Sangareddy: గంటసేపట్లో పెళ్లి, ఇంతలో పెళ్లి కొడుకు పరార్.. కట్నం డబ్బు, బంగారం దోచుకొని మరీ..
సంగారెడ్డి జిల్లా కంది మండలం చిమ్నాపూర్ గ్రామానికి చెందిన యువతిని కొండాపూర్ మండలం మల్కాపూర్‌కు చెందిన మాణిక్ రెడ్డికి ఇచ్చి పెళ్లి జరిపించాలని ఇరు కుటుంబాల పెద్దలు నిశ్చయించారు.
సంగారెడ్డిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మరికాసేపట్లో వివాహం ఉందనగా పెళ్లి కుమారుడు పారిపోయాడు. అంతేకాక, తనతో పాటు పెళ్లి కూతురు తరపు వారు సమర్పించిన కట్నం, నగలను కూడా తీసుకొని వెళ్లిపోవడం స్థానికంగా కలకలం రేపింది. వివాహానికి గంట ముందు వరుడు పరారు కాగా.. పెళ్లి ఆగిపోయింది. ఈ ఘటన ఈ డిసెంబరు 12వ తేదీన చోటుచేసుకోగా కాస్త ఆలస్యంగా బుధవారమే వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు వివరించారు.
పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా కంది మండలం చిమ్నాపూర్ గ్రామానికి చెందిన యువతిని కొండాపూర్ మండలం మల్కాపూర్‌కు చెందిన మాణిక్ రెడ్డికి ఇచ్చి పెళ్లి జరిపించాలని ఇరు కుటుంబాల పెద్దలు నిశ్చయించారు. ఈ సంబంధం కుదరగానే ఆగస్టు 27న వీరికి నిశ్చితార్థం జరిగింది. చర్చల్లో భాగంగా వధువు తరపు వారు తాము పెళ్లి కుమారుడికి రూ.25 లక్షల డబ్బులు, మరో 25 తులాల బంగారాన్ని ఇస్తామని హామీ ఇచ్చారు.
ఈ నెల 12న పెళ్లి ముహూర్తం ఖరారు చేయించారు. సంగారెడ్డి పట్టణ పరిధిలోని పోతిరెడ్డి పల్లిలోని కల్యాణ మండపంలో వేదిక కూడా ఏర్పాటు చేశారు. ముందస్తుగా ఇచ్చిన హామీ ప్రకారం.. వరుడికి కట్నం కింద రూ.25 లక్షల నగదు, 25 తులాల బంగారం ఇచ్చారు. పెళ్లి అంతా సిద్ధం అవుతుండగా.. వివాహానికి గంట ముందు కట్నం డబ్బులు, బంగారంతో వరుడు ఎక్కడికో పారిపోయాడు. అనంతరం ఈ విషయం తెలిసిన మాణిక్ రెడ్డి కుటుంబ సభ్యులు పరువు పోయిందని భావించి ఊరు విడిచి వెళ్లిపోయారు. వధువు తరపు బాధిత కుటుంబీకులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. పారిపోయిన వరుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Also Read: Weather Updates: ఏపీకి వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.. తెలంగాణలో ఇలా.. వాతావరణ కేంద్రం ప్రకటన
Also Read: CPS Cancellation: సీపీఎస్ రద్దుపై ఉద్యోగుల ఆశలు ఆవిరి.. చేతులెత్తేసిన ప్రభుత్వం!
Also Read: యువనేతలకు నామినేటెడ్ పదవులు.. క్యాడర్‌లో జోష్ నింపుతున్న కేసీఆర్ !
Also Read : ఓ వైపు పథకాల సమీక్షలు..మరో వైపు జిల్లాల పర్యటనలు .. ఇక కేసీఆర్ బిజీ బీజీ !
Also Read: Jagan Governer : మరికొన్నాళ్లు విశ్రాంతి తీసుకోండి.. ఏపీ గవర్నర్‌కు ముఖ్యమంత్రి సూచన !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి