Minister KTR : నర్మాల జలాశయాన్ని పరిశీలించిన మంత్రి కేటీఆర్, గంగమ్మ తల్లికి పూజలు
Minister KTR : సిరిసిల్ల జిల్లా యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలతో జిల్లాకు వరద ముంపు తప్పిందని మంత్రి కేటీఆర్ అన్నారు. తాగు నీటి సరఫరాపై జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Minister KTR : తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నా మంత్రి కేటీఆర్ వరద పరిస్థితులపై ఆరా తీశారు. ముందు జాగ్రత్త చర్యలపై సిరిసిల్ల జిల్లా అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. తాగు నీటి సరఫరా అవసరమైతే అదనంగా ల్యాబ్ లు ఏర్పాటు చేసి నీటిని పరీక్షించి ఆ తర్వాతే ప్రజలకు సరఫరా చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. జిల్లా యంత్రాంగం ముందు చూపుతో సిరిసిల్ల పట్టణంలో ముంపు లేకుండా చూశారన్నారు. ప్రాజెక్ట్ ల వద్ద ప్రజలు, పిల్లలను నియంత్రించాలని, పోలీసు పికెట్ లు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.
ఎవరూ సెలవుల్లో ఉండకూడదు
వర్షాలతో జిల్లాలో పెద్దగా పంట నష్టం ఏమీ జరగలేదు. రాష్ట్రంలో కూడా పెద్దగా జరిగినట్లు సమాచారం లేదు. నిర్మాణ దశలో ఉన్న కల్వర్ల వద్ద హెచ్చరిక బోర్డులు పెట్టాలని ఆదేశించాం. కోవిడ్, డెంగ్యూ, అంటు వ్యాధులకు సంబంధించి అన్ని రకాల మందులు జిల్లాలో అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో అధికారులు ఎవరు కూడా సెలవుల్లో ఉండకూడదు, ఇప్పటికే సెలవుల్లో ఉన్నవారు వెంటనే విధుల్లో చేరాలి. జిల్లాలో మనుషులకు, పశుసంపదకు కూడా ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించాం. - మంత్రి కేటీఆర్
గంగమ్మ తల్లికి పూజలు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్ మత్తడి పోస్తున్న నర్మాల జలాశయాన్ని సందర్శించారు. గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. ప్రాజెక్టు నీటి నిల్వ, ప్రాజెక్టులోకి వస్తున్న ఇన్ ఫ్లో వంటి అంశాలపైన సాగునీటి శాఖ అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. వరద నీరు భారీగా దిగువకు వెళ్తుందున ప్రాజెక్టు కింద ఉన్న చెరువుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా, గంభీరావుపేట మండలంలో భారీ వర్షాలతో నిండుకుండలా మారి అలుగు దుంకుతున్న నర్మాల ఎగువమానేరు జలాశయం వద్ద గంగమ్మ తల్లికి మంత్రి @KTRTRS పూజలు చేశారు. pic.twitter.com/NZF79EIYW4
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) July 14, 2022
Also Read : Bhadrachalam Godavari Floods : భద్రాచలం వద్ద ఉగ్రగోదావరి, వంతెనపై రాకపోకలు బంద్
Also Read : Minister Gangula: ముంపు ప్రాంతాల్లో మంత్రి గంగుల పర్యటన.. నేనున్నానంటూ బాధితులకు భరోసా!