అన్వేషించండి

Praneeth Rao: మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో కీలక అప్డేట్, ఏడు రోజుల కస్టడీకి అనుమతి

SIT Police: మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును కస్టడీకి అప్పగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. దీంతో పోలీసులు రేపు ఆయనను తమ కస్టడీలోకి తీసుకోనున్నారు.

Telangana News: తెలంగాణలో సంచలనం రేపిన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్, హార్డ్‌డిస్క్‌ల ధ్వంసం  కేసులో అరెస్ట్ అయిన ఆయనను ఏడు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ నెల 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు పోలీస్ కస్టడీకి అప్పగించింది. ఈ ఏడు రోజుల పాటు ప్రణీత్ రావును సిట్ పోలీసులు విచారించనున్నారు. ఇప్పటికే ఈ నెల 13న కోర్టుకు పోలీసులు రిమాండ్ రిపోర్ట్ సమర్పించారు. ఈ రిపోర్టులో కేసుకు సంబంధించిన పలు కీలక అంశాలు పొందుపర్చారు. 42 హార్డ్‌డిస్క్‌లను ప్రణీత్ రావు ధ్వంసం చేశారని, అతడికి మరికొంతమంది సహకరించినట్లు పోలీసులు తేల్చారు.

తనకు అప్పగించిన పనే కాకుండా ఇతరుల ఫైళ్లను కూడా రహస్యంగా ప్రణీత్ రావు తయారుచేశారని, అత్యంత గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని కూడా తన పర్సనల్ పెన్‌డ్రైవుల్లోకి ఎక్కించుకున్నాడని గుర్తించారు. ఎన్నికలు ఫలితాలు విడుదలైన రోజే ఈ పని చేశారని, తన బాగోతం బయటపడకుండా సీసీ కెమెరాలను కూడా ఆఫ్ చేసినట్లు విచారణలో తేలింది. ప్రణీత్ రావు కేసుకు సంబంధించి జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలో స్పెషల్ టీమ్ ఇప్పటికే ప్రణీత్ రావు పనిచేసిన ఛాంబర్‌ను పరిశీలించింది. అక్కడ పనిచేసిన ఎలక్ట్రీషియన్‌ను కూడా విచారించారు.  ఎలక్ట్రీషియన్ సాయంతోనే హార్డ్‌డిస్క్‌లు ధ్వంసం చేసినట్లు గుర్తించారు.

రహస్య డేటా ఏముంది?

ఇక ప్రణీత్ రావుతో కలిసి పనిచేసిన అధికారులను కూడా దర్యాప్తు బృందం విచారించేందుకు సిద్దమవుతోంది. వారిని విచారిస్తే మరిన్ని వివరాలు బయటపడే అవకాశముంది. అసలు హార్డ్‌డిస్క్‌లు ధ్వంసం చేయాల్సి వచ్చిందంటే.. అందులో రహస్య డేటా ఏముందనే దానిపై ఆరా తీయనున్నారు. అలాగే ప్రణీత్ రావు వద్ద నుంచి సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులోని డేటాను సేకరించేందుకు ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్ట్ కోసం పంపించారు. ఆ రిపోర్ట్ వస్తే మరిన్ని వివరాలు బయటపడే అవకాశముంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత డిసెంబర్ 4న  ప్రణీత్ రావు స్విచ్ ఆఫ్ చేయకముందు, తర్వాతి సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

ప్రణీత్ రావు వ్యవహారం ఎలా బయటకొచ్చింది?

తన ఫోన్ ట్యాప్ చేశారంటూ ప్రణీత్ రావుపై ఓ వ్యాపారవేత్త పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.  దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు మూడు రకాల పాల్పడినట్లు గుర్తించారు.  ప్రజా ఆస్తుల ధ్వంసం, సాక్ష్యాల చెరిపివేత, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ట్యాంపరింగ్ వంటి నేరాలకు పాల్పడినందుకు ఆయా సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాను ఈ పని చేసినట్లు విచారణలో ప్రణీత్ రావు బయటపెట్టాడు. దీంతో ఆదేశాలు ఎవరు ఇచ్చారనే దానిపై కూడా విచారణ చేపడుతున్నారు.  ప్రణీత్ రావు కేసును కాంగ్రెస్ సర్కార్ సీరియస్‌గా తీసుకుంది. దీంతో పోలీసులు కూడా అన్ని కోణాల్లో దర్యాప్త చేపడుతున్నారు. ప్రణీత్ రావును కస్టడీలోకి తీసుకోవడంతో మరిన్ని వివరాలు సేకరించనున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Satellite Messaging: సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
Andhra News: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Satellite Messaging: సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
Andhra News: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Suzuki Access 125: భారత మార్కెట్లో సుజుకి కొత్త మైలురాయి - 60 లక్షల మార్కు దాటిన యాక్సెస్!
భారత మార్కెట్లో సుజుకి కొత్త మైలురాయి - 60 లక్షల మార్కు దాటిన యాక్సెస్!
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Embed widget