అన్వేషించండి

Prajavani News: ప్రజావాణిగా ప్రజాదర్బార్, ఇక నుంచి వారంలో రెండు రోజులు

Prajavani News: ప్రజాపాలన అందించే లక్ష్యంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. రోజురోజుకో సరికొత్త కార్యక్రమాల్లో పాలన సాగిస్తూ.. ప్రజలకు మరింత చేరువవుతోంది.

Telangana Government News: ప్రజాపాలన అందించే లక్ష్యంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం (Congress Governement ) ముందుకు సాగుతోంది. రోజురోజుకో సరికొత్త కార్యక్రమాల్లో పాలన సాగిస్తూ.. ప్రజలకు మరింత చేరువ అవుతోంది. ఇప్పటి వరకు చేపట్టిన ప్రజాదర్బార్‌ (Prajadarbar)ను ప్రజావాణి ( Prajavani)గా మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజాదర్బార్‌ పేరును ప్రజావాణిగా మార్చింది. ప్రతి మంగళవారం, శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావాణి నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఉదయం 10 లోపు ప్రజాభవన్‌కు చేరుకున్న వారికి వినతులు ఇచ్చేందుకు అవకాశం ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ప్రజా భవన్ (Praja Bhavan ) లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. దీంతో ఈ కార్యక్రమాన్ని వారంలో రెండు రోజులు నిర్వహించాలని నిర్ణయించింది. 

4,471 దరఖాస్తులు స్వీకరణ
హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబాఫూలే ప్రజాభవన్‌లో.. ఈ నెల 8న ప్రజాదర్బార్‌ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ( Chief Minister )రేవంత్‌రెడ్( Revanth reddy)డి ప్రారంభించారు. ప్రజలు తమకు సంబంధించిన వివిధ రకాల సమస్యలపై వినతి పత్రాలు సమర్పించేందుకు ప్రజాభవన్‌కు పెద్దఎత్తున చేరుకుంటున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభించిన నాటి నుంచి సోమవారం వరకు మొత్తం 4,471 వరకు వినతులు ప్రభుత్వానికి అందాయి. ఇందులో ఎక్కువ శాతం ధరణితో తలెత్తిన భూసమస్యలు, రెండు పడక గదుల ఇళ్లు మంజూరు, నిర్మాణం, వివిధ రకాల పింఛన్లకు సంబంధించిన వినతులే ఉన్నాయని అధికారులు తెలిపారు. సోమవారం నిర్వహించిన ప్రజా వాణి కార్యక్రమంలో 1,143 వినతి పత్రాలు అందాయని అధికారులు పేర్కొన్నారు. వికలాంగులు, మహిళలకు ప్రత్యేక క్యూ-లైన్లు ఏర్పాటుచేయాలని, ప్రజల సౌకర్యార్థం తాగునీరు, ఇతర సౌకర్యాలను కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పాలనలో తన మార్కును చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు వరుస సమీక్షలు నిర్వహిస్తూనే...మరోవైపు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. 

ప్రత్యేకత చాటుకుంటున్న రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ప్రత్యేకతను చాటుకుంటున్నారు. సమీక్షలు, సమావేశాలతో ఫలు బిజీగా ఉంటూనే, ఆరు గ్యారెంటీల అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాలు జారి పడ్డారు. దీంతో సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ను పరామర్శించారు. కేసీఆర్ కు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి బయటకు వస్తుండగా ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రేవంత్ రెడ్డి ఆస్పత్రి నుంచి బయటకు వస్తుండగా ఓ మహిళ...రేవంత్ అన్న రేవంత్ అన్న అని పిలిచి మీతో మాట్లాడాలని కోరింది. దీంతో అది విన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...ఆమె దగ్గరకు వెళ్లి మరీ తన సమస్యను అడిగి తెలుసుకున్నారు. మీ సమస్య ఏమిటో చెప్పాలని అడిగారు. తన పాప ఆస్పత్రికి సంబంధించిన ఖర్చు చాలా అవుతుందని, కొంచెం సాయం చేయాలని కోరింది. దీంతో వెంటనే స్పందించిన రేవంత్ రెడ్డి ఆ మహిళ సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Radhika Sarathkumar: ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
Jio 5G Upgrade Voucher: సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!
సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Radhika Sarathkumar: ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
Jio 5G Upgrade Voucher: సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!
సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!
PM Modi US Tour: జీ20 సమ్మిట్‌లో బిజీబిజీగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌‌తో ప్రత్యేకంగా భేటీ
జీ20 సమ్మిట్‌లో బిజీబిజీగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌‌తో ప్రత్యేకంగా భేటీ
Lagacharla Incident: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం, పరిగి డీఎస్పీపై ప్రభుత్వం చర్యలు
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం, పరిగి డీఎస్పీపై ప్రభుత్వం చర్యలు
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Viral News: స్టార్టప్ నెలకొల్పాలనే ఆశయం - ఓ ఆటోవాలా వినూత్న ఆలోచన
స్టార్టప్ నెలకొల్పాలనే ఆశయం - ఓ ఆటోవాలా వినూత్న ఆలోచన
Embed widget