News
News
X

Mutton Price: ఇక్కడ మటన్ కిలో రూ.400 మాత్రమే, రోడ్డుపైనే పెద్ద క్యూ - ఎక్కడో తెలుసా?

మటన్‌ ధరల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంత లేదన్నా ప్రస్తుతం కిలో రూ.700 నుంచి రూ.800 వరకు అమ్ముతున్నారు.

FOLLOW US: 

మాంసం ధరలు ఈ రోజుల్లో ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చికెన్ ధర కిలో రూ.200 అటు ఇటుగా హెచ్చుతగ్గులు ఉండగా మటన్ రేటు మాత్రం రూ.800 పలుకుతోంది. డిమాండ్ ఉన్న సమయాల్లో అయితే కిలో రూ.వెయ్యి కూడా దాటుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ మాంసం వ్యాపారి మటన్ ధరలను బాగా తగ్గించి అమ్మడం స్థానికంగా చర్చనీయాంశం అయింది. దాదాపు రూ.800 వరకూ పలుకుతున్న కిలో మటన్ ను ఈ వ్యాపారి ఏకంగా రూ.400 కే విక్రయిస్తు్న్నాడు. ఈ విషయం తెలిసిన చుట్టుపక్కల గ్రామాలవారు, ఆ మటన్ షాపుకు పోటెత్తుతున్నారు.

మటన్‌ ధరల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంత లేదన్నా ప్రస్తుతం కిలో రూ.700 నుంచి రూ.800 వరకు అమ్ముతున్నారు. సిద్దిపేట జిల్లా అయితే మిరుదొడ్డి మండలం అక్బర్‌పేట గ్రామంలో మాత్రం కిలో మటన్‌ రూ.400 కే అమ్ముతున్నారు. దాదాపు నెలరోజుల నుంచి ఆ గ్రామంలో ఇదే రేటుకు ఆ మాంసం వ్యాపారి అమ్ముతున్నారు. విషయం చుట్టుపక్కల గ్రామాలకు తెలియడంతో మాంసం ప్రియులు పోటెత్తుతున్నారు. 

నిన్న (సెప్టెంబరు 26) ఆదివారం అందులోనూ మహాలయ అమావాస్య కావడంతో ఆ మాంసం వ్యాపారి దుకాణానికి జనం పోటెత్తారు. దీంతో ఆ గ్రామం రద్దీగా మారింది. దుబ్బాక, మిరుదొడ్డి, గజ్వేల్‌, బీబీపేట, దోమకొండ, రామాయంపేట, చేగుంట, దౌల్తాబాద్‌ మండలాల నుంచి జనం భారీగా తరలివచ్చారు. ఎవరికి వారు సొంత వాహనాల్లో మటన్ కొనుక్కొనేందుకు రావడంతో సిద్దిపేట మెదక్‌ మెయిన్ రోడ్డు వాహనాలతో నిండిపోయింది. 

దీంతో స్థానిక భూంపల్లి పోలీసులు రంగ ప్రవేశం చేసి మాంసం ప్రియులను అదుపుచేశారు. రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా మెయిన్ రోడ్డుపై ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. అయితే ఇంత తక్కువ ధరకు మటన్‌ విక్రయిస్తుండడంతో ఇతర ప్రాంతాలకు చెందిన కొందరు మాంసం వ్యాపారులు అడ్డుకున్నారు. ఎవరి ఇష్టం మేరకు వారు వ్యాపారం చేసుకుంటున్నారని, అడ్డుకోవడం తగదని అక్బర్‌పేట గ్రామస్థులు వారిని వారించారు.

News Reels

అక్బర్ పేట గ్రామంలో రాజేష్ అనే వ్యక్తి మటన్ షాపు నిర్వహిస్తున్నాడు. స్థానికంగా మటన్ కిలో రూ.650 వరకు అమ్ముతుంటే రాజేష్ మాత్రం తన దుకాణంలో కిలో మటన్ రూ.400లకు అమ్ముతున్నారు. ఇలా తక్కువ ధరకి మటన్ విక్రయిస్తున్నాం కదా అని నాణ్యతలో ఎక్కడా రాజీపడటం లేదని మాంసం దుకాణ నిర్వహకుడు రాజేష్ తెలిపాడు. రూ.400లకే నాణ్యమైన మటన్‌ని వినియోగదారులకు అందిస్తున్నానని చెప్పాడు. వినియోగదారులు కూడా మాంసం బాగానే ఉందని చెప్పుకొచ్చారు. 

ప్రస్తుత చికెన్ ధరలు

Chicken (చికెన్) 1 Kg - 180.00
Boneless Chicken (ఎముకలు లేని చికెన్) 1 Kg - 210.00
Country Chicken (దేశం చికెన్) 1 Kg - 380.00
Live Chicken (లైవ్ చికెన్) 1 Kg - 120.00
Chicken Liver (చికెన్ కాలేయం) 1 Kg - 170.00
Skinless Chicken (చర్మం లేని చికెన్) 1 Kg - 190.00

మటన్ ధరలు

Mutton 1 Kg - 650.00
Boneless Mutton 1 Kg - 750.00
Brain 1 Kg - 480.00
Head 1 Piece - 240.00
Heart 1 Kg - 470.00
Intestine 1 Kg - 420.00
Kidney 1 Kg - 450.00
Legs 1 Piece - 40.00
Liver 1 Kg - 450.00

Published at : 26 Sep 2022 08:38 AM (IST) Tags: Chicken Price in hyderabad mutton price siddipet distict siddipet news mutton rate

సంబంధిత కథనాలు

స్వల్పంగా పెరిగిన బంగారం ధర- కొనేవాళ్లకు భారీ ఊరట !

స్వల్పంగా పెరిగిన బంగారం ధర- కొనేవాళ్లకు భారీ ఊరట !

CM KCR : రెండు నెలల్లో వస్తా, అందమైన నిజామాబాద్ ను తీర్చిదిద్దాలె - సీఎం కేసీఆర్

CM KCR :  రెండు నెలల్లో వస్తా,  అందమైన నిజామాబాద్ ను తీర్చిదిద్దాలె - సీఎం కేసీఆర్

Bandi Sanjay : పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

Bandi Sanjay :  పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

KCR Review Meeting: రొటీన్‌గా కాదు, గొప్పగా పనిచేయండి - విప్లవాత్మక మార్పులు తీసుకొద్దాం: సీఎం కేసీఆర్

KCR Review Meeting: రొటీన్‌గా కాదు, గొప్పగా పనిచేయండి - విప్లవాత్మక మార్పులు తీసుకొద్దాం:  సీఎం కేసీఆర్

Breaking News Live Telugu Updates: జగిత్యాలలో ఉద్రిక్తత, బండి సంజయ్ ను అడ్డుకున్న పోలీసులు!

Breaking News Live Telugu Updates: జగిత్యాలలో ఉద్రిక్తత, బండి సంజయ్ ను అడ్డుకున్న పోలీసులు!

టాప్ స్టోరీస్

Mla Prakash Reddy : నా తమ్ముడు మాట్లాడిన భాష తప్పు, భావం కరెక్టే - ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి

Mla Prakash Reddy : నా తమ్ముడు మాట్లాడిన భాష తప్పు, భావం కరెక్టే - ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి

Mahesh Babu: నాన్నగారు నాకు చాలా ఇచ్చారు - అందులో గొప్పది మీ అభిమానం: సూపర్ స్టార్ మహేష్ బాబు!

Mahesh Babu: నాన్నగారు నాకు చాలా ఇచ్చారు - అందులో గొప్పది మీ అభిమానం: సూపర్ స్టార్ మహేష్ బాబు!

Talasani: 125 ఏళ్ల పార్టీ అంతరించిపోయింది, బీజేపీ నీటిమీద గాలి బుడగ లాంటిది: మంత్రి తలసాని

Talasani: 125 ఏళ్ల పార్టీ అంతరించిపోయింది, బీజేపీ నీటిమీద గాలి బుడగ లాంటిది: మంత్రి తలసాని

PPF Interest Rate: పదేళ్లలో పీపీఎఫ్‌ వడ్డీరేటు కనిపించకుండా కట్‌ చేసిన కేంద్రం! ఎంతో తెలిస్తే షాకే!

PPF Interest Rate: పదేళ్లలో పీపీఎఫ్‌ వడ్డీరేటు కనిపించకుండా కట్‌ చేసిన కేంద్రం! ఎంతో తెలిస్తే షాకే!