Hyderabad: తెలంగాణలో సద్దుల బతుకమ్మ సంబరాలు - ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
Traffic Restrictions: తెలంగాణలో సద్దుల బతుకమ్మ వేడుకలకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Traffic Restrictions In Hyderabad Due To Saddula Bathukamma: తెలంగాణలో బతుకమ్మ సంబరాలు (Bathukamma Celebrations) అంటేనే ఓ ప్రత్యేకం. 9 రోజుల పాటు ప్రకృతిని పూజించే వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. చివరి రోజు సద్దుల బతుకమ్మను నిర్వహించేందుకు భాగ్యనగరం సిద్ధమైంది. ఈ మేరకు హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆంక్షలు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ అమల్లో ఉంటాయని చెప్పారు. వాహనాలను ఇక్బాల్ మినార్ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వైపు మళ్లిస్తారు. అటు, పీవీ విగ్రహం ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ నుంచి ఎన్టీఆర్ మార్క్ వైపు వచ్చే వాహనాలను నెక్లెస్ రోటరీ వద్ద ప్రసాద్ ఐమాక్స్, మింట్ కాంపౌండ్ లేన్ వైపు మళ్లిస్తారు.
#HYDTPinfo #TrafficRestrictions
— Hyderabad Traffic Police (@HYDTP) October 9, 2024
Commuters are urged to note the #TrafficAdvisory in view of "Saddula Bathukamma" celebrations on 10.10.2024 from Amaraveerula Smaraka Sthupam to Bathukamma Ghat (Rotary Children's Park) on Upper Tank Bund b/w 16:00 and 23:00 hours. #Bathukamma pic.twitter.com/AHL4eFkPhr
అటు, రాణిగంజ్ నుంచి పీవీఎన్ఆర్ మార్గ్ (నెక్లెస్ రోడ్) వైపు వచ్చే వాహనాలను నల్లగుట్ట 'ఎక్స్' రోడ్ల వద్ద ట్రాఫిక్ మినిస్టర్ రోడ్డు వైపు మళ్లిస్తారు. ఎగువ ట్యాంక్ బండ్‌కు వచ్చే వాహనాలను పాత అంబేడ్కర్ విగ్రహం వద్ద వాహనాలు ఇక్బాల్ మినార్ వైపు మళ్లించనున్నారు. సికింద్రాబాద్ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలను కర్బలా మైదాన్ వద్ద బైబిల్ హౌస్ వైపు ట్రాఫిక్ మళ్లించనున్నారు. ధోబీ ఘాట్ నుంచి చిల్డ్రన్స్ పార్క్/అప్పర్ ట్యాంక్ బండ్‌కు వచ్చే వాహనాలను DBR మిల్స్ వద్ద కవాడిగూడ 'X' రోడ్ల వైపు మళ్లిస్తారు. కాగా, బతుకమ్మ వేడుకల సందర్భంగా సాధారణ వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు తప్ప, ఆర్టీసీ బస్సులపై ఆంక్షలు ఉండవని పోలీసులు స్పష్టం చేశారు. సికింద్రాబాద్ నుంచి ట్యాంక్ బండ్ మీదుగా ఎంజీబీఎస్‌కు వచ్చే అంతర్ జిల్లా ఆర్టీసీ బస్సులను స్వీకర్ - ఉపాకర్ జంక్షన్ వద్ద మళ్లించనున్నారు. వైడబ్ల్యూసీఏ, సంగీత్, మెట్టుగూడ, తార్నాక, నల్లకుంట, ఫీవర్ హాస్పిటల్, ఇతర ల్యాండ్ మార్క్‌ల మీదుగా ఎంజీబీఎస్ చేరుకుంటాయి. ట్యాంక్ బండ్ వైపు వెళ్లే సిటీ బస్సులను కర్బలా మైదాన్ వద్ద బైబిల్ హౌస్ వైపు మళ్లిస్తారు. వాహనదారులు, ప్రజలు వీటిని గమనించి ఇబ్బంది లేకుండా ప్లాన్ చేసుకోవాలని పోలీసులు సూచించారు.
ఈ రూట్లలో వద్దు
పాత సైఫాబాద్ PS (ద్వారకా హోటల్), ఇక్బాల్ మినార్, తెలుగు తల్లి జంక్షన్, నెక్లెస్ రోటరీ లిబర్టీ, పాత అంబేద్కర్ విగ్రహం, కవాడిగూడ కూడలి, కట్ట మైసమ్మ, కర్బలా మైదాన్, రాణిగంజ్, నల్లగుట్ట, ఖైరతాబాద్ ఫ్లైఓవర్.. వాహనదారులు ఈ రూట్లలో గురువారం వెళ్లకపోవడమే మంచిది.
Also Read: KTR: మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా - క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్