అన్వేషించండి

Weather Updates : బలహీనపడుతున్న వాయుగుండం, ఏపీ, తెలంగాణలో మోస్తరు వర్షాలు

Weather Updates : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం క్రమంగా బలహీనపడుతోంది. వాయుగుండం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Weather Updates : దక్షిణ ఝార్ఖండ్‌ ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్ పై విస్తరించి ఉన్న తీవ్ర వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తుంది. ఆదివారం నాటికి ఉత్తర ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర మధ్యప్రదేశ్‌ దిశగా కదులుతూ తీవ్రవాయుగుండం బలహీనపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.  దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.  

కోస్తాంధ్ర, రాయలసీమలో 

తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో నేడు, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు పడతాయి. కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. రాయలసీమలోని నేడు రేపు తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.

తెలంగాణలో వర్షాలు 

రానున్న రెండు రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో  వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.  బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం క్రమంగా బలహీనపడి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరంలో వాయుగుండంగా మారే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశముందని చెప్పింది. శనివారం హైదరాబాద్ లోని పలు చోట్ల వర్షం కురిసింది. 

హైదరాబాద్ లో వర్షాలు

బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం బలహీనపడుతోంది. దీంతో దాని ప్రభావం తెలంగాణపై ఉంది. రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. కొన్ని జిల్లాలకు మోస్తరు వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురవనుంది. ఉదయం వేళ చల్లగా ఉంటూ, మధ్యాహ్నానికి వాతావరణం పూర్తిగా వేడెక్కుతుంది. ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడతారు. ఆగస్టు 21 వరకు రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడనున్నాయి.

Also Read : Horoscope Today 21 August 2022: ఈ రాశులవారు ఎవ్వరినైనా సులభంగా ప్రభావితం చేయగలరు, ఆగస్టు 21 రాశిఫలాలు

Also Read : Gold Price Today 21st August 2022: నిలకడగా బంగారం ధరలు- భారీగా తగ్గిన వెండి ప్లాటినం రేట్‌

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Inter Exams: ఏపీ ఇంటర్ ఎగ్జామ్ పేపర్లు, పాస్ మార్కులలో కీలక మార్పులు..
ఏపీ ఇంటర్ ఎగ్జామ్ పేపర్లు, పాస్ మార్కులలో కీలక మార్పులు..
Chandrababu UAE Tour Schedule: నేడు యూఏఈకి సీఎం చంద్రబాబు.. విశాఖ సమ్మిట్‌కు పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానాలు
నేడు యూఏఈకి సీఎం చంద్రబాబు.. విశాఖ సమ్మిట్‌కు పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానాలు
AP and Telangana Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం, ఏపీలో వారం రోజులు, తెలంగాణలో ఐదు రోజులు భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం, ఏపీలో వారం రోజులు, తెలంగాణలో ఐదు రోజులు భారీ వర్షాలు
Stock Market Holiday: నేడు స్టాక్ మార్కెట్ ఓపెన్ ఉంటుందా.. లేక హాలిడే ఇచ్చారా? ఈరోజు ఎందుకంత స్పెషల్
నేడు స్టాక్ మార్కెట్ ఓపెన్ ఉంటుందా.. లేక హాలిడే ఇచ్చారా? ఈరోజు ఎందుకంత స్పెషల్
Advertisement

వీడియోలు

6 Ball Over Behind Story | 6 బాల్ ఓవర్ కోసం ఇంగ్లండ్-ఆసీస్ మధ్య దశాబ్దాల ఫైట్‌ జరిగిందా? | ABP Desam
గంభీర్-గిల్ వల్లే అంతా! ఇలా అయితే సిరీస్ కూడా కష్టమే!
స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ సింగ్.. ఇద్దరికీ ఎంత తేడా?
ఇండియా మ్యాచ్.. రూ.60కే టికెట్
గంభీర్ వల్లే టీమిండియా ఓడింది: అశ్విన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Inter Exams: ఏపీ ఇంటర్ ఎగ్జామ్ పేపర్లు, పాస్ మార్కులలో కీలక మార్పులు..
ఏపీ ఇంటర్ ఎగ్జామ్ పేపర్లు, పాస్ మార్కులలో కీలక మార్పులు..
Chandrababu UAE Tour Schedule: నేడు యూఏఈకి సీఎం చంద్రబాబు.. విశాఖ సమ్మిట్‌కు పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానాలు
నేడు యూఏఈకి సీఎం చంద్రబాబు.. విశాఖ సమ్మిట్‌కు పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానాలు
AP and Telangana Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం, ఏపీలో వారం రోజులు, తెలంగాణలో ఐదు రోజులు భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం, ఏపీలో వారం రోజులు, తెలంగాణలో ఐదు రోజులు భారీ వర్షాలు
Stock Market Holiday: నేడు స్టాక్ మార్కెట్ ఓపెన్ ఉంటుందా.. లేక హాలిడే ఇచ్చారా? ఈరోజు ఎందుకంత స్పెషల్
నేడు స్టాక్ మార్కెట్ ఓపెన్ ఉంటుందా.. లేక హాలిడే ఇచ్చారా? ఈరోజు ఎందుకంత స్పెషల్
Home Minister Anita: డీఎస్పీ జయసూర్యపై నివేదిక మా దగ్గర ఉంది- చర్యలు ఖాయం - హోంమంత్రి అనిత ప్రకటన
డీఎస్పీ జయసూర్యపై నివేదిక మా దగ్గర ఉంది- చర్యలు ఖాయం - హోంమంత్రి అనిత ప్రకటన
Jubilee Hills by-election: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో భారీగా నామినేషన్లు- పోటీ మాత్రం ముగ్గురు మధ్యే!
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో భారీగా నామినేషన్లు- పోటీ మాత్రం ముగ్గురు మధ్యే!
8th Pay Commission : 8వ వేతన సంఘం ప్రకారం HRA, ప్రాథమిక వేతనంలో ఎంత పెరుగుదల ఉండవచ్చు?
8వ వేతన సంఘం ప్రకారం HRA, ప్రాథమిక వేతనంలో ఎంత పెరుగుదల ఉండవచ్చు?
Case On  Ola CEO: జీతాలు, అలవెన్స్‌ల చెల్లింపుల్లో వేధింపులు -  ఇంజినీర్ ఆత్మహత్య - ఓలా సీఈవోపై కేసు
జీతాలు, అలవెన్స్‌ల చెల్లింపుల్లో వేధింపులు - ఇంజినీర్ ఆత్మహత్య - ఓలా సీఈవోపై కేసు
Embed widget