అన్వేషించండి

Sangareddy News: ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమ వద్ద ఉద్రిక్తత- కార్మికులపై లాఠీఛార్జ్‌- పరామర్శకు వెళ్లిన హరీష్‌

Harish Rao News: చందాపూర్‌లోని ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో ఉద్రిక్తత ఇంకా కొనసాగుతోంది. కార్మికులను పరామర్శించేందుకు వెళ్లిన హరీష్‌ను పోలీసులు అడ్డుకున్నారు.

సంగారెడ్డి జిల్లా చందాపూర్‌లోని ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. పరిశ్రమలోకి వెళ్లేందుకు కార్మికులు ఉదయం నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు. చివరకు పోలీసులు భారీగా చేరుకొని కార్మికులను నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు లాఠీ ఛార్జ్ చేశారు.  

పరిశ్రమ వద్ద జరుగుతున్న గొడవ విషయాన్ని తెలుసుకున్న  మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు అక్కడకు వెళ్లారు. ఆయన వద్దకు కార్మికులు వచ్చి తమ సమస్యలు చెప్పుకున్నారు. లోపలికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం లేదని చెప్పారు. పరిస్థితి చేయిదాటిపోతుందని గ్రహించిన పోలీసులు హరీష్‌ను అక్కడి నుంచిపంపేశారు. 

కార్మికులపై పోలీసులు లాఠీచార్జ్‌ చేయడాన్ని హరీష్ ఖండించారు. " కార్మికుల కుటుంబ సభ్యులపై దురుసుగా ప్రవర్తించడం, పోలీసులు లాఠీ చార్జీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దుఃఖంలో ఉన్నావారికి అండగా నిలబడి ఆదుకోవాలి తప్ప ఇలా వేధించడం సరికాదు. తెలంగాణకు చెందిన బాధితులకు బీఆర్ఎస్ తరఫున మేం సాయం అందిస్తాం. భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు జరగకుండా, రియాక్టర్లు పేలకుండా గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలి." అని అన్నారు. 

అంతకు ముందు ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో గాయపడిన బాధితులను ఎంఎన్ఆర్ ఆస్పత్రిలో మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. బాధితులకు భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన హరీష్‌రావు ప్రభుత్వంపై విమర్శలు చేశారు." మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను ఆదుకోవడంలో ప్రభుత్వం, కంపెనీ యాజమాన్యం ఘోరంగా విఫలమమయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో తరచూ రియాక్టర్లు పేలుతున్నాయి. చాలామంది చనిపోతున్నారు. అయినా ప్రభుత్వ పట్టించుకోవడం లేదు. అధికారులు ఏడాదికొకసారి రియాక్టర్లను తనిఖీ చేయకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. క్షతగాత్రులు ఏఏ ఆస్పత్రుల్లో ఉన్నారో స్పష్టం లేదు. ఎంతమంది చనిపోయారో, ఎంతమంది గాయపడ్డారో కూడా స్పష్టత లేదు. బాధితుల బాగోగులు ఎవరు చూస్తున్నారో కూడా తెలియడం లేదు. మంత్రులొచ్చి లాంఛనంగా పరామర్శించడం కాదు, చిత్తశుద్ధితో ఆదుకోవాలి. " అని డిమాండ్ చేశారు. 

మృతులకు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్న హరీష్‌... కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అన్నారు. " ప్రమాదానికి బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలి. మృతుల కుటుంబాలకు 50 లక్షల నష్టపరిహారం, గాయపడిన వారికి 25 లక్షలు పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. వైద్య ఖర్చులను ప్రభుత్వం, కంపెనీ భరించాలి. మృతదేహాలను స్వగ్రామానికి పంపడానికి అంబులెన్స్‌లను సమకూర్చి సాయం చేయాలి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి.

ఆర్గానిక్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మరో వ్యక్తి మృతి చెందినట్టు తేలింది. ఆయన మృతదేహం ఈ ఉదయం లభించింది. దీంతో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. ఇప్పటికే పరిశ్రమ డైరెక్టర్ సహా నలుగురు మృతదేహాలు లభించాయి. ఇప్పుడు మరో కార్మికుడు డెడ్‌బాడీని గుర్తించారు. ఇప్పుడు లభించిన కార్మికుడు హత్నూలు మండలం కొన్యాలకు చెందిన వడ్డె రమేష్‌గా గుర్తించారు. 

బుధవారం ఆయిల్ బాయిలర్‌లో మంటలు చెలరేగి పేలుడు జరిగింది. ఈ దుర్ఘటనలో పరిశ్రమ డైరెక్టర్‌ రవిశర్మ, దయానంద్‌, సుబ్రహ్మణ్యం, సురేష్‌ పాల్‌, చాకలి విష్ణు, రమేష్‌ చనిపోయారు. ఈ ప్రమాదంలో గాయపడిన 15 మందిని వివిధ ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
Pushpa Actor Shritej: మోసం చేశాడు... ఎఫైర్ల విషయంలో
మోసం చేశాడు... ఎఫైర్ల విషయంలో "పుష్ప" నటుడు శ్రీతేజ్ మీద బాంబు పేల్చిన భార్య
Telangana Airports: తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలుRail Bus in Mysore Rail Museum | తెలుగు రాష్ట్రాలకే ప్రత్యేకమైన రైలు బస్సు ఇలాగే ఉండేది | ABP DesamPrithvi Shaw Unsold IPL 2025 Auction | అద్భుతమైన భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకున్న పృథ్వీ షా | ABP DesamMS Dhoni Auction Plan CSK IPL 2025 Team | ధోని ప్లాన్ వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
Pushpa Actor Shritej: మోసం చేశాడు... ఎఫైర్ల విషయంలో
మోసం చేశాడు... ఎఫైర్ల విషయంలో "పుష్ప" నటుడు శ్రీతేజ్ మీద బాంబు పేల్చిన భార్య
Telangana Airports: తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
CID VijayPal: ఏపీ సీఐడీ మాజీ డీఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ - రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల దూకుడు!
ఏపీ సీఐడీ మాజీ డీఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ - రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల దూకుడు!
Physical Intimacy Health : లైంగిక ఆరోగ్యంపై చలికాలం ప్రభావం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
లైంగిక ఆరోగ్యంపై చలికాలం ప్రభావం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
Jio Best Prepaid Plan: జియో బెస్ట్ 84 రోజుల ప్లాన్ ఇదే - ఫ్రీగా డిస్నీప్లస్ హాట్‌స్టార్ కూడా!
జియో బెస్ట్ 84 రోజుల ప్లాన్ ఇదే - ఫ్రీగా డిస్నీప్లస్ హాట్‌స్టార్ కూడా!
Embed widget