Sajjala On Chandrababu : వాలంటీర్లు లేకపోవడం వల్లనే పించన్ల పంపిణీ ఆలస్యం - ప్రజలకు తెలుసన్న సజ్జల
Andhra News : వాలంటీర్లు లేకపోవడం వల్లనే పించన్ల పంపిణీ ఆలస్యం అయిందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. చంద్రబాబే ఈసీకి ఫిర్యాదు చేయించారన్నారు.
![Sajjala On Chandrababu : వాలంటీర్లు లేకపోవడం వల్లనే పించన్ల పంపిణీ ఆలస్యం - ప్రజలకు తెలుసన్న సజ్జల Sajjala blamed Chandrababu for the delay in pensions Sajjala On Chandrababu : వాలంటీర్లు లేకపోవడం వల్లనే పించన్ల పంపిణీ ఆలస్యం - ప్రజలకు తెలుసన్న సజ్జల](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/04/a27331147e9b74401d3c9300d647289e1712218874014228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Sajjala blamed Chandrababu for the delay in pensions : చంద్రబాబు అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో రెండు రోజుల్లో ప్రజలుక తెలిసిందని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పింఛన్ల పంపిణీకి వాలంటీర్ల విషయంలో ఎన్నికల కమిషన్ పై టీడీపీ నేతలు వత్తిడి తీసుకు వచ్చారని ఆరోపించారు. మార్చి 31వ తేదీ ఆర్థిక సంవత్సరం చివరి రోజు కాబట్టి ఏప్రిల్ ఒకటోతేదీన బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకునేందుకు కొంత ఆలస్యమయిందని, అయితే దీనిపై ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఖజానాలో డబ్బులు లేవంటూ టీడీపీ నేతలు తప్పుడు ప్రచారానికి దిగారన్నారు.
వాలంటీర్లు లేకపోవడం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు
వాలంటీర్ల వ్యవస్థను పక్కన పెట్టడం వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసుకుని చేసిన తప్పును సరిదిద్దుకేనే పనిలో టీడీపీ నేతలు పడ్డారన్నారు. జన్మభూమి కమిటీల మాదిరి కాదని, వాలంటీర్ల వ్యవస్థ ప్రజలకు సేవ చేసేందుకు ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. ప్రజల్లో మంచి పేరు వచ్చిందన్నారు. పింఛన్ల పంపిణీ విషయంలో ఏం జరిగిందన్నది ప్రజలకు తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగాలు ఇవ్వలేదన్న వారే సచివాలయ సిబ్బంది చేత పంపిణీ చేయించవచ్చు కదా? అని ప్రశ్నిస్తున్నారన్నారు. అడ్డం గొట్టింది చంద్రబాబు అన్న సంగతి అందరికీ తెలుసునని, అది ప్రజలకు కూడా అర్థమయిందన్నారు.
వాలంటీర్లకు మంచి పేరు రావడం వల్లే మద్దతుగా మాట్లాడుతున్న టీడీపీ
. ‘‘వాలంటీర్లపై కావాలనే టీడీపీ రాద్ధాంతం చేస్తోంది. వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. వాలంటీర్లపై చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. అందుకే ఇవాళ వృద్ధులు ఎండల్లో నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. వాలంటీర్ వ్యవస్థపై నిమ్మ గడ్డ రమేష్ ద్వారా ఫిర్యాదు చేయించారు.ప్రజల్లో తిరుగుబాటు వచ్చేసరికి వాలంటీర్లకు సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. చంద్రబాబుకు స్వార్థం తప్ప మరేమి పట్లదని విమర్శించారు. పించన్ల పంపిణీ మరో రెండు మూడు రోజుల్లో పంపిణీ పూర్తవుతుంది. వాలంటీర్లను అడ్డుకుని ఇప్పుడు మాపైనే విమర్శలు చేస్తారా అని సజ్జల ప్రశ్నించారు.
ఈసీపై కూటమి పార్టీలు ఒత్తిడి తెస్తున్నాయి !
చంద్రబాబు కుట్రలను ప్రజలు అర్థం చేసుకున్నారు. కూటమి పార్టీలన్నీ అధికారులపై ఒత్తిడి తెస్తున్నాయి. టీడీపీ , జనసేన, బీజేపీ కక్ష పూరితంగా వ్యవహరిస్తోంది. ఈసీపై ఒత్తిడి తేవడంతో అధికారుల బదిలీ జరుగుతోంది. చంద్రబాబు, పురందేశ్వరి ఫెయిల్యూర్ నేతలు అంటూ సజ్జల మండిపడ్డారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)