ్యతగా వ్యవహరించాల్సిందేనని లక్ష్మా రెడ్డి సూచించారు. ప్రభుత్వాలు చేసే ప్రతి పనిని విపక్షాలు విమర్శించడం సరి కాదని లక్ష్మా రెడ్డి అభిప్రాయపడ్డారు.
జడ్చర్ల శాసన సభ్యుడైన లక్ష్మా రెడ్డి ఇలా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుత రాజకీయాలపై తన అభిప్రాయాన్ని ఆయన కుండబద్దలు కొడుతూ మాట్లాడారు. రాజకీయ నేతలు స్వార్థం కోసం తొండి, అబద్ధాలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కొందరు రాజకీయ నేతలు బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నారని లక్ష్మా రెడ్డి ధ్వజమెత్తారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, చివరికి టీఆర్‌ఎస్ పార్టీకి కూడా అధికారం శాశ్వతం కాదంటూ లక్ష్మా రెడ్డి షాకింగ్ కామెంట్లు చేశారు. గతంలో అత్యధిక సంవత్సరాలు రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ కూడా శాశ్వతం ఏం కాదని అన్నారు. ఆ పార్టీ కూడా అధికారంలో నుంచి దిగిపోవాల్సి వచ్చిందని అన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా బాధ్యతగా ఉండాలన్నారు.
ప్రతిపక్షంలో ఉన్నా ప్రతిపక్ష పాత్ర సమర్థంగా పోషించాలని అన్నారు. ప్రభుత్వం ఏం చేసినా ప్రతిపక్షాలు తప్పు అనేలా ఉండకూడదని లక్ష్మా రెడ్డి చెప్పారు. జడ్చర్లలో జరిగిన ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో లక్ష్మా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు గందరగోళానికి గురవకుండా ఉపాధ్యాయులే వారిలో చైతన్యం తీసుకురావాల్సి ఉంటుందని సూచించారు.
గతంలోనూ ఆసక్తికర వ్యాఖ్యలు
కొద్ది రోజుల క్రితం కూడా లక్ష్మా రెడ్డి ఇలాంటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తారని టీఆర్ఎస్ హామీ ఇచ్చినట్లుగా విపక్షాలు తరచూ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో అది సాధ్యం కాదని లక్ష్మా రెడ్డి వ్యాఖ్యానించారు. జడ్చర్ల మండలం శంకరాయపల్లి సమీపంలో నిర్మించిన పీఆర్‌టీయూ సంఘ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కోటి ఫ్యామిలీలు ఉంటే కోటి ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా ఇవ్వగలమని లాజిక్‌తో ప్రశ్నించారు. ప్రస్తుతం దేశంలో ఓటు బ్యాంకు రాజకీయాలు మాత్రమే నడుస్తున్నాయని అన్నారు. ప్రజలకు ఏ పథకం పెడితే ఎన్ని ఓట్లు వస్తాయో అని ఆలోచించటం సరైనది కాదని అన్నారు. వెనుకబడిన దళితుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో ఆలోచించి దళిత బంధు ప్రవేశపెడితే విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని, ఇది సరికాదని అన్నారు.
MLC Kavita On Congress : దేశంలో కాంగ్రెస్ ఓ తోక పార్టీ, ఎమ్మెల్యే కవిత ఘాటు వ్యాఖ్యలు
Breaking News Live Updates : ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేసిన ఏపీ ప్రభుత్వం
Someshwara Temple: శబరిమల, అరుణాచలం తర్వాత అతిపెద్ద జ్యోతి కనిపించే ఆలయం ఇదే
Minister KTR UK Tour : పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ యూకే టూర్, కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలు
Petrol Diesel Price 18th May 2022 : తెలుగు రాష్ట్రాలో స్వల్పంగా తగ్గిన పెట్రోల్, పెరిగిన డీజిల్ ధరలు, ఇవాళ్టి ఇంధన ధరలు ఇలా
AB Venkateswararao : ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం, ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేత
ఊరేగింపులో వరుడు, అతడు వచ్చేసరికి వేరే వ్యక్తిని పెళ్లాడిన వధువు
Sheena Bora murder Case: షీనా బోరా హత్య కేసు అప్డేట్- ఇంద్రాణి ముఖర్జీకి బెయిల్
Bigg Boss OTT Winner: బిగ్ ఓటీటీ ఫినాలే - గెలిచేదెవరు?