అన్వేషించండి

Mlc Election: ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్... ఈ నెల 14న ఓట్ల లెక్కింపు

తెలంగాణలో స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు.

తెలంగాణలో ఆరు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ ముగిసింది. ఆదిలాబాద్‌, నల్గొండ, మెదక్‌, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానం, కరీంనగర్ లో రెండు స్థానాలకు మొత్తం 26 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీపడ్డారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు మొత్తం 5,326 మంది ఓటర్ల కోసం 37 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల్లో ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో అత్యధికంగా 99.69 శాతం, 1,324 ఓట్లకు 1,320 ఓట్లు నమోదయ్యాయి. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 

Also Read: నూతన సచివాలయ పనులను పరిశీలించిన కేసీఆర్.. త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం

ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి : శశాంక్ గోయల్ 

కరీంనగర్ లోని జెడ్పీ కార్యాలయంలో పోలింగ్ కేంద్రాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ పరిశీలించారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని తెలిపారు. ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు  జిల్లా యంత్రాంగం చేసిందని తెలిపారు. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున ఓటర్లు వచ్చారని, కరీంనగర్  జిల్లాలోని రెండు స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్నారు. 

Also Read: వచ్చే దసరాకు పాలనలో కొత్త వెలుగులు... రెడీ అవుతున్న తెలంగాణ కొత్త సెక్రటేరియట్ !

ఖమ్మంలో స్పల్ప ఉద్రిక్తత

ఖమ్మం పోలింగ్ కేంద్రం స్వల్ప ఉద్రిక్తత జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పోలింగ్ కేంద్రంలోనే గంటల తరబడి ఉంటున్నారని, వారిని బయటకు పంపాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. దీంతో పోలీసులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. అంతకు ముందు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

Also Read: ఏపీలో ఓటీఎస్ తంటా.. ఉద్యోగులకు మొదలైన తలనొప్పులు.. అసలు ఈ ఓటీఎస్ ఎందుకంటే..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Weather: ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
IPL 2024: బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Paritala Sunitha Files Nomination | వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకాష్ రెడ్డిపై పరిటాల సునీత ఫైర్Singanamala YCP MLA Candidate Veeranjaneyulu | శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు ఇంటర్వ్యూCongress Leader Feroz Khan |ఒవైసీ ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా: ABP Straight Talkలో ఫిరోజ్‌ఖాన్SRH vs RCB AT Uppal | Fans Reactions | ఉప్పల్ వద్ద ఫ్యాన్స్ రచ్చ.. కోహ్లీ ఫ్యాన్సే పాపం..! | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Weather: ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
IPL 2024: బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Embed widget