CM KCR: బీఆర్ఎస్ పుట్టిందే ప్రజల కోసం, పార్టీలను చూసి ఓటేయండి - కేసీఆర్
CM KCR: ప్రజాస్వామ్య భారతదేశంలో ఎన్నికలు వస్తే అబద్దాలు చెబుతారని, అభాండాలు వేస్తారని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అన్నారు. ఓటర్లు అభ్యర్థులతో పాటు పార్టీలను సైతం చూడాలని ఆయన అన్నారు.
CM KCR: ప్రజాస్వామ్య భారతదేశంలో ఎన్నికలు వస్తే అబద్దాలు చెబుతారని, అభాండాలు వేస్తారని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు (CM KCR) అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నర్సంపేట(Narsampet)లో బీఆర్ఎస్ (BRS) ప్రజా ఆశీర్వాద సభ (Praja Ashirvada Sabha) జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. జనాల్లో ఎన్నికలపై చర్చ వచ్చినప్పుడే ప్రజలు గెలుస్తారని చెప్పారు. ఓటర్లు అభ్యర్థులతో పాటు పార్టీలను సైతం చూడాలని ఆయన అన్నారు.
బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం
బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం అని కేసీఆర్ అన్నారు. తెలంగాణను రాకుండా చేసింది తెలంగాణ ప్రజలకు నీళ్లు అందకుండా చేసింది పార్టీ కాంగ్రెస్ పార్టీని మండిపడ్డారు. ఓటు అనేది ఐదు సంవత్సరాల భవిష్యత్తును నిర్ణయిస్తోందని ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నర్సంపేట నియోజకవర్గంలో 1,35,000 యాసంగి పంటలు పండుతున్నాయని అన్నారు.
గుజరాత్‌లో కూడా 24 గంటల కరెంట్ లేదు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణలో ప్రచారం చేయడానికి వస్తారని గంగానది ఉండే ఉత్తరప్రదేశ్‌లో కూడా ఈ రోజుకు మంచినీళ్లు అందే పరిస్థితి లేదని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో 24 గంటలు తాగునీరు అందుతోందని కేసీఆర్ అన్నారు. దేశ ప్రధాని మోదీ రాష్ట్రం గుజరాత్‌లో కూడా 24 గంటల కరెంటు లేదని ఒక తెలంగాణ లోనే 24 గంటల కరెంటు అందుతుందని చెప్పారు.
ధరణిని తీసేస్తారట!
రాష్ట్రంలో పెద్ద ప్రమాదం రాబోతుందని పార్టీల వైఖరులను ప్రజలు ఆలోచించాలని కేసీఆర్ కోరారు. భారతదేశంలో ప్రతి గిరిజన గూడానికి లంబాడి తండాలకు తాగునీటి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ధరణి తీసేస్తామని కాంగ్రెస్ ముఖ్య నేతలు మాట్లాడుతున్నారని ధరణితో రైతులకు ఎలాంటి సమస్యలు లేకుండా చేశామని ధరణి తొలగిస్తే రైతులకు రైతుబంధు ఎలా పడాలని కేసీఆర్ ప్రశ్నించారు.
తెలంగాణలో 24 గంటల విద్యుత్
రైతులకు 24 గంటల కరెంట్ అవసరం లేదని మూడు గంటల కరెంటు ఇస్తే సరిపోతుందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇచ్చేది మూడు గంటలేనని నొక్కి చెప్తున్నారని అన్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివ కుమార్ తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వచ్చి వారి వద్ద వ్యవసాయానికి ఐదు గంటలు ఇస్తున్నామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ వస్తుందని గమనించలేదని కేసీఆర్ అన్నారు.
కర్ణాటకలో 5 గంటలే కరెంట్
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 12 గంటల వచ్చే కరెంటు ఐదు గంటలు చేశారని కేసీఆర్ చెప్పారు. టూరిస్టులు లాగా ఐదేళ్లకోసారి వచ్చే నేతలను కాకుండా స్థానికంగా ఉండే నేతలను గెలిపించాలని కోరారు. రాష్ట్రం తలసరి ఆదాయం 18 శాతం ఉండేదని, తెలంగాణ వచ్చాక ఇండియాలో తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని కేసీఆర్ చెప్పారు.
దేశానికి అన్నపూర్ణగా తెలంగాణ
అన్ని రంగాల్లో తెలంగాణ అగ్రస్థానంలో దూసుకుపోతోందని కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు మూడు కోట్ల టన్నుల ధాన్యం పండిస్తున్నట్లు చెప్పారు. మరో 2 ప్రాజెక్టులు పూర్తయ్యే స్థాయిలో ఉన్నాయని, వాటిని కూడా పూర్తి చేస్తే నాలుగు కోట్ల టన్నుల ధాన్యం పండించేందుకు వీలుంటుందన్నారు. దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ అవతరించే రోజు దగ్గరలోనే ఉందని కేసీఆర్ అన్నారు.