By: ABP Desam | Updated at : 14 Apr 2022 04:12 PM (IST)
ఆర్పని సిగరెట్ పీకల వల్ల గత ఏడాది ఎంత నష్టమో తెలుసా ?
మాజీ ఎమ్మెల్యే కుమార్తె ఆత్మహత్యకు కారణం ఏమిటి ? పోలీసులకు సూసైడ్ నోట్ దొరికిందా ?
స్టైల్‌గా సిగరెట్ తాగి పూర్తిగా అయిపోక ముందే అలా విసిరేసి పోయేవారి సంఖ్య ఎక్కువే. కొంత మంది సిగరెట్ పీకను అలా కాలితో నలిపేసి వెళ్తూంటారు. వారి వల్ల పెద్దగా నష్టం లేదు. వారికి వారి లంగ్స్ మాత్రమే మాడిపోతాయి. కానీ పీకల్ని అలా ఆర్పకుండా విసిరేసేవారి వల్ల సమాజానికి .. ఇతరుల ఆస్తులకు కూడా నష్టం వాటిల్లుతంది. ఈ విషయం గణాంకాలతో సహా వెల్లడయింది. తెలంగాణ అగ్నిమాపక శాఖ గత ఆర్థిక సంవత్సరంలో జరిగిన అగ్ని ప్రమాదాలు.. వాటికి కారణాలు.. ఎంత నష్టం వాటిల్లిందో వివరాలు వెల్లడించింది.
రైలులో టికెట్ లేకుండా ప్రయాణించే వారు ఇట్టే దొరికిపోతారు, టీసీల చేతికి అధునాతన యంత్రాలు
తెలంగాణ అగ్నిమాపక శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఏడాదిలో 2754 అగ్ని ప్రమాదాలు కేవలం ఆర్పని సిగరెట్ పీకల వల్లే జరిగాయి. వీటి వల్ల కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లింది. అన్ని రకాలుగా గత ఏడాది జరిగిన అగ్ని ప్రమాదాల్లో ఏకంగా రూ.1991.70 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు రాష్ట్ర విపత్తు, అగ్నిమాపక సేవల శాఖ గణాంకాల ద్వారా వెల్లడైంది. అయితే ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే కొద్దిగా తక్కువే.
వీహెచ్ ఇంటిపై రాళ్ల దాడి, కారు ధ్వంసం! నిందితుడు ఇతనే - VHను పరామర్శించిన రేవంత్
2020లో 7,899 అగ్ని ప్రమాదాలు జరగ్గా, రూ.2,309.20 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. అదే 2021లో అగ్ని ప్రమాదాలు కొద్దిగా తగ్గగా.. ఆమేరకు నష్టం కూడా తగ్గింది.. ఫైర్ యాక్సిడెంట్లు 7,149 జరగ్గా, నష్టం రూ.1,991 కోట్లకు తగ్గింది. ఇక గతేడాది అగ్ని ప్రమాదాల నుంచి 30 మందిని ఫైర్ సిబ్బంది కాపాడారు. సుమారు రూ.1,501కోట్ల ఆస్తిని కాపాడినట్లు నివేదికలో స్పష్టం చేశారు. అగ్ని ప్రమాదాల రెస్క్యూ సమయంలో 10 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అగ్ని ప్రమాదాల నియంత్రణ కోసం గతేడాది 10,004 అవగాహన సదస్సులతో పలు చోట్ల మాక్ డ్రిల్స్ నిర్వహించారు.
అత్యధిక అగ్ని ప్రమాదాలు కేవలం నిర్లక్ష్యం వల్లనే చోటు చేసుకుంటూ ఉంటాయి. సిగరెట్ పీకల్ని ఆపకుండా విసిరేయడమే కాదు నిప్పుకు సంబంధించిన చాలా విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండటం వల్లే అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఎన్ని అవగాహనా కార్యక్రమాలు చేపట్టినా పరిస్థితుల్లో పెద్దగా మార్పు రావడం లేదు.
Modi In Hyderabad: మోదీ హైదరాబాద్ టూర్ షెడ్యూల్లో మార్పులు - కారణం ఏంటంటే
Modi Hyderabad Tour Live Updates: అరగంట ముందుగానే హైదరాబాద్ కు ప్రధాని మోదీ
Bandi Sanjay: బండి సంజయ్ వివాదాస్పద కామెంట్స్ వెనుక కారణాలేంటి? మళ్లీ దానిపై కన్నేశారా!
Khammam: సీఎం జగన్పై తెలంగాణ మంత్రి వ్యాఖ్యల దుమారం! అదే పనిగా విమర్శలు, అందులో ఆంతర్యంటి?
Telangana CM KCR Bengaluru Tour: నేడు హైదరాబాద్కు ప్రధాని మోదీ- బెంగళూరుకు సీఎం కేసీఆర్, ముచ్చటగా మూడోసారి
LSG vs RCB, Eliminator: లక్నో నాకౌట్కు 5 కారణాలు - ఆ ఒక్కటే 90% ఓడించింది!
Telangana Police Jobs: పోలీసు ఉద్యోగాలకు ఇంకా అప్లై చేయలేదా? ఇవాళే లాస్ట్ డేట్!
Modi Hyderabad Tour Today: నేడే హైదరాబాద్కు ప్రధాని, రంగంలోకి 2 వేల మంది పోలీసులు - పూర్తి షెడ్యూల్ ఇదీ
Amalapuram Violence: అమలాపురం అల్లర్ల కేసులో కీలక వ్యక్తి అరెస్టు, అసలు ఎవరీ అన్యం సాయి?