అన్వేషించండి

Prathyusha Case: నటి ప్రత్యూష మృతి కేసు- నిందితుడు లొంగిపోవాలని సుప్రీంకోర్టు తుది తీర్పు

Tollywood actress Pratyusha case | టాలీవుడ్ నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడు సిద్ధార్థరెడ్డి లొంగిపోవాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. నాలుగు వారాల్లోగా లొంగిపోవాలని గడువు ఇచ్చింది.

Actress Pratyusha Death case | న్యూఢిల్లీ: టాలీవుడ్ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడు సిద్ధార్థరెడ్డిని లొంగిపోవాలని ఆదేశించింది. 2002 ఫిబ్రవరిలో దాదాపు 24 ఏళ్ల కిందట నటి ప్రత్యూష అనుమానాస్పద స్థితిలో చనిపోవడం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు సిద్ధార్థ రెడ్డికి హైకోర్టు విధించిన రెండేళ్ల జైలుశిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. నాలుగు వారాల్లోగా లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. గతంలో హైకోర్టు విధించిన రూ.50 వేల జరిమానా కట్టాలని సైతం పేర్కొంది.

రెండున్నర దశాబ్దాల క్రితం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన నటి ప్రత్యూష మృతి కేసులో అత్యున్నత న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది. ప్రత్యూష తల్లి సుమారు 24 ఏళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత, ఈ రోజు (ఫిబ్రవరి 17, 2026) సుప్రీంకోర్టు ఈ కేసులో కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. నిందితుడు సిద్ధార్థ రెడ్డికి విధించిన శిక్షను ఖరారు చేస్తూ, నాలుగు వారాల్లోగా సంబంధిత అధికారుల ముందు లొంగిపోవాలని జస్టిస్ రాజేష్ బిందల్, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.

అసలేం జరిగిందంటే..

నటి ప్రత్యూష ప్రస్థానాన్ని పరిశీలిస్తే, భువనగిరికి చెందిన ఆమె 1998లో రాయుడు సినిమాతో వెండితెరకు పరిచయమై అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్, కోలీవుడ్‌లో స్టార్‌డమ్ సంపాదించుకున్నారు. అయితే, కెరీర్ ఎదుగుతున్న దశలోనే 2002 ఫిబ్రవరి 24న కేవలం 20 ఏళ్ల వయసులో ఆమె అనుమానాస్పద స్థితిలో చనిపోవడం అప్పట్లో దుమారం రేపింది. ఫిబ్రవరి 23న ప్రత్యూష, ఆమె స్నేహితుడు సిద్ధార్థ రెడ్డి విషం తాగి ఆసుపత్రిలో చేరగా, చికిత్స పొందుతూ ప్రత్యూష చనిపోయారు. సిద్ధార్థ రెడ్డి మాత్రం కోలుకుని మార్చి 9న డిశ్చార్జ్ అయ్యారు. అతడే స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ హాస్పిటల్ కు వెళ్లడంపై అనుమానాలు ఉన్నాయి.

రెండేళ్లు జైలుశిక్ష విధించిన హైకోర్టు

ప్రత్యూష మృతి కేసు ప్రారంభం నుండి అనేక మలుపులు తిరిగింది. ఇది కేవలం ఆత్మహత్య కాదని, ఆమెపై సామూహిక లైంగిక దాడి జరిగిందని, దీని వెనుక రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులు ఉన్నారని ప్రత్యూష తల్లి సరోజినీదేవి ఆరోపించారు. కుమార్తె మరణానికి కారకులకు శిక్ష పడాలని సుదీర్ఘ న్యాయపోరాటం చేశారు. తొలుత ఈ కేసును దర్యాప్తు చేసిన సీబీఐ, ఇది ఆత్మహత్యకు ప్రేరేపించిన ఘటనగా పేర్కొంటూ సిద్ధార్థ రెడ్డిపై ఛార్జిషీట్ దాఖలు చేసింది. 2004లో సెషన్స్ కోర్టు ఆయనకు ఐదేళ్ల శిక్ష విధించగా, 2011లో హైకోర్టు ఆ శిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ తీర్పు ఇచ్చింది.

న్యాయం కోసం సుప్రీంకోర్టుకు..

హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అటు సిద్ధార్థ రెడ్డి, ఇటు నటి ప్రత్యూష తల్లి సరోజిని దేవి 2012లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శిక్షను రద్దు చేయాలని సిద్ధార్థ, శిక్షను పెంచాలని సరోజినీదేవి దాఖలు చేసిన పిటిషన్లపై గత ఏడాది నవంబర్‌లో వాదనలు పూర్తియ్యాయి. అయితే తుది తీర్పును రిజర్వ్ చేసింది. ఈ క్రమంలో సుప్రీం ధర్మాసనం ప్రత్యూష కేసులో తుది తీర్పు ఇచ్చింది. నిందితుడు 4 వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశిస్తూ, జరిమానా చెల్లించాలని పేర్కొంది. గత 24 ఏళ్లుగా సాగుతున్న ఈ మిస్టరీ కేసులో బాధితులకు న్యాయం లభించింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sreeleela : శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
Ram Charan Sukumar : రామ్ చరణ్ సుకుమార్ మూవీ - సుక్కూ ప్లాన్ వేరే లెవల్... బర్త్ డే రోజున బిగ్ సర్ప్రైజ్?
రామ్ చరణ్ సుకుమార్ మూవీ - సుక్కూ ప్లాన్ వేరే లెవల్... బర్త్ డే రోజున బిగ్ సర్ప్రైజ్?
Vishwanath And Sons Teaser : సంజయ్ విశ్వనాథ్ వచ్చేశాడు - విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ రిలీజ్
సంజయ్ విశ్వనాథ్ వచ్చేశాడు - విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ రిలీజ్
Salman Khan Mathrubhumi : సల్మాన్ 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' టైటిల్ చేంజ్ - కొత్త టైటిల్ ఇదే... అసలు రీజన్ ఏంటో?
సల్మాన్ 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' టైటిల్ చేంజ్ - కొత్త టైటిల్ ఇదే... అసలు రీజన్ ఏంటో?
Advertisement

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jeevan Reddy: జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
YS Avinash Reddy: హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
Telangana Assembly: వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Sreeleela : శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
Iran Dancing Missile: డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
Tamil Nadu Assembly Elections 2026: రజనీ ఫ్యాన్స్ తో కయ్యం పెట్టుకున్న టీవీకే విజయ్ పార్టీ నేత - ఇక రాజకీయం కాదు ఫ్యాన్ వార్స్ తప్పవా?
రజనీ ఫ్యాన్స్ తో కయ్యం పెట్టుకున్న టీవీకే విజయ్ పార్టీ నేత - ఇక రాజకీయం కాదు ఫ్యాన్ వార్స్ తప్పవా?
Vizag Semi-ring Road: భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
Embed widget