అన్వేషించండి

Telangana Municipal Elections: మక్తల్ బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యతో ఎన్నిక రద్దు- మంత్రి వాకిటి శ్రీహరిని బర్తరఫ్ చేయాలని బీజేపీ డిమాండ్

Telangana Municipal Elections 2026 | మక్తల్ మున్సిపాలిటీలో బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య కలకలం రేపుతోంది. మంత్రి వాకిటి శ్రీహరిని తెలంగాణ కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.

Maktal BJP candidate commits suicide హైదరాబాద్: మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహదేవప్ప మృతి రాజకీయంగా దుమారం రేపుతోంది. సోమవారం రాత్రి మహదేవప్ప ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యతో మక్తల్ 6వ వార్డు ఎన్నిక రద్దు చేశారు. మహదేవప్ప మృతిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఫిబ్రవరి 11న ఎన్నికలు జరగనున్నాయి.

మక్తల్ బీజేపీ అభ్యర్థి మహదేవప్ప మరణం ఆత్మహత్య కాదని, అది కాంగ్రెస్ పార్టీ చేసిన రాజకీయ హత్య అని బండి సంజయ్ ఆరోపించారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు, అరాచకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ అరాచకాలను ఎదురొడ్డి పోరాడిన చరిత్ర బీజేపీ కార్యకర్తలదని, తమ సహనాన్ని పిరికితనంగా భావించవద్దని హెచ్చరించారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీని ప్రజలు రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుందని, ఈ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసే రోజులు దగ్గరపడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.


Telangana Municipal Elections: మక్తల్ బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యతో ఎన్నిక రద్దు- మంత్రి వాకిటి శ్రీహరిని బర్తరఫ్ చేయాలని బీజేపీ డిమాండ్

బీజేపీ అభ్యర్థి మృతిపై విచారణకు డిమాండ్.. కార్యకర్తలకు భరోసా
మక్తల్ బీజేపీ అభ్యర్తి మహదేవప్ప మృతి ఘటనపై నిష్పాక్షిక విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. బీజేపీ అభ్యర్థి చావుకు కారకులైన కాంగ్రెస్ నేతలను వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు. బీజేపీ నాయకత్వం ఎల్లప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటుందని, ఎవరూ అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. బీజేపీ నేత మహదేవప్ప కుటుంబాన్ని పరామర్శించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఇప్పటికే బయలుదేరి వెళ్లారు.

కాంగ్రెస్ అహంకార రాజకీయాలే బలితీసుకున్నాయి: రామచందర్‌రావు

మక్తల్‌ బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్యపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మహదేవప్ప బలవన్మరణం కేవలం ఆత్మహత్య కాదని, కాంగ్రెస్‌ పార్టీ అహంకారపూరిత రాజకీయాలు, మాఫియా బెదిరింపుల వల్ల జరిగిన దారుణమని ఆయన ఆరోపించారు. స్థానిక మంత్రి వాకిటి శ్రీహరి, ఆయన అనుచరుల వేధింపులు భరించలేకే మహదేవప్ప ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయని, అధికార మత్తులో కాంగ్రెస్ నేతలు ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని ఆయన మండిపడ్డారు.

మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్

ఓ వ్యక్తి ప్రాణం పోవడానికి కారణమైన మంత్రి వాకిటి శ్రీహరిని తక్షణమే తెలంగాణ కేబినెట్ నుంచి తొలగించాలని, ఆయన్ను వెంటనే అరెస్ట్ చేయాలని రామచందర్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని, లేనిపక్షంలో బీజేపీ కార్యకర్తల ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉండి పోరాటం కొనసాగిస్తుందని రామచందర్ రావు స్పష్టం చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Embed widget