News
News
వీడియోలు ఆటలు
X

Telangana Formation day celebrations : తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల పూర్తి షెడ్యూల్ ఇదే - ఎప్పుడెప్పుడు ఏ వేడుకలంటే ?

తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల షెడ్యూల్ ను విడుదల చేశారు.

FOLLOW US: 
Share:

 

Telangana Formation day celebrations :  తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జూన్‌ 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు 21 రోజులపాటు- ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపథ్యంలో ఉత్సవాల రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్‌ను  ఖరారు చేశారు.


జూన్‌ 2: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారు. హైదరాబాద్‌లోని గన్‌పార్క్‌ వద్ద గల అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పిస్తారు. అనంతరం, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయం ప్రాంగణంలో సీఎం కేసీఆర్‌ జాతీయ పతాకావిష్కరణ జరుపుతారు. అనంతరం దశాబ్ది ఉత్సవ సందేశాన్నిస్తారు.
జూన్‌ 3: తెలంగాణ రైతు దినోత్సవంగా జరుపుతారు. అన్ని రైతు వేదికలు కేంద్రంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలను, ఉచిత కరంటు-, రైతు బంధు, రైతు బీమా తదితర పథకాల విశిష్టతను తెలియజేసే కార్యక్రమాలుంటాయి. 
   
జూన్‌ 4: పోలీసుశాఖ ఆధ్వర్యంలో సురక్షా దినోత్సవం నిర్వహిస్తారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, ఫ్రెండ్లీ పోలీస్‌ విధానాన్ని, పోలీసు సేవలు వివరించే విధంగా కార్యక్రమాలుంటాయి.
జూన్‌ 5: తెలంగాణ విద్యుత్తు విజయోత్సవం జరుపుతారు. రైతులు, వినియోగ దారులు, విద్యుత్‌ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో సమావేశం ఉంటు-ంది. విద్యుత్‌ రంగంలో రాష్ట్రం సాధించిన గుణాత్మక మార్పును సభల్లో వివరిస్తారు.
జూన్‌ 6: ”తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం” జరుగుతుంది. పారిశ్రామిక వాడలు, ఐటీ- కారిడార్లలో సభలు నిర్వహిస్తారు. ఆయా రంగాల్లో సాధించిన ప్రగతిని వివరిస్తారు.

జూన్‌ 7: ”సాగునీటి దినోత్సవం” నిర్వహిస్తారు. సాగునీటి రంగంలో సాధించిన రికార్డు స్థాయి ప్రగతిని వివరిస్తూ సభలు ఉంటాయి. రవీంద్ర భారతిలో ఇరిగేషన్‌ శాఖ ఆధ్వర్యంలో సాగునీటి రంగంలో సాధించిన విజయాలపై సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి హాజరవుతారు.
జూన్‌ 8: ‘ఊరూరా చెరువుల పండుగ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా డప్పులు, బోనాలు, బతుకమ్మలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి. గోరేటి వెంకన్న రాసిన చెరువు పాటలు సహా చెరువుమీద ఇతర కవులు రాసిన పాటలను వినిపిస్తారు. మత్స్య కారుల వలల ఊరేగింపులతో ఘనంగా నిర్వహిస్తారు. చెరువు కట్టలపై సభలు నిర్వహిస్తారు. సహపంక్తి భోజనాలు చేస్తారు.
జూన్‌ 9: తెలంగాణ సంక్షేమ సంబురాలు జరుపుతారు. నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వం అందించిన ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి తదితర సంక్షేమ పథకాల లబ్ధిదారులతో సభలు జరుపుతారు. తెలంగాణ సంక్షేమంలో స్వర్ణయుగం సాధించిన తీరును, దేశానికి దిక్సూచిగా మారిన తీరును వివరిస్తారు.
జూన్‌ 10: తెలంగాణ సుపరిపాలన దినోత్సవం జరుపుతారు. అన్ని జిల్లా కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు- చేసి, రాష్ట్రంలో పరిపాలన సంస్కరణల ద్వారా ప్రభుత్వ వ్యవస్థలను ప్రజలకు మరింత చేరువ చేయడం ద్వారా కలిగిన మేలును తెలియజేసే కార్యక్రమాలను నిర్వహిస్తారు.

జూన్‌ 11: తెలంగాణ సాహిత్య దినోత్సవం నిర్వహిస్తారు. జిల్లాస్థాయిలో కవి సమ్మేళనాలు, రవీంద్రభారతిలో రాష్ట్ర స్థాయి కవి సమ్మేళనం ఉంటు-ంది. తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ సాధించిన ప్రగతి ప్రతిబింబించేలా జిల్లా, రాష్ట్రస్థాయిలో కవితల పోటీ-లు నిర్వహించి, బహుమతులందజేస్తారు.
జూన్‌ 12: తెలంగాణ రన్‌ నిర్వహిస్తారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో యువకులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులతో ఉదయం 6 గంటలకు తెలంగాణ రన్‌ పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.
జూన్‌ 13: తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం నిర్వహిస్తారు. మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటు-న్న కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి సమావేశంలో వివరిస్తారు.

జూన్‌ 14: తెలంగాణ వైద్యారోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్యరంగంలో జరిగిన విప్లవాత్మక అభివృద్ధి గురించిన సమాచారాన్ని, సందేశాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు అందజేస్తారు.
జూన్‌ 15: తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం జరుపుతారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ పల్లెలు సాధించిన ప్రగతిని తెలిపే కార్యక్రమాలుంటాయి.
జూన్‌ 16: తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం నిర్వహిస్తారు. పట్టణ ప్రగతి ద్వారా ప్రతి కార్పొరేషన్‌, మున్సిపాలిటీ-లు, పట్టణాలు సాధించిన ప్రగతిని, ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు చేకూరిన లబ్ధిని తెలిపే కార్యక్రమాలుంటాయి.
జూన్‌ 17: తెలంగాణ గిరిజనోత్సవం జరుపుతారు. నూతనంగా ఏర్పడిన గిరిజన గ్రామాల్లో సభలు నిర్వహిస్తారు. గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి వివరిస్తారు.
జూన్‌ 18: తెలంగాణ మంచి నీళ్ల పండుగ నిర్వహిస్తారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఎదుర్కొన్న తాగునీటి ఎద్దడి నుంచి నేడు మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాలు బిగించి ఉచితంగా స్వచ్ఛమైన సురక్షితమైన నీటిని సరఫరా చేస్తున్న తీరును వివరించే కార్యక్రమాలు ఉంటాయి.

జూన్‌ 19: సోమవారం తెలంగాణ హరితోత్సవం ఉంటు-ంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడానికి పెద్ద ఎత్తున జరిగిన కృషిని, తద్వారా అడవులు పెరిగిన తీరును వివరిస్తారు.
జూన్‌ 20: తెలంగాణ విద్యాదినోత్సవం నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నిరకాల విద్యా సంస్థల్లో సభలు నిర్వహిస్తారు. విద్యారంగంలో తెలంగాణ సాధించిన విజయాలను వివరిస్తారు. అదేరోజున ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న మన ఊరు మన బడి పాఠశాలల ప్రారంభిస్తారు. అదే సందర్భంలో సిద్ధమైన 10 వేల గ్రంథాలయాలను, 1,600 డిజిటల్‌ క్లాస్‌ రూమ్స్‌ లను ప్రారంభిస్తారు.

జూన్‌ 21: తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం నిర్వహిస్తారు. దేవాలయాలు, మసీదులు, చర్చీలు, మత ప్రార్ధనా మందిరాల్లో వివిధ కార్యక్రమాలుంటాయి.
జూన్‌ 22: అమరుల సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా పల్లెపల్లెనా, పట్టణాలు, నగరాల్లో, విద్యాలయాల్లో అమరులకు శ్రద్ధాంజలి ఘటించి, మౌనం పాటిస్తారు. అమరుల సంస్మరణ తీర్మానాలు చేస్తారు. ఈ సందర్భంగా అమరుల త్యాగాలను స్మరిస్తారు.

Published at : 24 May 2023 03:43 PM (IST) Tags: Telangana Decade Celebrations Telangana incarnation decade celebrations

సంబంధిత కథనాలు

Ambedkar Statue: అంబేడ్కర్ విగ్రహం ముందు కళాకారుల భిక్షాటన - ప్రభుత్వానికి వార్నింగ్!

Ambedkar Statue: అంబేడ్కర్ విగ్రహం ముందు కళాకారుల భిక్షాటన - ప్రభుత్వానికి వార్నింగ్!

Hyderabad Crime News: హైదరాబాద్ లో అర్ధరాత్రి వృద్ధురాలి హత్య, 23 తులాల బంగారం లాక్కెళ్లిన నిందితులు

Hyderabad Crime News: హైదరాబాద్ లో అర్ధరాత్రి వృద్ధురాలి హత్య, 23 తులాల బంగారం లాక్కెళ్లిన నిందితులు

YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు

YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు

MLC Kavitha on KCR: తెలంగాణ వచ్చాకే సింగరేణి కార్మికులకు గొప్ప లాభాలు: ఎమ్మెల్సీ కవిత 

MLC Kavitha on KCR: తెలంగాణ వచ్చాకే సింగరేణి కార్మికులకు గొప్ప లాభాలు: ఎమ్మెల్సీ కవిత 

KTR IT Report: హైదరాబాద్‌లో 1.83 లక్షల కోట్లకు ఐటీ ఎగుమతులు - వార్షిక ఐటీ నివేదిక విడుదల

KTR IT Report: హైదరాబాద్‌లో 1.83 లక్షల కోట్లకు ఐటీ ఎగుమతులు - వార్షిక ఐటీ నివేదిక విడుదల

టాప్ స్టోరీస్

Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం

Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

Top 50 Web Series: ఇండియాలో టాప్ 50 వెబ్ సీరిస్‌లు ఇవేనట - ‘రానా నాయుడు’ ఏ స్థానంలో ఉందో తెలుసా?

Top 50 Web Series: ఇండియాలో టాప్ 50 వెబ్ సీరిస్‌లు ఇవేనట - ‘రానా నాయుడు’ ఏ స్థానంలో ఉందో తెలుసా?