Telangana Elections 2023 : తెలంగాణలో జనసేనకు గుర్తు సమస్య - 8 మందికి కామన్ సింబల్ వస్తుందా ?
Telangana Elections 2023 : తెలంగాణలో జనసేనకు కామన్ సింబల్ సమస్య వచ్చింది. గుర్తింపు లేకపోవడంతో వేర్వేరు గుర్తులు వద్దని ఎనిమిది మందికి ఒకే గుర్తు కేటాయించాలని జనసేన ఈసీని కోరింది.
Telangana Elections 2023 Janasena Symbol : బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలోకి దిగుతున్న జనసేనకు గ్లాస్ గుర్తు ( Glass Tumbler ) వస్తుందా రాదా అన్న టెన్షన్ ఏర్పడింది. జనసేన.. ఏపీలో మాత్రమే ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందింది. తెలంగాణలో ఆ పార్టీకి ఎలాంటి గుర్తింపు లభించలేదు. దీంతో ఆ పార్టీ గుర్తు గాజుగ్లాస్ ను తెలంగాణలో రిజర్వ్ చేయలేదు. బీజేపీ, జనసేన ( Janasena ) పొత్తులో బాగంగా ఎనిమిది సెగ్మెంట్ల నుంచి ఆ పార్టీ అభ్యర్థులు బరిలో నిలుస్తున్నారు. ఆ ఎనిమిది మందికి గాజు గ్లాస్ గుర్తు కోసం ఈసీకి జనసేన నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. గుర్తింపు లేకపోవడంతో ఇండిపెండెంట్లుగా పరిగణిస్తూ ఏదేని ఒక గుర్తు ఎన్నికల సంఘం ( Election Commision ) కేటాయించే అవకాశం ఉందని చెబుతున్నారు.
జనసేన విజ్ఞప్తి చేస్తే కామన్ సింబల్ కేటాయించే అవకాశం
జనసేన పోటీ చేస్తున్న 8 సెగ్మెంట్లలో అభ్యర్థులకు ఏమేం గుర్తులు కేటాయిస్తారు..? తాము ఎలా ప్రచారం చేయాలన్న టెన్షన్ కమలనాథులను వెంటాడుతున్నది. కూకట్‌పల్లి నుంచి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, తాండూరు నుంచి నేమూరి శంకర్ గౌడ్, కోదాడ నుంచి మేకల సతీష్ రెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి వంగల లక్ష్మణ్ గౌడ్, ఖమ్మం నుంచి మిర్యాల రామకృష్ణ, కొత్తగూడెం నుంచి లక్కినేని సురేందర్ రావు, వైరా (ఎస్టీ) నుంచి తేజావత్ సంపత్ నాయక్, అశ్వారావుపేట(ఎస్టీ) నుంచి ముయబోయిన ఉమాదేవి జనసేన తరఫున పోటీలో ఉంటున్నారు. కానీ ఒకే గుర్తు కావాలని విజ్ఞప్తి చేశారు. జనసేన విజ్ఞప్తిని ఈసీ అంగీకరించే అవకాశం ఉంది. .వీరికి గ్లాస్ గుర్తుకు బదులుగా ఏం గుర్తులు కేటాయిస్తారనేది ఉపసంహరణల తర్వాత తేలనుంది.
పోటీ చేయని చోట ఇతరులకు గాజు గ్లాస్ గుర్తు
2018 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. ఆంధ్రప్రదేశ్‌లో 137 స్థానాలు, తెలంగాణ నుంచి 7 లోక్‌సభ స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేశారు. పార్లమెంట్ స్థానాల్లో ఎవరికీ డిపాజిట్ రాలేదు. అవసరమైన అర్హతలు సాధించకపోవడంతో ఈ ఏడాది మే నెలలో కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును తొలగించింది. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీల వివరాలను ప్రకటిస్తూ.. జనసేన పార్టీ గ్లాస్ గుర్తును కోల్పోయినట్లు ప్రకటించింది. గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ చేస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. తర్వాత జనసేన పార్టీ విజ్ఞప్తితో ఆ పార్టీ పోటీ చేసే చోట్ల కామన్ సింబల్ కేటాయించేందుకు ఈసీ సమ్మతి తెలిపింది.
ఏపీలో నూ కామన్ సింబల్ గతంలోనే కేటాయింపు
ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రాకరం జనసేన బీఫాంపై పోీట చేసే చోట్ల అందరికీ గాజు గ్లాస్ గుర్తు కేటాయించే అవకాశం ఉంది. కానీ జనసేన పార్టీ పోటీ చేయని చోట్ల గాజు గ్లాస్ గుర్తు ఇండిపెండెంట్లకు కేటాయించే అవకాశం ఉంది. ఇది కూటమిలోని పార్టీలకు ఇబ్బందికరంగా మారుతుంది. జనసేన ఓటర్లు గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే బీజేపీకి నష్టం జరుగుుతందన్న ఆందోళన ఉంది. అదే గుర్తింపు పొందిన పార్టీ అయితే.. పోటీ చేయకపోే.. ఆ సింబల్ ఎవరికీ కేటాయించరు.