అన్వేషించండి

Top Headlines: అవనిగడ్డ జనసేన అభ్యర్థిగా బుద్ధప్రసాద్ - తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం, ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు మూలం ట్యాపింగ్

Top News: తెలుగు రాష్ట్రాల్లో ఉదయం నుంచి ఉన్న టాప్ హెడ్ లైన్స్ మీకోసం.

Top Headlines in Telugu States on April 4th: 

1. అవనిగడ్డ జనసేన అభ్యర్థిగా బుద్ధప్రసాద్

అవనిగడ్డ శాసన సభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ పేరును  పవన్ కళ్యాణ్ గారు ఖరారు చేశారు. గురువారం ఉదయం పవన్ కళ్యాణ్ గారు పార్టీ ముఖ్య నాయకులతో చర్చించారు. అవనిగడ్డ నుంచి ఆయనే బలమైన అభ్యర్థిగా నిర్ణయించి పేరును ఖరారు చేశారు. మండలి బుద్దప్రసాద్ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.  అంతకు ముందు పలుమార్లు ఆయన ఆ నియోజవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. నియోజకవర్గ వ్యాప్తంగా పట్టు ఉన్న నేత కావడంతో పవన్ కల్యాణ్ ఆయన వైపే మొగ్గు చూపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. చంద్రబాబుపై సజ్జల తీవ్ర విమర్శలు

చంద్రబాబు అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో రెండు రోజుల్లో ప్రజలుక తెలిసిందని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.  పింఛన్ల పంపిణీకి వాలంటీర్ల విషయంలో ఎన్నికల కమిషన్ పై టీడీపీ నేతలు వత్తిడి తీసుకు వచ్చారని ఆరోపించారు.  మార్చి 31వ తేదీ ఆర్థిక సంవత్సరం చివరి రోజు కాబట్టి ఏప్రిల్ ఒకటోతేదీన బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకునేందుకు కొంత ఆలస్యమయిందని, అయితే దీనిపై ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

3. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు మూలం ట్యాపింగ్

మునుగోడు ఉపఎన్నికల హడావుడిలో ఉన్న సమయంలో హైదరాబాద్ లో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు వ్యక్తులను అరెస్టు చేసిన కేసులో సంచలన విషయం వెలుగు చూసింది. ఈ కేసుకు మూలం ఫోన్ ట్యాపింగేనని కస్టడీలో ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్ రావు చెప్పినట్లుగా తెలుస్తోంది.   ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు రావు గువ్వల బాలరాజు, రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డిల ఫోన్లు ట్యాప్ చేశారు. వారు  బీజేపీ తో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలియగానే..  ప్రణీత్ రావు ప్రభుత్వ పెద్దలకు తెలియచేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

4. ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమ వద్ద ఉద్రిక్తత

సంగారెడ్డి జిల్లా చందాపూర్‌లోని ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. పరిశ్రమలోకి వెళ్లేందుకు కార్మికులు ఉదయం నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు. చివరకు పోలీసులు భారీగా చేరుకొని కార్మికులను నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు లాఠీ ఛార్జ్ చేశారు. పరిశ్రమ వద్ద జరుగుతున్న గొడవ విషయాన్ని తెలుసుకున్న  మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు అక్కడకు వెళ్లారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

5. ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగులు బీభత్సం

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగులు భయోత్పాతాన్ని సృష్టిస్తున్నాయి. ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. బుధారం సాయంత్రం ఒక రైతును తొక్కి చంపిన ఏనుగులు ఈ ఉదయం కూడా మరో రైతుపై దాడి చేశాయి. ఇద్దరు రైతులు స్పాట్‌లోనే మృతి చెందడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఎవరూ బయటకు రావద్దని ప్రజలకు హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Chit Chat: మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
Year Ender 2025: మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
Kadiyam Srihari: కడియం శ్రీహరి కూడా - దానమే మిగులుతారు - రాజీనామా తప్పదా ?
కడియం శ్రీహరి కూడా - దానమే మిగులుతారు - రాజీనామా తప్పదా ?
Bengalore One Side Love: మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?
మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?

వీడియోలు

గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్
James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Chit Chat: మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
Year Ender 2025: మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
Kadiyam Srihari: కడియం శ్రీహరి కూడా - దానమే మిగులుతారు - రాజీనామా తప్పదా ?
కడియం శ్రీహరి కూడా - దానమే మిగులుతారు - రాజీనామా తప్పదా ?
Bengalore One Side Love: మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?
మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?
Upcoming Movies 2027: మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
Revanth Reddy: పంచాయతీ ఎన్నికల్లో 66 శాతం కాంగ్రెస్ గెలుపు - క్రియాశీలక రాజకీయాల్లో లేని కేసీఆర్ - రేవంత్ కీలక వ్యాఖ్యలు
పంచాయతీ ఎన్నికల్లో 66 శాతం కాంగ్రెస్ గెలుపు - క్రియాశీలక రాజకీయాల్లో లేని కేసీఆర్ - రేవంత్ కీలక వ్యాఖ్యలు
Avatar 3 Piracy : 'అవతార్ 3' మూవీకి బిగ్ షాక్ - రిలీజ్‌కు ముందే ఆన్‌లైన్‌లో HD ప్రింట్
'అవతార్ 3' మూవీకి బిగ్ షాక్ - రిలీజ్‌కు ముందే ఆన్‌లైన్‌లో HD ప్రింట్
US Crime News: అమెరికాలో తండ్రిని చంపిన భారతీయ యువకుడు - మతపరమైన బాధ్యత తీర్చాడట - ఇలా ఉన్నారేంటి?
అమెరికాలో తండ్రిని చంపిన భారతీయ యువకుడు - మతపరమైన బాధ్యత తీర్చాడట - ఇలా ఉన్నారేంటి?
Embed widget