By: ABP Desam | Updated at : 15 Dec 2021 08:18 PM (IST)
గవర్నర్తో సీఎం జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి .. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సమావేశమయ్యారు. కరోనా బారిన పడిన గవర్నర్ రెండు విడతలుగా హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలోచికిత్స పొందారు. మూడు రోజులకిందటే ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి విజయవాడ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని వాకబు చేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి గవర్నర్‌ను కలవాలని నిర్ణయించుకున్నారు. సతీమణి భారతితో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లారు.
Also Read : అమరావతి రైతుల సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. తిరుపతిలో 17న బహిరంగ సభ
గవర్నర్ దంపతుల ఆరోగ్య పరిస్థితిని సీఎం జగన్ అడిగి తెలుసుకున్నారు. 0కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని గవర్నర్ కు ముఖ్యమంత్రి సలహా ఇచ్చారు. అధికారిక కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉండవద్దని పూర్తి స్థాయిలో స్వస్థత చేకూరే వరకూ విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో ఇరువురి మధ్య రాష్ట్ర అంశాలపైనా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.
ఇటీవల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు రూ. నాలుగు వందల కోట్లను ప్రభుత్వం స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్‌లో బలవంతంగా డిపాజిట్ చేయించుకుంది. ఈ విషయంపై సోమవారం వరకూ ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. స్నాతకోత్వసం కూడా వాయిదా పడింది. ఈ క్రమంలో ఉద్యోగులు గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. రాజ్ భవన్ కు ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ వీసీ వచ్చి సమాధానం చెప్పినట్లుగా తెలిసింది.
Also Read : దేవుడున్నాడు ! టిక్కెట్ల వివాదంపై జగన్ ఊతపదంతోనే కౌంటర్ ఇచ్చిన బాలకృష్ణ !
ఈ వివాదంలో రూ. 175 కోట్లను తిరిగి ఎన్టీఆర్ వర్శిటీకి ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని చెబుతున్నారు. మరో వారంలో ఆ నిధులను ఎన్టీఆర్ వర్శిటీకి జమ చేస్తారని హమీ ఇవ్వడంతో ఉద్యోగులు ఆందోళన విరమించారు. ఈ వివాదాలతో పాటు ఇంతర అంశాలపైనా గవర్నర్ వివరాలు తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది.
Also Read: ప్రకాష్ రాజ్ ఆర్ధికసాయంతో బ్రిటన్లో చదివి ఉద్యోగం సాధించిన పేద యువతి... హ్యాట్సాఫ్ సర్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Kuppam Politics : కుప్పం బరిలో హీరో విశాల్, వైసీపీ నయా ప్లాన్-సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం!
Dharmana Prasada Rao : అమ్మ ఒడి డబ్బులు పంచే కార్యక్రమం కాదు, విపక్షాలకు మంత్రి ధర్మాన కౌంటర్
VIMS Jobs : విమ్స్ లో వైద్యుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఇలా దరఖాస్తు చేసుకోండి!
Breaking News Live Telugu Updates: పాడేరు ఘాట్ రోడ్డులో ప్రమాదం,15 మందికి గాయాలు
PSLV C-53 Launch : ఈ నెల 30న నింగిలోకి పీఎస్ఎల్వీ సీ53, శ్రీహరికోటలో ప్రయోగ ఏర్పాట్లు షురూ
Srilanka Crisis : శ్రీలంకలో పెట్రోల్ సెలవులు - ఎప్పటి వరకో తెలియదు!
Mahindra Scorpio N Launched: తక్కువ ధరతో, సూపర్ ఫీచర్లతో కొత్త స్కార్పియో - మహీంద్రా మళ్లీ కొట్టిందిగా!
Tollywood: ప్లాప్ సినిమాలను బ్లాక్ బస్టర్స్ అంటున్నారే!
Mohammed Zubair Arrested : జర్నలిస్ట్ మహ్మద్ జుబేర్ అరెస్ట్, ఓ మతాన్ని కించపరిచేలా మాట్లాడారని ఆరోపణలు