TRS Plenary: కేసీఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు.... అభివృద్ధికి తెలంగాణ కేరాఫ్ అడ్రస్.. ప్లీనరీలో మంత్రి కేటీఆర్ కామెంట్స్
దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఆలోచించిందే దేశం ఆలోచిస్తున్నారు. ఐటీ అంటే ఇన్ క్రైడిబుల్ తెలంగాణ అన్నారు.
తెలంగాణ ఈరోజు చేసే ఆలోచన దేశం రేపు ఆలోచిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ ప్లీనరీలో మాట్లాడిన ఆయన తెలంగాణ దేశంలో వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమన్నారు. ప్రతీ పల్లె తెలంగాణలో నేడు ఆదర్శ పల్లె గా మారిందన్నారు. కేంద్రం సైతం తెలంగాణపై ప్రసంశలు కురిపిస్తోందన్నారు. లా అండ్ ఆర్డర్ లో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. టీఆర్ఎస్ తెచ్చిన ప్రతీ చట్టం తెలంగాణ ప్రజలకు చుట్టమన్నారు. తెలంగాణలో భూ రికార్డులు ఇకపై ఎవరూ టెంపరింగ్ చేయలేనంతగా పటిష్టం చేశామన్నారు. కేసీఆర్ అంటే... కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు అని కేటీఆర్ స్పష్టం చేశారు.
Also Read: ప్లీనరీ నుంచే కేసీఆర్ హుజురాబాద్ ప్రచారం ! ఎన్నికల సంఘంపై ఆగ్రహం వెనుక అసలు కారణం..
గూగుల్ కే గుండెకాయ.. పారిశ్రామిక అగ్రగామి
కరెంట్ కావాలని అడిగితే సమైక్య పాలకులు చుక్కల చూపించారని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇవాళ విద్యుత్ వినియోగంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందన్నారు. తెలంగాణ వస్తే పెట్టుబడులు రావని ఆరోజు ఆరోపణలు చేసిన నేతలు ఇప్పుడెక్కడని ప్రశ్నించారు. ఇవాళ యాప్స్ నుంచి గూగుల్ మ్యాప్ దాకా తెలంగాణ కేరాఫ్ అడ్రస్ గా నిలిచిందన్నారు. గూగుల్ కే గుండెకాయ హైదరాబాద్ నగరమన్నారు. ఐటీ అంటే ఇన్ క్రైడిబుల్ తెలంగాణ అని కేటీఆర్ పేర్కొన్నారు. పారిశ్రామిక ప్రగతిలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. సమగ్ర కుటుంబ సర్వే వల్ల సంక్షేమాన్ని ప్రతి గడపకు తీసుకెళ్లామని కేటీఆర్ తెలిపారు. బంగాల్ ఆలోచించేది దేశం ఆలోచిస్తుంది అనేది ఒకప్పటి నానుడి అని, ఇప్పుడు తెలంగాణ ఆలోచించిందే దేశం ఆలోచిస్తోందన్నారు. గిరిజన తండాలకు వారినే పాలకులుగా మార్చామన్నారు.
Also Read: టీఆర్ఎస్ @ 20 ...చింతమడక నుంచి ప్రజల మనసుల్లోకి కేసీఆర్ !
టీఆర్ఎస్ .. తెలంగాణ గళం, బలం, అగ్రగామి దళం
స్వరాష్ట్రం కోసం అలుపెరగని పోరాటం చేసి, రాష్ట్రాన్ని సాధించి, అభివృద్ధి పథం వైపు తెలంగాణను టీఆర్ఎస్ పార్టీ ముందుకు నడిపిస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ వేడుకల సందర్భంగా రెండు కవితలను కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ గళం.. బలం.. అగ్రగామి దళం.. టీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని పేర్కొన్నారు. ఈ మట్టి కోసమే పుట్టి గమ్యాన్ని ముద్దాడిన విముక్తి కేతనానికి 20 ఏళ్ల పండుగ అని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఈ మట్టి కోసమే పుట్టి
— KTR (@KTRTRS) October 25, 2021
గమ్యాన్ని ముద్దాడిన విముక్తి కేతనానికి
20 ఏండ్ల పండుగ!
స్వీయ రాజకీయ అస్తిత్వ
పతాకానికి
దిగ్విజయ ద్విదశాబ్ది వేడుక!
తెలంగాణ గళం ..బలం.. అగ్రగామి దళం
TRS!
జలదృశ్యం నుండి
సుజల సుఫల దృశ్యాల దాకా
ప్రపంచం చూడని.. మహోన్నత
పరివర్తనా ప్రస్థానం!#20YearsOfTRS pic.twitter.com/gAZUPpnd7j
Also Read: ఇప్పుడు ఏపీలో చీకట్లు.. తెలంగాణలో వెలుగులు ! తెలంగాణ దేశంకన్నా ముందు ఉందన్న కేసీఆర్