By: ABP Desam | Updated at : 04 Apr 2022 07:57 PM (IST)
ఢిల్లీకి గవర్నర్ తమిళిశై - యాక్షన్ ప్లాన్ ఖరారు చేసుకుని వస్తారా ?
తెలంగాణ గవర్నర్ ( Ts Governer ) తమిళిశై సౌందర్ రాజన్ ఢిల్లీకి వెళ్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ( Amit ShaH ) తో సమావేశం అయ్యే అవకాశం ఉంది. మాముూలుగా అయితే గవర్నర్ ఢిల్లీ పర్యటన పెద్దగా చర్చనీయాంశం అయ్యేది కాదు. కానీ ఇటీవలి కాలంలో తెలంగాణ ప్రభుత్వం ( TS Governament ) గవర్నర్‌ను అవమానిస్తోంది. లెక్కలోకి తీసుకోవడం లేదు. అసలు గవర్నర్ వ్యవస్థను గుర్తించడానికి నిరాకరిస్తున్నట్లుగా ప్రవర్తిస్తోంది. చివరికి గవర్నర్‌కు ప్రోటోకాల్ కూడా దక్కడం లేదు. ఈ క్రమంలో ఉగాది వేడుకల సందర్భంగా గవర్నర్ చేసిన వ్యాఖ్యలు కూడా కలకలానికి కారణం అయ్యాయి. ఎవరికీ తల వంచనని .. తన కార్యాచరణ తనకు ఉందని ప్రకటించారు. ఈ క్రమంలో ఆమె అమిత్ షాతో భేటీకి వెళ్లడం ఆసక్తి రేపుతోంది.
కర్ణాటకలోనూ బీజేపీని టార్గెట్ చేస్తున్న కేటీఆర్ ! కాంగ్రెస్‌తో కలిసి పొలిటికల్ గేమ్ ఆడుతున్నారా ?
ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ( KCR ) కూడా ఢిల్లీలోనే ఉన్నారు. అయితే ఆయన ప్రధానమంత్రితో భేటీకి ప్రయత్నిస్తున్నారు. అమిత్ షాను కలుస్తారో లేదో స్పష్టత లేదు. కేసీఆర్ కేంద్రంపై యుద్ధం ప్రకటించి ఉన్నారు. ఆ దిశగా ఆయన పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ నియమించిన గవర్నర్ తమిళిశైతోనూ అదే రీతిలో వ్యవహరిస్తున్నారు. గవర్నర్ ఇప్పటి వరకూ తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో భిన్నమైన పరిస్థితులు ఉంటాయి. అక్కడి గవర్నర్లు చాలా యాక్టివ్‌గా ఉంటారు. ప్రభుత్వాలతో తలపడుతూ ఉంటారు. బెంగాల్, తమిళనాడుల్లో అదే జరుగుతోంది.
కేంద్ర మంత్రికి ప్రివిలేజ్ నోటీస్, సభను తప్పుదోవ పట్టించారని టీఆర్ఎస్ ఆరోపణ
గవర్నర్ వ్యవస్థను అవమానిస్తున్నందున తెలంగాణ ప్రభుత్వంతో ఎలా వ్యవహరించాలన్నదానిపై కేంద్ర హోంశాఖ మంత్రి సలహాలు, సూచనలు గవర్నర్ తమిళిశై తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. గవర్నర్ స్వతంత్రంగా వ్యవహరిస్తే తెలంగాణ ప్రభుత్వానికి అనేక చికాకులు ఏర్పడతాయి. ఈ విషయం గతంలో చాలా సార్లు రుజువు అయింది. తెలంగాణలో పట్టు సాధించాలనుకుంటున్న బీజేపీ గవర్నర్ ద్వారా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే వ్యూహాన్ని అమలు చేస్తే ... రాజ్ భవన్‌కు.( Raj Bhavan ) . ప్రభుత్వానికి మరింత దూరం పెరిగే అవకాశం ఉంది. గతంలోబెంగాల్లో ఇదే తరహా పరిస్థితులు కనిపించాయి. మరోసారి అవి తెలంగాణలో రిపీట్ అవుతాయా లేకపోతే.. పరిస్థితి సద్దుమణుగుతుందా అన్నది వేచి చూడాలి.
Gold Rate Today 28th May 2022: పసిడి ప్రియులకు షాక్ - నేడు పెరిగిన బంగారం ధర, రూ.600 ఎగబాకిన వెండి - లేటెస్ట్ రేట్లు ఇవీ
NTR Jayanthi: మహానాయకుడు ఎన్టీఆర్కు నివాళులు అర్పించిన కళ్యాణ్ రామ్, తారక్
Hyderabad News : బీజేపీ కార్పొరేటర్ ఆర్డర్ చేసిన బిర్యానీలో బల్లి, హోటల్ నిర్వాహకుడికి నోటీసులు
Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం
TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు
Horoscope Today 28th May 2022: ఈ రాశులవారు తమ పనిని పక్కవారికి అప్పగించేందుకు ప్లాన్ చేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?
Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!
Rashmika Mandanna: బ్లాక్ డ్రెస్ లో రష్మిక - ఫొటోలు వైరల్