అన్వేషించండి

Errabelli emotion: తొర్రూరులో చేజారిన మున్సిపల్ పీఠం - భావోద్వేగంతో ఎర్రబెల్లి కన్నీరు

Errabelli Dayakar Rao: ఎర్రబెల్లి దయాకర్ రావు కన్నీరు పెట్టుకున్నారు. పూర్తి మెజార్టీ ఉన్నా ..మున్సిపల్ చైర్మన్ పీఠం చేజారిపోయిందని ఆయన ఆవేదన చెందారు.

Errabelli emotion:  మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికలు మంగళవారం అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ముగిశాయి. సుదీర్ఘ కాలం పాటు ఈ నియోజకవర్గంలో ఆధిపత్యం చలాయించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఈ ఫలితం కోలుకోలేని దెబ్బ తీసింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక కౌన్సిలర్ అనూహ్యంగా చివరి నిమిషంలో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో సమీకరణాలన్నీ మారిపోయాయి. తన కేడర్‌ను కాపాడుకోవడానికి ఎర్రబెల్లి క్యాంపు స్థలాలను మారుస్తూ విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ, ఫలితం మాత్రం కాంగ్రెస్ పక్షాన నిలిచింది.  లాటరీ పద్ధతిలో కాంగ్రెస్ కౌన్సిలర్  తూనం శ్రవణ్ మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.

లాటరీ పద్దతిలో కాంగ్రెస్‌కు తొర్రూరు మున్సిపల్ పీఠం                

తొర్రూరు మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులు ఉండగా భారత రాష్ట్ర సమితి 9 సీట్లు గెల్చుకుంది. కాంగ్రెస్ పార్టీకి ఏడు వచ్చాయి. కేవలం వార్డు సభ్యుల సంఖ్యను చూస్తే BRS స్పష్టమైన ఆధిక్యంలో  నిలిచింది. ఎక్స్ అఫీషియో ఓట్లతో మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో ఇరు పార్టీల బలం సమానం కావడంతో, అధికారులు లాటరీ పద్ధతిని అనుసరించారు. ఈ లాటరీలో అదృష్టం  కాంగ్రెస్  పార్టీని వరించింది. దీంతో తొర్రూరు మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది. 

కన్నీటి పర్యంతమైన ఎర్రబెల్లి - రాజకీయ సన్యాసంపై వ్యాఖ్యలు                      

ఈ రాజకీయ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియా ముందు బహిరంగంగానే కన్నీరు పెట్టుకున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అసహ్యం కలిగిస్తున్నాయని, విలువలు లేని రాజకీయాల్లో తానూ కొనసాగాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నట్లు ఆయన భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. రాజ్యాంగ విరుద్ధంగా అధికార యంత్రాంగాన్ని వాడుకుంటూ కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామికంగా వ్యవహరించిందని ఆయన మండిపడ్డారు. రాత్రింబవళ్లు పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు తాను ఏ సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదని చెబుతూ ఆయన బావోద్వేగానికి లోనయ్యారు. 

 పోలీస్ స్టేషన్‌లో ఉద్రిక్తత- అండగా నిలిచిన నేతలు                                       

మున్సిపల్ ఎన్నికల వేళ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పోలీసులు ఎర్రబెల్లి దయాకర్ రావును అదుపులోకి తీసుకుని నర్సింహులపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలియగానే మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ తమ మద్దతుదారులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ పోలీసుల తీరుపై వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రబెల్లిని పరామర్శించిన నేతలు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించడం తగదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.   


 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Feel The Jail: నేరం చేయకుండా జైలుకెళ్లాలని ఉందా? ఖైదీగా మారాలనుందా? - డబ్బులు కట్టి ఉండొచ్చు..ఇవిగో డీటైల్స్
నేరం చేయకుండా జైలుకెళ్లాలని ఉందా? ఖైదీగా మారాలనుందా? - డబ్బులు కట్టి ఉండొచ్చు..ఇవిగో డీటైల్స్
Extramarital Affair: పదో తరగతి ప్రేమ - పెళ్లయ్యాక వివాహేతర బంధం - క్లైమాక్స్ చాలా వయోలెంట్ !
పదో తరగతి ప్రేమ - పెళ్లయ్యాక వివాహేతర బంధం - క్లైమాక్స్ చాలా వయోలెంట్ !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Bandi Sanjay Son POCSO Case: కుమారుడి పోక్సో కేసు - బండి సంజయ్ రాజకీయ ఎదుగుదలకు ఇది శాపమా?
కుమారుడి పోక్సో కేసు - బండి సంజయ్ రాజకీయ ఎదుగుదలకు ఇది శాపమా?
Advertisement

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget