News
News
X

TS News: స్థానిక సంస్థలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.... అభివృద్ది కార్యక్రమాలకు రూ.250 కోట్లు విడుదల

స్థానిక సంస్థలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రూ.250 కోట్లు విడుదల చేసింది. నిధులను జిల్లా, మండల పరిషత్ అభివృద్ధికి వినియోగించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు.

FOLLOW US: 
Share:

స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా, మండల పరిషత్ లకు తాజాగా 250 కోట్ల నిధులను విడుదల చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పంచాయతీ రాజ్ కమిషనర్ శరత్ నిధులను విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పరిషత్ లకు రూ.125 కోట్ల 87 లక్షల 50 వేల 500, మండల పరిషత్ లకు రూ.124 కోట్ల12 లక్షల 49వేల 500 విడుదల అయ్యాయి.  కాగా ఈ నిధుల విడుదలకు సహకరించిన సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధన్యవాదాలు తెలిపారు. ఈ నిధులను జిల్లా, మండల పరిషత్ ల అభివృద్ధి, వాటి పరిధిలోని ప్రజల పురోగతికి సక్రమంగా వినియోగించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

వరంగల్ లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి

వరంగల్ హెల్త్ సిటీ ఏర్పాటులో భాగంగా వరంగల్ కేంద్ర కారాగారం స్థలంలో నిర్మించే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి రూ.1100 కోట్లు విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇచ్చింది.  ఈ మేరకు జీవో జారీ చేసింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఎ.ఎం. రిజ్వీ జీవో 158 జారీ చేశారు. ఇందులో సివిల్ వర్క్స్ కి రూ.509 కోట్లు, మంచి నీరు, పారిశుద్ధ్యం కోసం రూ.20.36 కోట్లు, మెకానికల్, ఎలక్ట్రిసిటీ, ప్లంబింగ్ పనుల కోసం రూ.182.18 కోట్లు, వైద్య పరికరాల కోసం రూ.105 కోట్లు, అనుబంధ పనుల కోసం రూ.54.28 కోట్లు, చట్టబద్ధమైన పనులు, పన్నుల కోసం రూ.229.18 కోట్ల నిధులకు పాలనా అనుమతులు ఇచ్చారు.  టీఎస్ఎమ్ఐడీసీ, డీఎమ్ఈ ఆధ్వర్యంలో వెంటనే పనులు చేపట్టాలని రిజ్వీ అదేశించారు.

Also Read:  పార్లమెంట్‌లో పోరాటమే.. ధాన్యం కొనుగోళ్ల అంశంపై ఎంపీలతో కేసీఆర్ సమీక్ష !

సంక్షేమంలో తెలంగాణ నెంబర్ వన్ : మంత్రి ఎర్రబెల్లి దయాకర్

వరంగల్ హెల్త్ సిటీ నిర్మాణంలో భాగంగా వరంగల్ సెంట్రల్ జైల్ స్థలంలో సీఎం కేసీఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం శంకుస్థాపన చేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం నిధులు మంజూరు చేశారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఆర్థిక శాఖ మంత్రికి వైద్య ఆరోగ్యశాఖ అప్పగించడం వల్ల పనులు మరింత వేగం అవుతున్నారని అన్నారు. అందుకు మంత్రి హరీష్ రావుకి కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పూర్తయితే హైదరాబాద్ స్థాయిలో వైద్యం ఇక్కడి ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. హైదరాబాద్ లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పై భారం తగ్గుతుందని చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం విద్యా, వైద్యం, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే అగ్రగామిగా ఉందన్నారు. మాట తప్పని, మడమ తిప్పని ప్రభుత్వం కేసిఆర్ ది అని మరోసారి రుజువైందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.

Also Read:  విద్యాసంస్థల్లో పెరుగుతున్న కరోనా కేసులు.. ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు

Also Read: థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం.. ఆ విషయంలో కేంద్రం మీనమేషాలు: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

Also Read: వైఎస్‌ను కాంగ్రెస్‌ నుంచి బహిష్కరించాలన్న రోశయ్య..ఆ వైఎస్‌కే ఆత్మబంధువు ఎలా అయ్యారు !?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 04 Dec 2021 07:40 PM (IST) Tags: telangana telangana news cm kcr TS Latest news warangal news Warangal super specialty hospital Local bodies Minister errabelli dayakar

సంబంధిత కథనాలు

TSPSC Group1 Mains Exam Dates: గ్రూప్‌-1 అభ్యర్థులకు అలర్ట్ - మెయిన్స్‌ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల చేసిన టీఎస్ పీఎస్సీ

TSPSC Group1 Mains Exam Dates: గ్రూప్‌-1 అభ్యర్థులకు అలర్ట్ - మెయిన్స్‌ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల చేసిన టీఎస్ పీఎస్సీ

Hyderbad IT Raids : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఇంట్లో ఐటీ సోదాలు - ఫార్మా, రియల్ ఎస్టేట్ కంపెనీలతో లింకుల కారణంగానే ...

Hyderbad IT Raids : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఇంట్లో ఐటీ సోదాలు - ఫార్మా, రియల్ ఎస్టేట్ కంపెనీలతో లింకుల కారణంగానే ...

KTR: దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్, మా దారిలోనే ఇతర రాష్ట్రాలు ప్లాన్ : మంత్రి కేటీఆర్

KTR: దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్, మా దారిలోనే ఇతర రాష్ట్రాలు ప్లాన్ : మంత్రి కేటీఆర్

Breaking News Live Telugu Updates: తెలంగాణలో జూన్ 5 నుంచి గ్రూప్ 1 మెయిన్స్

Breaking News Live Telugu Updates: తెలంగాణలో జూన్ 5 నుంచి గ్రూప్ 1 మెయిన్స్

TS Assembly : ప్రసంగంలో మార్పులు సూచించిన గవర్నర్ - వాస్తవ అంశాలే ఉంటాయన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి !

TS Assembly : ప్రసంగంలో మార్పులు సూచించిన గవర్నర్ - వాస్తవ అంశాలే ఉంటాయన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి !

టాప్ స్టోరీస్

Nellore Anam : నెల్లూరు వైఎస్ఆర్‌సీపీలో మరోసారి ఆనం బాంబ్ - ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు - ప్రాణ హానీ ఉందని ఆందోళన !

Nellore Anam  :  నెల్లూరు వైఎస్ఆర్‌సీపీలో మరోసారి ఆనం బాంబ్ - ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు - ప్రాణ హానీ ఉందని ఆందోళన !

Thalapathy 67 Update: ‘దళపతి 67‘ నుంచి అదిరిపోయే అప్ డేట్, కీ రోల్‌లో సంజయ్ దత్, హీరోయిన్‌గా త్రిష

Thalapathy 67 Update: ‘దళపతి 67‘ నుంచి అదిరిపోయే అప్ డేట్, కీ రోల్‌లో సంజయ్ దత్, హీరోయిన్‌గా త్రిష

పెళ్లి కాకపోయినా పర్వాలేదు, పిల్లలను కనండి - పాలకులు షాకింగ్ నిర్ణయం, ఎక్కడో తెలుసా?

పెళ్లి కాకపోయినా పర్వాలేదు, పిల్లలను కనండి - పాలకులు షాకింగ్ నిర్ణయం, ఎక్కడో తెలుసా?

Agent Release Date : 'ఏజెంట్' రిలీజ్ డేట్ ఫిక్స్ - థియేటర్లలో అఖిల్ వైల్డ్ యాక్షన్ రైడ్ ఆ రోజు నుంచి షురూ!

Agent Release Date : 'ఏజెంట్' రిలీజ్ డేట్ ఫిక్స్ - థియేటర్లలో అఖిల్ వైల్డ్ యాక్షన్ రైడ్ ఆ రోజు నుంచి షురూ!