News
News
X

Tickets Rates Row : టిక్కెట్ జీవో సస్పెన్షన్‌పై డివిజన్‌ బెంచ్‌లో పిటిషన్.. టాలీవుడ్‌ను మళ్లీ టెన్షన్‌లోకి నెట్టిన ఏపీ సర్కార్ !

టిక్కెట్ రేట్ల తగ్గింపుపై ఇచ్చిన జీవో సస్పెన్షన్‌పై డివిజన్‌ బెంచ్‌లో ఏపీ ప్రభుత్వ అప్పీల్ చేసింది. టిక్కెట్ రేట్ల తగ్గింపును సమర్థించుకుంది.

FOLLOW US: 
Share:

టాలీవుడ్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వదిలి పెట్టాలని అనుకోవడం లేదు. టిక్కెట్ రేట్లను ఖరారు చేస్తూ ఇచ్చిన జీవో నెం.35ను సింగిల్ బెంచ్ సస్పెండ్ చేసింది . ఈ తీర్పుపై వెంటనే ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేసింది. టిక్కెట్ రేట్ల తగ్గింపును సమర్థించుకుంది. అన్ని వివరాలు పరిశీలించిన తరవాతనే.. సౌకర్యాలను బట్టి టిక్కెట్ రేట్లను ఖరారు చేశామని ప్రభుత్వం చెబుతోంది. హైకోర్టులో ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. అయితే తీర్పు కాపీ రాకపోవడంతో ధర్మాసనం విచారణ చేపట్టలేకపోయింది. తక్షణం విచారణ జరపకపోతే టిక్కెట్ రేట్లను యాజమాన్యాలు పెంచుతాయని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గురువారం ఉదయం తొలి కేసుగా విచారణ జరుపుతామని ఏజీకి హైకోర్టు ధర్మానసం తెలిపింది.

Also Read : బాలయ్యతో లెజెండరీ దర్శకుడు రాజమౌళి... త్వరలో ప్రోమో విడుదల

ఏప్రిల్ నెలలో ప్రభుత్వం టిక్కెట్ రేట్లను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ సమయంలో పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ రిలీజయింది. టిక్కెట్ రేట్లను తగ్గించడంతో ఆ సినిమా కలెక్షన్లపై భారీ ఎఫెక్ట్ పడింది. ఆ తర్వాత పెద్ద సినిమాలేమీ విడుదల కాలేదు. కరోనా సెకండ్ వేవ్ పూర్తయిన తర్వాత ఆంక్షలు సడలించినా పెద్ద సినిమాలు ఇంకా ల్యాబుల్లోనే ఉండిపోయాయి. దీనికి కారణం.. టిక్కెట్ రేట్లు గిట్టుబాటు కావనే. ఆ వివాదం సమసిపోవడానికి టిక్కెట్ రేట్లు పెంచుకునేలా నిర్ణయం వచ్చే వరకూ వేచి చూస్తున్నారు. 

Also Read: ప్రకాష్ రాజ్ ఆర్ధికసాయంతో బ్రిటన్లో చదివి ఉద్యోగం సాధించిన పేద యువతి... హ్యాట్సాఫ్ సర్

ఈ లోపు ధియేటర్ యజమానులు న్యాయపోరాటం ప్రారంభించారు. టిక్కెట్ రేట్లను నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదని వారు వాదించారు. గతంలోలా కొత్త సినిమాలు విడుదలైనప్పుడు టిక్కెట్ రేట్లను పెంచుకునే అవకాశం తమకు కల్పించాలని వారు కోరారు. హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం వారి వాదనను సమర్థించి ఆ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో టాలీవుడ్ కాస్త ఊపిరి పీల్చుకుంది. 

Also Read: హీరో ఉన్నాడు 'బిగ్ బాస్'లో... అతడి సినిమా డబ్బింగ్ అవుతోంది హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో

టాలీవుడ్‌లో వరుస  బడా సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. పుష్ప, ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, ఆచార్య వంటి సినిమాలు విడుదల కావాల్సి ఉన్నాయి. ఏపీలో టిక్కెట్ రేట్లను పెంచితేనే వాటికి బిజినెస్ గిట్టుబాటవుతుంది. ఇప్పుడు హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చే ఉత్తర్వులపై టాలీవుడ్ ఫేట్ ఆధారపడి ఉంది. 

Also Read: 'తప్పని తెలిసాక దేవుడినైనా ఎదిరించడంలో తప్పే లేదు'.. 'శ్యామ్ సింగరాయ్' ట్రైలర్..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి  

Published at : 15 Dec 2021 01:34 PM (IST) Tags: Tollywood cm jagan AP government Government of Andhra Pradesh reduction of ticket rates GO No. 35 Suspension Division Bench Appeal

సంబంధిత కథనాలు

Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్‌గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్

Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్‌గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్

Minister Botsa Satyanarayana : రాజకీయాలు దిగజారడానికి అచ్చెన్నాయుడు లాంటి వ్యక్తులే కారణం - మంత్రి బొత్స

Minister Botsa Satyanarayana : రాజకీయాలు దిగజారడానికి అచ్చెన్నాయుడు లాంటి వ్యక్తులే కారణం - మంత్రి బొత్స

Srisailam Bus Accident : శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సుకు తప్పిన పెనుప్రమాదం

Srisailam Bus Accident : శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సుకు తప్పిన పెనుప్రమాదం

Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ

Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ

గంజాయి స్మగ్లర్లు, మత్తు పదార్థాలు వినియోగిస్తున్న వారికి ఏపీ పోలీసుల స్పెషల్ కౌన్సిలింగ్

గంజాయి స్మగ్లర్లు, మత్తు పదార్థాలు వినియోగిస్తున్న వారికి ఏపీ పోలీసుల స్పెషల్ కౌన్సిలింగ్

టాప్ స్టోరీస్

Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!

Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!

Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్

Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్

IND vs NZ 2nd T20: న్యూజిలాండ్‌పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ - మూడో మ్యాచ్ గెలిస్తే సిరీస్ మనదే!

IND vs NZ 2nd T20: న్యూజిలాండ్‌పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ - మూడో మ్యాచ్ గెలిస్తే సిరీస్ మనదే!

-Rahul Gandhi In Srinagar: ప్రతిపక్షాల మధ్య విభేదాలున్నా, ఆరెస్సెస్- బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవుతాం: రాహుల్ గాంధీ

-Rahul Gandhi In Srinagar: ప్రతిపక్షాల మధ్య విభేదాలున్నా, ఆరెస్సెస్- బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవుతాం: రాహుల్ గాంధీ