X

తెలంగాణలో పని చేసే ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కానీ ఒక్కసారి వెళ్తే అంతే..

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా కొంతమంది ఏపీకి చెందిన ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వారు ఆ రాష్ట్రానికి వెళ్లడానికి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

FOLLOW US: 

తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులు, అధికారులను ఆ రాష్ట్రానికి ఇక వెళ్లనున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు శాశ్వత బదిలీపై వెళ్లేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఇక్కడి ఉద్యోగులను బదిలీపై ఏపీ ప్రభుత్వం తీసుకెళ్లేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అక్కడి సర్కారుకు తెలియజేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. క్షమశిక్షణ చర్యలు, విజిలెన్స్‌ కేసులు పెండింగులో ఉన్నవారికి మాత్రం ఈ అవకాశం ఉండదని స్పష్టం చేసింది.

శాశ్వత బదిలీల కోసం ఉద్యోగులు, అధికారులు పాటించాల్సిన నిబంధనలపై ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీచేసింది. అన్ని శాఖల కార్యదర్శులు దీనిని అమలు చేయాలని తెలిపింది. బదిలీ కోసం ఉద్యోగులు వచ్చేనెల 15లోగా ధరఖాస్తులు చేసుకోవాలని సూచించింది.  మొదట్లో డిప్యుటేషన్‌, అంతరరాష్ట్ర బదిలీల కింద కొందరిని ఏపీ ప్రభుత్వం అనుమతించింది. 

కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ విషయంపై చర్చ జరిగింది. అయితే వారి శాశ్వత బదిలీకి ఆమోదం తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. తెలంగాణలో పదవీ విరమణ వయస్సు 58 ఏళ్లుండగా ఏపీకి బదిలీ కోరుతూ ఉద్యోగుల నుంచి ఎక్కువ దరఖాస్తులు వచ్చేవి. ఇప్పుడు తెలంగాణలో పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంచారు. అయితే ఎంతమంది ఉద్యోగులు శాశ్వత బదిలీలకు ముందుకొస్తారో చూసి వారిని అనుమతించే వీలుంది.  • ఏపీ రాష్ట్రానికి వెళ్లాలనుకునే ఉద్యోగులు తమ శాఖల్లో వచ్చే నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. వాటిని శాఖాధిపతులు ప్రభుత్వం దృష్టికి తేవాలి. సంబంధిత శాఖాధిపతి సిఫారసుతో ఉద్యోగి పనిచేసే శాఖ కార్యదర్శి ఏపీ ప్రభుత్వానికి నిరభ్యంతర పత్రం పంపించాలి.

  • ఆ రాష్ట్ర సర్కారు అనుమతి లభించిన ఉద్యోగులను వెంటనే సంబంధిత శాఖాధిపతి రిలీవ్‌ చేయాలి. ఈ సమాచారాన్ని సర్వీసు రిజిస్టర్‌లో నమోదు చేయాలి.

  • రిలీవ్‌ అయినవారు శాశ్వతంగా బదిలీ అయినట్లే పరిగణిస్తారు. మళ్లీ వెనక్కి వచ్చేందుకు అవకాశం ఉండదు. బదిలీపై వెళ్లేవారికి ప్రయాణ, కరవు భత్యాలు (టీఏ, డీఏలు) ఉండవు.

Also Read: Cheating Couple : వీళ్ల వేషాలు చూసి ఫ్లాటయితే బుక్కయినట్లే ! ఈ జంట ఎన్ని కోట్లకు జనాల్ని ముంచారో తెలుసా..?

Also Read: Love Story Movie: ‘లవ్ స్టోరీ’లో ఆ డైలాగ్‌తో.. తెలంగాణ ప్రభుత్వానికి సెటైర్?

Also Read: YS Sharmila Hunger Strike:  కేసీఆర్ సారూ.. ఇంకా ఎంత మంది నిరుద్యోగులు చనిపోతే స్పందిస్తారు

Tags: telangana cm kcr andhrapradesh employees ap and telangana bifurcation

సంబంధిత కథనాలు

Huzurabad By Election: హుజూరాబాద్ లో లెటర్ల లొల్లి.. దళిత బంధు ఆపింది ఈటలే అంటున్న టీఆర్‌ఎస్‌.. కాదు.. కాదంటున్న బీజేపీ

Huzurabad By Election: హుజూరాబాద్ లో లెటర్ల లొల్లి.. దళిత బంధు ఆపింది ఈటలే అంటున్న టీఆర్‌ఎస్‌.. కాదు.. కాదంటున్న బీజేపీ

Huzurabad And Badvel By Election: ముగిసిన హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారం.. మూగబోయిన మైకులు..

Huzurabad And Badvel By Election: ముగిసిన హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారం.. మూగబోయిన మైకులు..

Breaking News Live Updates: ముగిసిన హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారం.. మూగబోయిన మైకులు..

Breaking News Live Updates: ముగిసిన హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారం.. మూగబోయిన మైకులు..

Huzurabad Bypoll: చివరి నిముషంలో కుట్రలు జరుగుతాయి.. ఓటర్లకు అన్నీ తెలుసు.. మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

Huzurabad Bypoll: చివరి నిముషంలో కుట్రలు జరుగుతాయి.. ఓటర్లకు అన్నీ తెలుసు.. మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

Huzurabad Campaign : హుజురాబాద్‌లో హోరెత్తిన ప్రచారం ! "ఫేక్" ప్రచారాలనే నమ్ముకున్న పార్టీలు !

Huzurabad Campaign  :  హుజురాబాద్‌లో హోరెత్తిన ప్రచారం !
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Romantic: 'రొమాంటిక్' ప్రీమియర్ షోకి రాజమౌళితో సహా.. స్టార్లంతా.. 

Romantic: 'రొమాంటిక్' ప్రీమియర్ షోకి రాజమౌళితో సహా.. స్టార్లంతా.. 

Amit Shah on PM Modi: 'దేశం.. మోదీ వైపు చూస్తుంటే ప్రపంచం.. భారత్ వైపు చూస్తోంది'

Amit Shah on PM Modi: 'దేశం.. మోదీ వైపు చూస్తుంటే ప్రపంచం.. భారత్ వైపు చూస్తోంది'

Bigg Boss 5 Telugu: మొత్తానికి షణ్ముఖ్ కి ఛాన్స్ వచ్చిందిగా.. కెప్టెన్ గా రచ్చ చేస్తాడేమో.. 

Bigg Boss 5 Telugu: మొత్తానికి షణ్ముఖ్ కి ఛాన్స్ వచ్చిందిగా.. కెప్టెన్ గా రచ్చ చేస్తాడేమో.. 

Corona Cases In AP: రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 567 మందికి కొవిడ్19 పాజిటివ్

Corona Cases In AP: రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 567 మందికి కొవిడ్19 పాజిటివ్