By: ABP Desam | Updated at : 12 Aug 2023 02:35 PM (IST)
దండుపాళ్యం బ్యాచ్‌లా వాలంటీర్‌లు- మరోసారి పవన్ సంచలన కామెంట్స్- జనసేనాని ఎమోషన్
ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్లకు దండుపాళ్యం బ్యాచ్‌కు పెద్ద తేడా లేదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఇళ్లలోకి చొరబడి గొంతులు కోస్తున్నారని ఆరోపించారు. ఈ మధ్య కాలంలో వాలంటీర్ చేతిలో హత్యకు గురైన మహిళ కుటుంబాన్ని పవన్ పరామర్శించారు. అక్కడే మీడియాతో మాట్లాడిన ఆయన వాలంటీర్లపై మరోసారి వివాదాస్పద కామెంట్స్ చేసారు.
హత్యకు గురైన ఫ్యామిలీని పరామర్శించిన సందర్భంగా పవన్ ఎమోషన్ అయ్యారు.
పెందుర్తి నియోజకవర్గంలో @YSRCParty వాలంటీర్ చేతిలో హత్యకు గురైన వృద్ధురాలు కోటగిరి వరలక్ష్మి (72) కుటుంబాన్ని పరామర్శించనున్న @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.#HelloAP_ByeByeYCP #VarahiVijayaYatra pic.twitter.com/48GyRlVKOl
— JanaSena Shatagni (@JSPShatagniTeam) August 12, 2023
హత్యకు గురైన మహిళ ఫ్యామిలీని పరామర్శించిన పవన్‌తో ఆరోజు జరిగిన ఉదంతాన్ని వివరించారు. అతి కిరాతకంగా హత్య చేశాడని వివరించి చెబుతుంటే పవన్ ఎమోషన్ అయ్యారు. ఇంత కిరాతకంగా ఎలా చేస్తారని అన్నారు.
పరామర్శ తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్... వారాహి యాత్రకు విధించిన ఆంక్షలు వాలంటీర్‌లకు విధించి ఉంటే రాష్ట్రంలో ఇన్ని అరాచకాలు జరిగేవి కావన్నారు పవన్. మహిళను వాలంటీర్ అత్యంత దారుణంగా హత్య చేశారని అన్నారు. బంగారు నగల కోసం పిడిగుద్దులతో చంపేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత దారుణం జరిగినా ప్రభుత్వం తరఫున కానీ, వైసీపీ నుంచి కాని ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ ఫ్యామిలీని పరామర్శించలేదని ఆవేదన చెందారు.
రాష్ట్రంలో హ్యూమన్ ట్రాఫికింగ్‌పై తాను చేసిన ఆరోపణలకు పక్కా ఆధారాలు ఉన్నాయని అన్నారు పవన్. ఈ మధ్య కాలంలో సభలోనే కేంద్రం ఆలెక్కలు వెల్లడించిందని అన్నారు. ఒక్క విశాక నుంచే 150కిపైగా చిన్నపిల్లలు అదృశ్యమయ్యారని గుర్తు చేసారు.
వారాహి యాత్రపై పెట్టిన ఆంక్షలు వాలంటీర్‌లపై పెట్టి ఉంటే ఇన్ని దారుణాలు జరిగేవి కావని అభిప్రాయపడ్డారు. అయితే ఆంక్షలు మాత్రం జనసేనకు,పవన్ కల్యాణ్‌కే ఉంటాయని వేరే వాళ్లకు ఉండవని ఎద్దేవా చేశారు. పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ కోసం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకుంటారని వాలంటీర్ ఉద్యోగానికి అవేమీ అవసరం లేదా అని ప్రశ్నించారు.
Breaking News Live Telugu Updates: రింగ్ రోడ్డు కేసులో లోకేష్ పిటిషన్ డిస్పోస్ చేసిన హైకోర్టు- నోటీసు ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్లిన సీఐడీ టీం
IIITDMK Admissions: ఐఐఐటీడీఎం కర్నూల్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు, ఈ అర్హతలుండాలి
Top Headlines Today: టీడీపీని నడిపించేందుకు బ్రహ్మణి సిద్ధపడ్డారా? తెలంగాణలో బీజేపీ గాడిన పడుతుందా? టాప్ న్యూస్
IITTP: తిరుపతి ఐఐటీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, వివరాలు ఇలా
IITTP: తిరుపతి ఐఐటీలో ఎంఎస్ రిసెర్చ్ ప్రోగ్రామ్, వివరాలు ఇలా
Telangana BJP : సర్వశక్తులు కూడగట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నం - అగ్రనేతల పర్యటనలు మేలు చేస్తాయా ?
Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్ - దానం ఇలా కూడా చేయొచ్చు
Bigg Boss Gala Event: బిగ్ బాస్ గాలా ఈవెంట్, ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఇచ్చిన ఇంటి సభ్యులు- చివర్లో ట్విస్ట్ ఇచ్చిన అమర్
Cyber Crime: గణేష్ ఉత్సవాల లక్కీ డ్రాలో ఐఫోన్ 15-నమ్మితే అకౌంట్ ఖాళీ అయినట్టే
/body>