AP Inter Pass Marks: ఏపీ ఇంటర్ పాస్ మార్క్స్ విధానంలో మార్పులు, పాస్ పర్సంటేజీపై ఉత్తర్వులు
Intermediate Pass Percentage in Andhra Pradesh | ఏపీలో ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్యార్థుల పాస్ పర్సంటేజీ, పాస్ మార్కులతో మార్పులు తీసుకొచ్చారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Ap Intermediate Pass Percentage | అమరావతి: ఏపీలో ఇంటర్ మార్కుల విధానంలో మార్పులు చేశారు. ఏపీ ఇంటర్మీడియట్ మార్క్స్ విధానంలో 2025-26 విద్యా సంవత్సరం నుంచి మార్పులు జరిగాయి. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక విద్యార్థి ప్రతి పేపర్‌లో కనీసం 30 శాతం మార్కులు, ఒకే ప్రయత్నంలో 35% సరాసరి మార్కులు సాధిస్తే ఉత్తీర్ణులుగా ప్రకటిస్తారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా గరిష్ట & కనిష్ట మార్కులు పూర్తి వివరాలు

2025-26 విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులకు భౌగోళిక (Geography) ప్రశ్నపత్రం 75 మార్కులకు ఉంటుంది. మొత్తం 85 మార్కులు చేశారు. కొత్త సంస్కరణల ప్రకారం జాగ్రఫీని ఎలెక్టివ్ (ఛాయిస్) సబ్జెక్టుగా పరిగణిస్తారు. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రంతో సమానంగా ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. జాగ్రఫీ ప్రాక్టికల్ పరీక్షలకు, 50 మార్కుల నుంచి 30 మార్కులకు తగ్గించారు. ఈ ప్రాక్టికల్ పరీక్షలో కనీసం 35% అంటే 11 మార్కులు రావాలి. కనీసం 30% అంటే 9 మార్కులుగా పరిగణిస్తారు. 2025-26 విద్యా సంవత్సరంలో రెగ్యులర్ అభ్యర్థులుగా ప్రవేశం పొందిన ఇంటర్ విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది.






















