అన్వేషించండి

తెలంగాణ రోడ్ల అభివృద్ధి: 6 వేల కోట్లతో HAM ప్రాజెక్ట్.. ప్రతిపక్షాల విమర్శలేంటి? రహదారుల రూపురేఖలు మారనున్నాయా?

హైబ్రిడ్ అన్యూటీ మోడ్ లో తెలంగాణ రాష్ట్రంలోని ఎంపిక చేసిన రోడ్లను ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం రూ. 6,478 కోట్లు ఖర్చు చేయనుంది. దీంతో రహదారుల రూపురేఖలు మారనున్నాయి.

తెలంగాణ రోడ్ల అభివృద్ధి కోసం ఆరు వేల కోట్లతో రేవంత్ రెడ్డి సర్కార్ భారీ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించింది. హైబ్రిడ్ అన్యూటీ మోడ్ (HAM) పద్ధతిలో రాష్ట్రంలోని ఎంపిక చేసిన రహదారులను అభివృద్ధి చేయనుంది. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం రూ. 6,478 కోట్లు ఖర్చు చేయనుంది. రాష్ట్రంలోని రోడ్లను అభివృద్ధి చేయడం, నాణ్యతను పెంచడం, ప్రయాణ సమయం తగ్గించడం, ప్రయాణికులకు సురక్షిత ప్రయాణం కల్పించడం ఈ HAM రోడ్ల ప్రాజెక్టు ముఖ్య లక్ష్యం. ఈ రోడ్ల వివరాలు, నిధుల ఖర్చు, వాటిపై ప్రతిపక్షాల విమర్శలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

HAM మోడల్ అంటే ఏమిటి?

HAM మోడల్ అనేది రెండు పద్ధతుల కలయికగా చెప్పవచ్చు. సాధారణంగా మన దేశంలో రోడ్ల నిర్మాణానికి రెండు రకాల పద్ధతులు ఉంటాయి:

EPC మోడల్ (Engineering, Procurement, and Construction): ఈ మోడల్‌లో రోడ్డు నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. కాంట్రాక్టు పొందిన ప్రైవేటు సంస్థ కేవలం నిర్మాణ పనులు మాత్రమే చేస్తుంది. దీనివల్ల ఆర్థిక భారం ప్రభుత్వంపై ఉంటుంది.

BOT మోడల్ (Build, Operate, Transfer): ఈ మోడల్‌లో రోడ్డు నిర్మాణ ఖర్చును పూర్తిగా ప్రైవేటు సంస్థ భరిస్తుంది. నిర్మాణం పూర్తయ్యాక, ఆ సంస్థే టోల్ గేట్లు ఏర్పాటు చేసి, టోల్ వసూలు చేసుకుని తన పెట్టుబడిని తిరిగి రాబట్టుకుంటుంది. ఈ విధానం వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉండదు.

అయితే, హైబ్రిడ్ అన్యూటీ మోడ్ (HAM) పద్ధతిలో ఈ రెండు మోడల్స్ లక్షణాలు కనిపిస్తాయి. ఇందులో నిర్మాణ వ్యయంలో 40 శాతం ప్రభుత్వం, మిగిలిన 60 శాతం గుత్తేదారు సంస్థ పెట్టుబడి పెడుతుంది. గుత్తేదారు సంస్థ పెట్టిన 60 శాతం నిధులను ప్రభుత్వమే తిరిగి వాయిదాల పద్ధతిలో చెల్లిస్తుంది.

HAM ప్రాజెక్టులో మొదటి దశ ప్యాకేజీలు

ఈ HAM రోడ్ల ప్రాజెక్టులో భాగంగా తొలి దశలో 17 ప్యాకేజీల పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో 373 రోడ్లు, 5,190 కిలోమీటర్ల వరకు పనులు చేపడతారు. ఈ పనులపై ప్రభుత్వం పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు. ఏ రోడ్లను అభివృద్ధి చేస్తారన్న జాబితాను విడుదల చేయలేదు. అయితే, ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం కొన్ని జిల్లాలకు కేటాయింపులు ఇలా ఉన్నాయి:

వనపర్తి: 15 రోడ్లు, 279.16 కిలోమీటర్లు, వ్యయం రూ. 399.34 కోట్లు.

యాదాద్రి భువనగిరి: 16 రోడ్లు, 287.50 కిలోమీటర్లు, వ్యయం రూ. 389.73 కోట్లు.

మహబూబ్‌నగర్: 15 రోడ్లు, 279.16 కిలోమీటర్లు, వ్యయం రూ. 379.69 కోట్లు.

ఈ జాబితాలో మరికొన్ని రోడ్లు చేరవచ్చు లేదా కొన్ని తొలగించే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వం పూర్తి వివరాలను ప్రకటించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టులో R&B రోడ్లు, పంచాయతీరాజ్ పరిధిలోని గ్రామీణ రోడ్లను కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ప్రతి గ్రామం నుండి మండల కేంద్రానికి, మండల కేంద్రం నుండి జిల్లా కేంద్రాన్ని కలిపే రోడ్లను రెండు వరుసల రోడ్లుగా నిర్మించడం ఈ ప్యాకేజీల ప్రధాన లక్ష్యం.

ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మాణం

HAM రోడ్ల ప్రాజెక్టును ప్రభుత్వం పీపీపీ (PPP) మోడల్‌లో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించనుంది. నిధుల విషయానికి వస్తే, ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో 40 శాతం నిధులు (సుమారు రూ. 2,591 కోట్లు) ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. మిగిలిన 60 శాతం వ్యయాన్ని (సుమారు రూ. 3,887 కోట్లు) గుత్తేదారు సంస్థలు భరిస్తాయి. నిర్మాణం పూర్తయిన తర్వాత, గుత్తేదారు సంస్థ పెట్టుబడి పెట్టిన 60 శాతం నిధులను 15 ఏళ్ల కాల వ్యవధిలో, వడ్డీతో కలిపి వార్షిక వాయిదాలలో తిరిగి చెల్లిస్తుంది. ఈ ప్రాజెక్టులో ఎలాంటి టోల్ గేట్లు ఉండవు, ప్రజలు టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ వ్యయం మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. రోడ్ల పనులను రెండున్నర సంవత్సరాలలో పూర్తి చేయాలని లక్ష్యం విధించారు. నిర్మాణం పూర్తయిన తర్వాత రోడ్ల నిర్వహణ, మరమ్మతుల బాధ్యత కూడా 15 ఏళ్ల పాటు ప్రైవేటు సంస్థలే నిర్వర్తించాల్సి ఉంటుంది.

ప్రాజెక్టుపై ప్రతిపక్షాల విమర్శలు


కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని జిల్లాలను ఈ ప్రాజెక్టులోకి తీసుకోలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను పట్టించుకోలేదన్న విమర్శలు వచ్చాయి. రోడ్ల ఎంపిక, నిధుల కేటాయింపు రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జరిగాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, బీఆర్ఎస్ సీనియర్ లీడర్ హరీశ్ రావు వంటి వారు విమర్శించారు. అయితే వీటిని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను దశలవారీగా అభివృద్ధి చేస్తామని, ప్రాజెక్టు పనులను పారదర్శకంగా చేపడుతున్నట్లు వివరణ ఇచ్చారు. ఈ రోడ్ల నిర్మాణం పక్కాగా జరిగితే తెలంగాణ ప్రజలు నాణ్యమైన రోడ్లపై వేగంగా, సౌకర్యవంతంగా, భద్రంగా ప్రయాణించే అవకాశం ఉంది.

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
Viral Video: ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
Sircilla Sarpanchs: సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
Prashant Kishor: దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?

వీడియోలు

Mancherial Durga Idol Viral Video | మంచిర్యాల గోదావరీ తీరాన బయటపడిన అమ్మవారు | ABP Desam
India vs South Africa 3rd T20 Records | మూడో టీ20లో 5 పెద్ద రికార్డులు
Hardik Pandya Records in 3rd T20 | చరిత్ర సృష్టించిన హార్దిక్
Shubman Gill in Ind vs SA 3rd T20 | మళ్లీ విఫలమైన శుభ్మన్ గిల్
Suryakumar Yadav about His Batting | తన ఫార్మ్ పై వరుస క్లారిటీ ఇచ్చిన సూర్య

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
Viral Video: ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
Sircilla Sarpanchs: సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
Prashant Kishor: దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
IPS officer Sanjay: ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
UP bride: పెళ్లి మండపంలో కారు డిమాండ్ చేసిన వరుడు - పెళ్లి రద్దు చేసుకున్న వధువు -అచ్చం సినిమాలో జరిగినట్లే
పెళ్లి మండపంలో కారు డిమాండ్ చేసిన వరుడు - పెళ్లి రద్దు చేసుకున్న వధువు -అచ్చం సినిమాలో జరిగినట్లే
Nuclear ash over the Himalayas: హిమాలయాలపై అమెరికా పెట్టిన అణుకుంపటి -ఎవరికీ తెలియని సంచలన విషయాలు ఇవిగో
హిమాలయాలపై అమెరికా పెట్టిన అణుకుంపటి -ఎవరికీ తెలియని సంచలన విషయాలు ఇవిగో
Cheapest Cars in India: దేశంలో అత్యంత చవకైన కార్లు ఇవే! 34 KM మైలేజ్‌తోపాటు ADAS ఫీచర్ ఉన్న వాహనాల ధర ఎంత?
దేశంలో అత్యంత చవకైన కార్లు ఇవే! 34 KM మైలేజ్‌తోపాటు ADAS ఫీచర్ ఉన్న వాహనాల ధర ఎంత?
Embed widget