Weather Updates: ఏపీకి వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.. తెలంగాణలో ఇలా.. వాతావరణ కేంద్రం ప్రకటన
ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకూ రాగల 3 రోజులకు సంబంధించిన వాతావరణ అంచనాలను అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ కోస్తా తీర ప్రాంతం వెంబడి తక్కువ ఎత్తులో ఈశాన్య గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు వాతావరణ పరిస్థితుల అంచనాలను ఎలా అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు.
ఈ మేరకు ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకూ రాగల 3 రోజులకు సంబంధించిన వాతావరణ అంచనాలను అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు ట్వీట్ చేశారు. ఈ మూడు రోజులు రాష్ట్రంలో భారీ వర్షంతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని వెల్లడించారు. ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు ఒకట్రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక్కడ కూడా ఉరుములు, మెరుపులు ఒకట్రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
Also Read: Kurnool Onion Market: గిట్టుబాటు ధరలేక ఆగ్రహించిన ఉల్లి రైతు... పెట్రోల్ పోసి ఉల్లిబస్తాలకు నిప్పు
రాయలసీమలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు ఒకట్రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
తెలంగాణలో ఇలా..
తెలంగాణలో వాతావరణ పరిస్థితుల అంచనాలను హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రాగల 5 రోజులు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం లేదని వెల్లడించింది. వాతావరణం రాష్ట్రమంతా పొడిగానే ఉంటుందని అంచనా వేసింది. రాత్రి వేళ ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని అంచనా వేసింది.
Synoptic features and Weather warnings in English for Andhra Pradesh for next 5 days Dated 15.12.2021. https://t.co/WOwism4QNK
— MC Amaravati (@AmaravatiMc) December 15, 2021
Also Read: యువనేతలకు నామినేటెడ్ పదవులు.. క్యాడర్‌లో జోష్ నింపుతున్న కేసీఆర్ !
Also Read : ఓ వైపు పథకాల సమీక్షలు..మరో వైపు జిల్లాల పర్యటనలు .. ఇక కేసీఆర్ బిజీ బీజీ !
Also Read: YS Sharmila: వరి వద్దన్న ముఖ్యమంత్రి మనకొద్దు.. త్వరలో పాదయాత్ర చేస్తా
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి