News
News
X

Kamareddy Collector: కలెక్టర్ వాహనంపై 28 చలానాలు... వార్త వైరల్ అవ్వడంతో 15 చలానాలు చెల్లింపు..

నిబంధనలు సామాన్యులకే అధికారులు కాదనేది మరోసారి రుజువైందంటున్నారు ప్రజలు. ఒక్క చలానా ఉన్నా వాహనం జప్తు అనే పోలీసులు కలెక్టర్ వాహనంపై 28 చలానాలు పెండింగ్ ఉన్నా పట్టించుకోలేదని విమర్శిస్తున్నారు.

FOLLOW US: 
 
సామాన్యుల వాహనంపై ఒక్క చలానా పెండింగ్ లో ఉంటే బండి స్వాధీనం చేసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు చెబుతుంటారు. ఈ రూల్ సామాన్యులకే పరిమితమా... అధికారంలో ఉన్నవాళ్లకు, అధికారులకు వర్తించవా అంటున్నారు ప్రజలు. ప్రజలకు మార్గదర్శకంగా నిలవాల్సిన ఉన్నతాధికారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనడానికి ఈ ఘటనే నిదర్శనం. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా కలెక్టర్ వాహనంపై  ఏకంగా 28 చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

Also Read:  ఫకీర్ మాటలు బంద్ చేయండి.. సీఎం కేసీఆర్‌కు ఢిల్లీలో అలా అవమానం: మంత్రి ఎర్రబెల్లి

గత కలెక్టర్ల సమయంలో చలానాలు 

సామాన్యుల వాహనాలకు ఒకటి, రెండు చలాన్లు పెండింగ్ లో ఉంటే ట్రాఫిక్ పోలీసులు వాహనాలను రోడ్డుపై ఆపి మరి చలానాలు కట్టించుకుంటున్నారు. అదే జిల్లా కలెక్టర్ వాహనంపై 28 చలానాలు ఉన్నా ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. సామాన్యులు, అధికారులకు నిబంధనలు వేరుగా ఉంటాయా అని సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. సామాన్యులు తమ చలానాలను ఇంటికి వెళ్లి కడతామని చెప్పినా, పోలీసులను వేడుకున్నా వదలకుండా ముక్కుపిండి మరీ వసూలు చేస్తారు. కానీ ఒక జిల్లా కలెక్టర్ వాహనానికి 28 చలానాలు పెండింగ్ లో ఉంటే పోలీసులు ఎందుకు పట్టించుకోలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో 28 చలానాల్లో 15 చలానాలు చెల్లించారు అధికారులు. ప్రస్తుతం కలెక్టర్ వాహనంపై 13 చలానాలు పెండింగ్ లో ఉన్నాయి. అయితే ఈ చలానాలు గతంలో కలెక్టర్లుగా వ్యవహరించిన సత్యనారాయణ, శరత్ సమయంలో పడినట్లు తెలుస్తోంది. 

News Reels

Also Read: ఏపీ రాజధాని అంటే ఎక్కడో చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది.. ముఖ్యమంత్రికి ఎందుకంత కక్ష

వార్త వైరల్ అవ్వడంతో 15 చలానాలు చెల్లింపు

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ వాహనం (TS16 EE3366)పై 28 చలానాలు పడ్డాయి. 2016 నుంచి 2021 ఆగస్టు 20 మధ్య ఈ మొత్తం చలానాలు పడ్డాయని తెలుస్తోంది. ఈ చలానాలకు రూ.27,580 జరిమానా పడింది. ఇందులో అధిక వేగంతో వాహనం నడపడం వల్ల 24 చలానాలు పడ్డాయి. ఈ వార్త వైరల్‌ అవ్వడంతో 15 చలానాలు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇంకా కలెక్టర్ వాహనంపై 2019 నుంచి 2021 ఆగస్టు వరకు 13 చలానాలు పెండింగ్ లో ఉన్నట్లు వెబ్‌సైట్‌లో చూపిస్తోంది. ఈ చలానాలకు మొత్తం రూ.12,100 నగదు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వ అధికారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం ఇదేమీ మొదటిసారి కాదు. అంతకుముందు జనగామ జిల్లా కలెక్టర్ వాహనంపై 23 చలానాలు పడ్డాయి. జనగామ కలెక్టర్ ప్రభుత్వ వాహనంపై 2021 ఆగస్టు 30వ తేదీ వరకు 23 చలానాలు పడ్డాయి. ఈ వార్త అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

Also Read:  ఇద్దరివీ వీఆర్వో ఉద్యోగాలు, అన్నీ పాడుపనులే.. ఏళ్లుగా వారికి గాలం.. చివరికి ఇలా..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 24 Nov 2021 03:39 PM (IST) Tags: telangana news pending challans TS police kamareddy collector

సంబంధిత కథనాలు

APEAPCET 2022 Counselling: డిసెంబరు 2 నుంచి 'ఫార్మసీ' కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

APEAPCET 2022 Counselling: డిసెంబరు 2 నుంచి 'ఫార్మసీ' కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

Nagole Gun Fire : నాగోల్ బంగారం షాపులో కాల్పులు, యాజమానిని బెదిరించి గోల్డ్ తో పరారీ!

Nagole Gun Fire : నాగోల్ బంగారం షాపులో కాల్పులు, యాజమానిని బెదిరించి గోల్డ్ తో పరారీ!

Breaking News Live Telugu Updates: నాగోల్ లో కాల్పుల కలకలం, ఒకరికి బుల్లెట్ గాయాలు 

Breaking News Live Telugu Updates: నాగోల్ లో కాల్పుల కలకలం, ఒకరికి బుల్లెట్ గాయాలు 

Nirmal Bus Electrocution : విహారయాత్ర బస్సును తాకిన విద్యుత్ తీగలు, బస్సులో 56 మంది విద్యార్థులు!

Nirmal Bus Electrocution :  విహారయాత్ర బస్సును తాకిన విద్యుత్ తీగలు, బస్సులో 56 మంది విద్యార్థులు!

Warangal News : వరంగల్ లో దారుణం, ఎల్ఎల్‌బీ విద్యార్థినిపై ఎమ్మెల్యే పీఏ అత్యాచారం!

Warangal News : వరంగల్ లో దారుణం, ఎల్ఎల్‌బీ విద్యార్థినిపై ఎమ్మెల్యే పీఏ అత్యాచారం!

టాప్ స్టోరీస్

CM Jagan Review : ఉగాది నాటికి విలేజ్ క్లినిక్స్, ఆరోగ్య శ్రీ ఆసుపత్రుల వివరాలకు ప్రత్యేక యాప్ - సీఎం జగన్

CM Jagan Review : ఉగాది నాటికి విలేజ్ క్లినిక్స్, ఆరోగ్య శ్రీ ఆసుపత్రుల వివరాలకు ప్రత్యేక యాప్ - సీఎం జగన్

Minister Harish Rao : తెలంగాణ ఉద్యమాల గడ్డ- ఈడీ, ఐటీ దాడులతో బెదిరించలేరు - మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao : తెలంగాణ ఉద్యమాల గడ్డ- ఈడీ, ఐటీ దాడులతో బెదిరించలేరు - మంత్రి హరీశ్ రావు

ENG Vs PAK: ఇదెక్కడి మాస్ బ్యాటింగ్ అయ్యా - టెస్టుల్లో టీ20 రేంజ్ బ్యాటింగ్ - 75 ఓవర్లలోనే 506 కొట్టేసిన ఇంగ్లండ్!

ENG Vs PAK: ఇదెక్కడి మాస్ బ్యాటింగ్ అయ్యా - టెస్టుల్లో టీ20 రేంజ్ బ్యాటింగ్ - 75 ఓవర్లలోనే 506 కొట్టేసిన ఇంగ్లండ్!

TSPSC Group 4 Notification: 'గ్రూప్-4' నోటిఫికేషన్ వచ్చేసింది - 9168 ఉద్యోగాల భర్తీ షురూ!

TSPSC Group 4 Notification: 'గ్రూప్-4' నోటిఫికేషన్ వచ్చేసింది - 9168 ఉద్యోగాల భర్తీ షురూ!