AP Inter Exams: ఏపీ ఇంటర్ ఎగ్జామ్ పేపర్లు, పాస్ మార్కులలో కీలక మార్పులు..
Intermediate Pass Percentage in Andhra Pradesh | ఏపీ ఇంటర్ పరీక్షల విధానంలో మార్పులు చోటుచేసుకున్నాయి. విద్యార్థులకు ఊరట కలిగించేలా ఇంటర్ బోర్డ్ నిర్ణయం తీసుకుంది.

అమరావతి: ఏపీలో ఇంటర్ విద్యా విధానంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మాథ్స్ అంటే తలనొప్పిగా భావించే విద్యార్థులు ఎగిరి గంతేసేవార్త వచ్చింది. గణితంలో 1ఏ, 1బీ పేపర్ను ఒకే సబ్జెక్టుగా మార్పు చేశారు. గతంలో ఒక్కో పేపర్ 75 మార్కులు ఉండగా.. పాస్ మార్కులు 26గా ఉండేవి. ఇప్పుడు మ్యాథ్స్ ఒక్కటే పేపర్ ఉండగా 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. మ్యాథ్స్ పేపర్లో పాస్ మార్కులు 35గా నిర్ణయించారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్యార్థుల పాస్ పర్సంటేజీ, పాస్ మార్కులు, పేపర్ల విధానంలోనూ మార్పులు జరిగాయి. కొన్ని పేపర్లలో 30 శాతం మార్కులు వచ్చినా, ఓవరాల్ గా అన్ని పేపర్లలో సగటు 35 శాతం మార్కులు వస్తే ఇంటర్ పాస్ అయినట్లే అని మార్చారు.
బైపీసీలో బోటనీ, జువాలజీ కలిపి బయాలజీగా మార్పు చేశారు. ఫస్టియర్ లో 85 మార్కులకు పరీక్ష, పాస్ మార్కులు 29.. అలాగే సెకండియర్ లో 30 మార్కులు వస్తే పాస్ అవుతారు. గతంలో పాస్ మార్కులు 35గా ఉండేవి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ విద్యార్థులకు 30 మార్కుల చొప్పున ప్రాక్టికల్స్ ఉంటాయి. గతంలో ఫెయిలై పరీక్షలు రాస్తున్న వారికి కొత్త మార్పులు వర్తించవు అని స్పష్టం చేసింది విద్యాశాఖ. ఏపీ ఇంటర్ విధ్యా విధానంలో సంస్కరణల్లో భాగంగా ఏపీ విద్యాశాఖ కొత్తగా ఎలక్టివ్ సబ్జె్క్ట్ విధానం తీసుకొచ్చింది. ఏ గ్రూప్ విద్యార్థులైనా 24 సబ్జెక్టుల్లో దేనినైనా ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించారు.

ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌తో పాటు పరీక్షల్లోనూ మర్పులు తీసుకొచ్చారు. సైన్స్ సబ్జెక్టులు చదివే విద్యార్థులకు కొంత ఊరట కలగనుంది. మ్యాథ్స్ రెండు పేపర్లు కలిపి ఒకటే పేపర్ చేయగ పాస్ మార్కులు 35 చేశారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ పేపర్లలో పాస్ మార్కులను కాస్త తగ్గించారు. ఫస్టియర్ లో 29 మార్కులు, సెకండియర్ పరీక్షల్లో 30 మార్కులు వస్తే పాస్ అవుతారు. రెండేళ్లలో కలిపి మీకు 59 మార్కులు వచ్చినా పాస్ అయినట్లే. ఇప్పటివరకూ ఫస్టియర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలకు 85 మార్కులకు రాతపరీక్ష కాగా, పాస్ అవ్వడానికి 35% మార్కులు అంటే 29.75 మార్కులు రావాలి. ఇప్పుడు పాస్ మార్కులను 29కి తగ్గించారు. ఫస్టియర్‌లో 29 మార్కులు వస్తే పాస్. సెకండియర్‌లో 85 మార్కులకు 30 మార్కులు తెచ్చుకోవాలి. అయితే 2 సంవత్సరాలు కలిపి చూసుకుంటే 35% మార్కులు అంటే 59.50 మార్కులు రావాలి. కానీ అర మార్కు తగ్గించారు. ఇప్పుడు పాస్ మార్కులు 59 వస్తే చాలు.

ఈసారి కాస్త ముందుగానే ఇంటర్ ఎగ్జామ్స్
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ పరీక్షలు ఈసారి ముందుగానే నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఇంటర్ పరీక్షల ఫీజు గడువు అక్టోబర్ 22తో ముగియనుంది. రూ. 1000 ఆలస్య రుసుము (Late Fees)తో అక్టోబర్ 30 వరకు ఫీజు చెల్లించేందుకు ఏపీ ఇంటర్ బోర్డ్ అవకాశం కల్పించింది. ఎగ్జామ్ ఫీజు థియరీ పేపర్లకు రూ.600, ప్రాక్టికల్స్‌కు రూ.275, బ్రిడ్జికోర్సు ఒక్కో సబ్జెక్టుకు రూ.165 మేర చెల్లించాలి.






















