By: ABP Desam | Updated at : 12 Aug 2023 03:32 PM (IST)
ఏపీ, తెలంగాణ టాప్ హెడ్ లైన్స్
దళిత మంత్రి విశ్వరూప్‌కు అవమానం జరిగిందా ? - సున్నా వడ్డీ జమ సభలో అసలు ఏం జరిగింది ?
డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ జమ గురించి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి విశ్వరూప్‌కు అవమానం జరిగిందని కనీసం కుర్చీ కూడా వేయలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. దళితులపై సీఎం జగన్ కు కనీస గౌరవం లేదన్న విమర్శలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు ఈ ఆరోపణలు తీవ్రంగా చేస్తున్నారు. అయితే దీనిపై ఏపీ ప్రభుత్వ వర్గాలు వివరణ ఇచ్చాయి. అక్కడ మంత్రికి ఎలాంటి అవమానం జరగలేదని.. స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో డ్వాక్రా మహిళలల ఫోటో సెషన్ నిర్వహించారు. పూర్తి వివరాలు
నిజాం కాలేజీ పరిసరాలకు వచ్చిన ప్రతిసారి ఆ జ్ఞాపకాలు వెంటాడతాయి : కేటీఆర్
హైదరాబాద్ లోని నిజాం కళాశాలలో చదువుకున్నందుకు తనకు చాలా గర్వంగా ఉంటుందని.. విదేశాలకు వెళ్లినప్పుడు నిజాం కాలేజీలో చదువుకున్నట్లు గొప్పగా చెబుతానని మంత్రి కేటీఆర్ అన్నారు. 1993 నుంచి 96 వరకు నిజాం కాలేజీలో చదువుకున్నట్లు చెప్పుకొచ్చారు. నిజాం కాలేజీ పరిసరాలకు వచ్చిన ప్రతిసారీ విద్యార్థి జీవిత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయన్నారు. నిజాం కాలేజీకి గొప్ప పేరు ఉందని అన్నారు. నిజాం కాలేజీలో బాయ్స్ హాస్టల్, న్యూ కాలేజీ బ్లాక్ కు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీతో కలిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. పూర్తి వివరాలు
క్లైమాక్స్‌కు గన్నవరం వైసీపీ పంచాయితీ- సైకిల్ ఎక్కనున్న కీలక నేత
గన్నవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు తారా స్థాయికి చేరాయి. దీంతో ఆ పార్టీని వీడేందుకు యార్లగడ్డ వెంకటరావు రెడీ అయ్యారని సన్నిహితులు చెబుతున్నారు. పార్టీ వర్గాల్లో కూడా ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గన్నవరం నియోజకవర్గంలో ఇప్పటికే తారా స్థాయికి విభేదాలు చేరాయి. తెలుగు దేశం పార్టీ నుంచి గెలుపొందిన వల్లభనేని వంశీ మోహన్ ఎన్నికల తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు. జగన్ వెంట నడవాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి గన్నవరం వైఎస్‌ఆర్‌సీపీలో రాజకీయ రగడ రాజుకుంది. వంశీ రాకను ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన నేతలు వ్యతిరేకించారు. పూర్తి వివరాలు
దండుపాళ్యం బ్యాచ్‌లా వాలంటీర్‌లు- మరోసారి పవన్ సంచలన కామెంట్స్
ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్లకు దండుపాళ్యం బ్యాచ్‌కు పెద్ద తేడా లేదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఇళ్లలోకి చొరబడి గొంతులు కోస్తున్నారని ఆరోపించారు. ఈ మధ్య కాలంలో వాలంటీర్ చేతిలో హత్యకు గురైన మహిళ కుటుంబాన్ని పవన్ పరామర్శించారు. అక్కడే మీడియాతో మాట్లాడిన ఆయన వాలంటీర్లపై మరోసారి వివాదాస్పద కామెంట్స్ చేసారు. హత్యకు గురైన ఫ్యామిలీని పరామర్శించిన సందర్భంగా పవన్ ఎమోషన్ అయ్యారు. హత్యకు గురైన మహిళ ఫ్యామిలీని పరామర్శించిన పవన్‌తో ఆరోజు జరిగిన ఉదంతాన్ని వివరించారు. పూర్తి వివరాలు
18వ తేదీన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ? - ఎంత మంది సిట్టింగ్‌లకు సీట్లు గల్లంతు ఖాయమా ?
భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారు. అభ్యర్థుల కసరత్తును ఇప్పటికే పూర్తి చేశారు. మంచి రోజు చూసుకుని విడుదల చేయాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్చివరి వారంలో, లేదా నవంబర్ మొదటి వారంలోనే జరిగే అవకాశముందని అన్ని పార్టీలు అంచనా వేస్తున్నాయి. సెప్టెంబర్‌లోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే చాన్స్ ఉందని మంత్రి కేటీఆర్ చెబుతున్నారు. అందుకే అభ్యర్థుల జాబితాను రెడీ చేసారు. ప్రకటించాలని అనుకుంటున్నారు. పూర్తి వివరాలు
ఎన్టీఆర్ పేరుతో రూ. వంద నాణెం - ఆవిష్కరణకు కుటంబసభ్యులందరికీ ఆహ్వానం
మాజీ ముఖ్యమంత్రి, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నేత, వెండితెర మేరునగధీరుడిగా చరిత్రలో నిలిచిపోయిన ఎన్టీ రామారావుకు కేంద్రం అరుదైన గౌరవం ఇస్తోంది. ఆయన శతజయంతి సందర్భంగా రూపొందించిన వంద నాణెన్ని ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన ఆవిష్కరించనున్నారు. రాష్ట్రపతి ముర్ము.. రాష్ట్రపతి భవన్ లో జరిగే కార్యక్రమంలో ఈ నాణెన్ని విడుదల చేస్తున్నారు. ఎన్టీఆర్ కుటుంబసభ్యులతో పాటు వంద మందికి ఆహ్వానం పలికారు. పూర్తి వివరాలు
Minister KTR: పంప్ హౌస్ వల్ల నిర్మల్ వాసుల కల సాకారమైంది, మంత్రి కేటీఆర్
Telangana Election Shedule : పదో తేదీ తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ? - ఆ లోపే కీలక హామీలపై ఉత్తర్వులు !
PGECET Seats: పీజీఈసెట్ చివరి విడత సీట్ల కేటాయింపు పూర్తి, 3592 మందికి ప్రవేశాలు
Top Headlines Today: పవన్‌కు కృష్ణా జిల్లా పోలీసుల నోటీసులు - తెలంగాణ కాంగ్రెస్ ఆశావాహుల్లో పెరిగిపోతున్న టెన్షన్
తెలంగాణలో కాంగ్రెస్ జాబితా మరింత ఆలస్యం, ఆశావాహుల్లో పెరిగిపోతున్న టెన్షన్
ఇండియన్ ఆర్మీకి కౌటిల్యుడి రాజనీతి పాఠాలు, ప్రాచీన యుద్ధ తంత్రాలు గ్రంథాలపై ఫోకస్
Devil Movie Sequel : కళ్యాణ్ రామ్ 'డెవిల్'కు సీక్వెల్ - డైరెక్షన్ కాంట్రవర్సీకి చెక్ పెట్టడం కోసమా?
Ram Charan Meets Dhoni: రామ్ చరణ్, ధోని కలిశారు - ఎందుకో తెలుసా? 13 ఏళ్ళకు మళ్ళీ...
Bandi sanjay on BRS: ప్రధాని టూర్‌తో ప్రగతిభవన్‌లో ప్రకంపనలు- బీఆర్ఎస్‌లో చీలిక ఖాయమన్న బండి సంజయ్
/body>