Telangana: పోచారం శ్రీనివాస్ రెడ్డి, గుత్తా అమిత్ రెడ్డికి తెలంగాణ సర్కార్ కీలక పదవులు

Pocharam Srinivas Reddy appointed advisor to Telangana government | హైదరాబాద్: తెలంగాణలో నామినేటెడె పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. గత ప్రభుత్వం నియమించిన వారు కొన్ని నెలల కిందట రాజీనామా చేయగా, కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త వారిని నియమించింది. తాజాగా పోచారం శ్రీనివాసరెడ్డికి, గుత్తా అమిత్ రెడ్డిలకు రాష్ట్ర పదవులు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడిగా నియమించారు. రాష్ట్ర కేబినెట్ హోదాతో మాజీ స్పీకర్ పోచారాన్ని సలహాదారుడిగా నియమిస్తూ ప్రభుత్వం బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడైన గుత్తా అమిత్ రెడ్డిని కీలక పదవి వరించింది. తెలంగాణ డెయిల్ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి నియమితులయ్యారు. అమిత్ రెడ్డి రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు.
(ఇది బ్రేకింగ్ న్యూస్. ప్రస్తుతం దీనిని అప్‌డేట్ చేస్తున్నాం. లేటేస్ట్ అప్‌డేట్ కోసం రిఫ్రెష్ చేయండి)





















